Minister Started Various Developmental Works in Badrachalam | భద్రాచలంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి
తెలంగాణ లో ఉన్న భద్రాచలం పట్టణంలో సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే పొడెం వీరయ్య, జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారుల సమక్షంలో వివిధ అభివృద్ది పనులు ప్రారంభించారు. మొత్తం 15.10 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులు పట్టణ రూపు రేఖలను మార్చానున్నాయి. వీటిలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులు రూ.2.60 కోట్లతో ప్రారపంభించారు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కిచెన్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.21.50 లక్షలతో, సమీకృత కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ రూ.50 లక్షలతో మరియు వివిధ ప్రాంతాలలో రోడ్లు నిర్మించనున్నారు. రూ.38 కోట్లతో సుబాష్ నగర్లో ఉన్న గోదావరి నదికి ఆనుకుని కట్ట నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
అంతకు ముందు ఖమ్మం లో ఆదివారం నాడు 5.83 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా తెలంగాణ ప్రజలు అభివృద్దిని గుర్తించాలి అని మరియు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది అని తెలిపారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |