BRO లో నియమింపబడిన మొట్ట మొదటి మహిళా కమాండింగ్ అధికారిగా వైశాలి హివాసే
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో ఆఫీసర్ కమాండింగ్‌గా నియమించబడిన మొదటి మహిళా అధికారి వైశాలి ఎస్ హివాసే, ఇండో-చైనా సరిహద్దు రహదారి ద్వారా కనెక్టివిటీని అందించే బాధ్యత ఆమెపై ఉంటుంది. వైశాలి మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన వ్యక్తి మరియు కార్గిల్‌లో విజయవంతంగా భాధ్యతాయుతమైన పదవీకాలం పూర్తి చేసారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) భారత-చైనా సరిహద్దు వెంబడి ఎత్తైన ప్రదేశంలో కనెక్టివిటీని అందించే పనిలో ఉన్న రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ఆర్‌సిసి) కు మార్గనిర్దేశం చేయడానికి మొట్టమొదటిగా ఒక మహిళా అధికారిని నియమించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
BRO డైరెక్టర్ జనరల్: లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి;
BRO ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ
BRO స్థాపించబడింది: 7 మే 1960.