Telugu govt jobs   »   Current Affairs   »   Virtually Rs 1072 Cr Industrial Units...

Virtually Rs 1072 Cr Industrial Units are Launched by YS Jagan | వర్చువల్ గా రూ. 1072 కోట్ల పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన వైఎస్ జగన్

Virtually Rs 1072 Cr Industrial Units are Launched by YS Jagan | వర్చువల్ గా రూ. 1072 కోట్ల పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన వైఎస్ జగన్

నెల్లూరు జిల్లాలో రూ.402 కోట్లతో ఎడిబుల్ సాయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం  జగన్ తాడేపల్లి లో ఉన్న తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. వీటిలో కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, సిగాచే పరిశ్రమలు గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లు కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ వంటి ప్రసిద్ద పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టింది మరియు పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు అన్నీ విధాలా కృషి చేస్తాము అని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం 386 అవగాహన ఒప్పందాలు కుదిరాయి, ఆరు లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు రచించాము అని సీఎం తెలిపారు. ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తి దశ లో ఉన్నాయి, 94 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

‘‘గత నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అయ్యాయి తద్వారా సుమారు రూ.69,000 కోట్ల పెట్టుబడులుతో రాష్ట్రంలో ఉన్న 86,000 మందికి ఉపాధి దక్కింది. నాలుగున్నర సంవత్సరాలలో 1.88 లక్షల MSMEలు కొత్తగా ఏర్పడ్డాయి. మరియు 21 MSME క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు చేపట్టము అని తెలిపారు.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

Intelligence Bureau (IB) ACIO Executive Tier (I + II) Complete Live Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!