Telugu govt jobs   »   State GK   »   Telangana Movement & State Formation

Telangana Movement – Various Assemblies in the Spread of Telangana Ideologies, Download PDF| తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు

Telangana Movement & State Formation తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు

భారతదేశంలో ఒక ముఖ్యమైన సామాజిక-రాజకీయ తిరుగుబాటు తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఉద్భవించింది. 21వ శతాబ్దం ప్రారంభంలో ఊపందుకున్న ఈ ఉద్యమం, ప్రాంతీయ గుర్తింపు మరియు ఆకాంక్షల కథనాన్ని రూపొందించిన ఆందోళనలు, నిరసనలు మరియు రాజకీయ పరిణామాల శ్రేణితో గుర్తించబడింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడంలో మరియు ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ మరియు రాజకీయేతర రెండు సమావేశాల ద్వారా తెలంగాణ సిద్ధాంతాల/భావ జాల వ్యాప్తిని గుర్తించవచ్చు.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్

 • ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో గాదె ఇన్నయ్య  (ఇన్నారెడ్డి) తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు.
 • ఇదే సమయంలో వచ్చిన లోకసభ మధ్యంతర  ఎన్నికలలో తెలంగాణ ప్రజాపార్టీ తెలంగాణ వాదంతో పోటీచేసి ఓటమి పొందింది.
 • ఈ ఓటమితో నిరాశ చెందిన ప్రజాసంఘాలు రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని భావించారు.
 • అలా భావించిన  వారు ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో 1998 జూలై 5,6 తేదిలలో సదస్సును నిర్వహించారు.
 • ఈ సమావేశానికి హాజరైన ఇతర రాష్ట్రాల నాయకులు:
 1. యాసిన్ మాలిక్ (ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్, కాశ్మీర్)
 2. ఖగేన్ తాలూక్ దార్ (మానవ్ అధికార్ సంగ్రామ్, అస్సాం)
 3.  అనూపకుమార్ సింగ్ (ఛత్తీస్ఘడ్)
 • ఉపాధ్యాయులు, లాయర్లు, జర్నలిస్టులు, ఇతర తెలంగాణ ఉద్యమకారులు కలిసి సదస్సు రెండవ రోజున తెలంగాణ జనసభను 1998 జూలై లో హైదరాబాద్లోని రాణా ప్రతాప్ హాల్లో ఏర్పరిచారు.
 • తెలంగాణ జనసభ అంబర్పేట్ లో బహిరంగ సభ నిర్వహించింది.
 • ఈ సభ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు – ఎం.టి. ఖాన్
 • ఈ సభలోనే ‘జన తెలంగాణ’ మాసపత్రికను కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు.
 • ఈ మాసపత్రిక ఆవిష్కరణ అనంతరం కాళోజీ మాట్లాడుతూ తెలంగాణ వనరులను కొల్లగొడుతున్న కోస్తాంధ్ర పాలకవర్గాలకు ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్నిచ్చారు.
 • తెలంగాణ జనసభకు అనుబంధంగా జహంగీర్ కన్వీనర్ గా ‘తెలంగాణ కళాసమితి’ ఏర్పడింది.
 • తెలంగాణ కళాసమితికి కో-కన్వీనర్ గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999 మేలో భువనగిరిలో హత్య చేశారు.

తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్

 • తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 1998 అక్టోబర్ లో ఏర్పడింది.
 •  ఈ రెండు సంస్థలు సమిష్టిగా తెలంగాణ కోసం పోరాడాయి.

తెలంగాణ జనసభ, స్టూడెంట్ ఫ్రంట్ ల ఉద్యమాలు

 • కేశపట్నం (కరీంనగర్)లోని కల్వల ప్రాజెక్టు, కాకతీయ కాలువల మరమత్తు కోసం జనసభ నాయకత్వంలో 33 రోజుల పాటు రైతులు పోరాటం చేసి విజయం సాధించారు.
 • పాలమూరులో సున్నం కొండారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పోరాడి బాధితులకు ‘4 లక్షల’ నష్ట పరిహారం ఇప్పించారు.
 • 2000 వ సంవత్సరంలో ఈ సంస్థలు ప్రజా ‘చైతన్య యాత్రలు’ పేరుతో తెలంగాణలోని గ్రామాలలో తిరిగి ప్రజలను చైతన్యం చేయడంలో ఎంతో క్రియాశీలక పాత్రను పోషించాయి.

తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ

 •  తెలంగాణ ఉద్యమ భావాలు వ్యాప్తి కలిగిన ప్రజాసంఘాల నాయకులు కలిసి ఒక రాజకీయేతర సంఘాన్ని స్థాపించాలని భావించారు.
 • ఆ దిశలో పాశం యాదగిరి, హన్మండ్లు, చిక్కుడు ప్రభాకర్, ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ 2006 ఆగస్టులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించింది.
 • ఈ తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ లక్ష్యాలతో ఏకీభవించిన 32తెలంగాణ ప్రజాసంఘాల ఉద్యమ సంస్థలు భాగస్వాములయ్యాయి.
 • తద్వారా ఐక్యకార్యచరణ కమిటి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసింది.

పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్

 • సామాజిక లక్ష్యంతో కూడిన ప్రత్యేక తెలంగాణ కావాలని భావించిన వారు సామాజిక వర్గాల భాగస్వామ్యాలతో కూడిన పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ ను 2007లో స్థాపించారు.
 • ఈ ఫౌండేషన్ స్థాపనలో సింహాద్రి, మల్లేష్, ప్రొ॥ సత్యనారాయణ, ప్రొ॥ విశ్వేశ్వరరావు తదితరులు కీలకపాత్ర పోషించారు.

తెలంగాణ సంఘర్షణ సమితి

 • 2006లో తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేయడంలో బెల్లయ్య నాయక్, ఎర్ర జాన్సన్, అద్దంకి దయాకర్లు క్రియాశీలక పాత్ర పోషించారు.
 • ఈ సంస్థకు అనుబంధంగా తెలంగాణ విద్యార్థి సంఘమును ఏర్పాటు చేశారు.
 • ఈ తెలంగాణ విద్యార్ధి సంఘమునకు కన్వీనర్‌గా రాజారాం యాదవ్ ను నియమించారు.
 • కరీంనగర్ లో 2006 నవంబర్ 4న ఈ సమితి బహిరంగ సభను నిర్వహించింది.
 • కొండా లక్కణ్ణాపూజీ స్థాపించిన తెలంగాణ సాధన సమితి వేదిక, తెలంగాణ సంఘర్వణ సమితులు 2007 ఆగష్టులో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించాయి.
 • 2007 అక్టోబర్ 2న బేగంపేట విమానాశ్రయం వద్ద ప్లేన్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.
 • కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి పెద్దల ఆధ్వర్యంలో 2007 అక్టోబర్ లో ‘గాంధీగిరి’ కార్యక్రమం నిర్వహించారు.
 • బెల్లయ్య నాయక్ అధ్వర్యంలో ఊడలమర్రి (ఆదిలాబాద్) నుండి ప్రారంభమైన యాత్ర తెలంగాణ వ్యాప్తంగా సాగి హైదరాబాద్ లోని గన్పార్క్ వద్ద ముగిసింది.
 • ఈ తెలంగాణ సంఘర్వణ సమితి వరంగల్ లో ‘యుద్ధభేరి’ సభ నిర్వహించింది.

వివిధ సభలు -భువనగిరి సభ

 • 1997 మార్చి 8, 9వ తేదీలలో తెలంగాణా ప్రాంత ప్రజల బాధలను ప్రపంచానికి తెలియ చెప్పటానికి తెలంగాణా ప్రాంత ప్రజల బాధలను భువనగిరిలో సభను నిర్వహించారు.
 • ఈ సదస్సు ప్రాంగణానికి నిజాంవ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు.
 • ఈ సభకు ‘దగాపడ్డ తెలంగాణ’ గా నామకరణం చేశారు.
 • రచయితలు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు కలిసి ‘సాహితీ మిత్ర మండలి’ గా ఏర్పడి ఈ సభను నిర్వహించారు.
 • ఈ సభను కాళోజీ నారాయణరావు ప్రారంభించారు.
 • ఈ సమావేశంలో తెలంగాణ భాషా సాహిత్యాల పైన మరియు రాజకీయ, ఆర్థిక రంగాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయముల పైన చర్చించారు.

ఈ సభలో వివిధ మేధావులు ప్రసంగించిన భిన్న అంశాలు

 1. విద్యా, వైద్య రంగం – ప్రొ. జయశంకర్ సార్ 
 2. తెలంగాణ వనరులు – పారిశ్రామిక కాలుష్యం – ప్రొ. జాదవ్ సార్
 3. వలసీకరణ, ఉద్యోగాలు – ప్రొ. శ్రీనివాస్
 4. తెలంగాణ ఉద్యమం, అవగాహన-గద్దర్, వెంకటేశ్వర్లు
 5. భాషా సంస్కృతి, మీడియా – నందిని సిద్ధారెడ్డి
 6. సాంఘిక సంక్షేమ రంగం – ప్రొ. ఘంటా చక్రపాణి 
 7. రిజర్వేషన్లు, వర్గీకరణ – డా|| మత్తయ్య
 8. ఆదివాసి సమస్యలు – ప్రొ. బియ్యాల జనార్ధన రావు
 • ఈ సభాసమావేశంలోనే బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు కె.జి.సత్యమూర్తి తమ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుందని పేర్కొన్నాడు.
 • ఈ రెండు రోజుల సమావేశంలోనే తన ఉద్యమ పాటలతో బెల్లిలలిత తెలంగాణ వాదులు ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది.
 • ఈ విధంగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ‘బెల్లిలలిత’ను కొందరు గూండాలు అమానుషంగా చంపివేశారు.
 • మార్చి 9వ తేదీన జరిగిన ఈ సభాసమావేశానికి నాగారం అంజయ్య అధ్యక్షత వహించారు.

తెలంగాణ మహాసభ 

 • 1997 ఆగష్టులో దళిత బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా ‘తెలంగాణ మహాసభ ఏర్పడింది.
 • మారోజు వీరన్న అజ్ఞాతంలో ఉండడం చేత తెలంగాణ మహాసభ బాధ్యతలను వి. ప్రకాశ్, డా॥ చెరుకు సుధాకర్‌తో పాటు ఇతర అనుయాయులకు అప్పగించాడు.
 • 1997 ఆగష్టు 11న సూర్యాపేటలో ‘ధోఖా తిన్న తెలంగాణ’ పేరుతో సదస్సు జరిగింది.
 • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – డా॥ చెరుకు సుధాకర్
 • ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశ పెట్టినవారు – వి. ప్రకాశ్
 • 17 డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషనను డా॥ చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు.
 • ఈ సభ ‘కుల’ కోణంలో కోస్తాంధ్ర అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది.
 • బహుజన కులాల నుండి వచ్చిన నాయకత్వమే తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడగలదని ఈ సంస్థ విశ్వసించింది.

వరంగల్ డిక్లరేషన్

 • పార్లమెంటేతర వ్యక్తులు, శక్తులు మరియు విప్లవ పార్టీలు కూడా ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ తెలంగాణను అర్థం చేసుకొని మద్దతునిచ్చారు.
 • అనేక ప్రజాసంఘాలు కలిసి ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’గా ఏర్పడ్డాయి.
 • ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’ (ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆధ్వర్యంలో 1997 డిసెంబర్ 28, 29న వరంగల్ లో సభ జరిగింది.
 • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – ప్రొ॥సాయిబాబా.
 • ఈ సదస్సుకు ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అని నామకరణం చేశారు.
 • ఈ సభలోనే గద్దర్ (ఏప్రిల్ 6న గద్దర్ పై కాల్పులు జరిగాయి) చాలా కాలం తర్వాత మరలా పాటలు పాడడం ప్రారంభించాడు.
 • ఈ సభలోనే కాళోజీ వంటి కవులు & వివిధ సంస్థలు కలిసి ‘వరంగల్ డిక్లరేషన్’ ను విడుదల చేసారు.

చైతన్య వేదిక

 •  వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన ఉత్సాహంతో 1998 ఫిబ్రవరి 14, 15 తేదీలలో ‘చైతన్య వేదిక’ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో సదస్సు జరిగింది.
 • ఈ సదస్సులో తెలంగాణ స్థితిగతులపై, భవిష్యత్ కార్యాచరణ పై విస్తృతమైన చర్చ జరిగింది.

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష
తెలంగాణ ఉద్యమం- తెలంగాణ భావజాల వ్యాప్తి.
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు | తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం
తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు.

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

When was the separate state of Telangana officially formed?

Telangana was officially formed as a separate state on June 2, 2014.

What was the Telangana Movement?

The Telangana Movement was a socio-political movement in India advocating for the creation of a separate state, Telangana, from Andhra Pradesh.

Who founded the Telangana Rashtra Samithi (TRS)?

K. Chandrashekar Rao (KCR) founded the Telangana Rashtra Samithi (TRS) in 2001.