APPSC నుండి వెలువడనున్న 20 నోటిఫికేషన్లు
APPSC నుండి త్వరలోనే వివిధ విభాగళాలో ఉన్న ఖాళీలను భర్తి చేస్తాం అని పత్రికా ప్రకటనలో ఏపిపిఎస్సి బోర్డు సభ్యులు పరిగే సుధీర్ తెలిపారు. రానున్న 3నెలలో ఈ నోటిఫికేషన్లు వెలువడతాయి అని మరియు, APPSC గ్రూప్ 1కి సంబంధించి పూర్తి ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తన అధికారిక వెబ్‌సైట్ @psc.ap.gov.inలో అతి త్వరలో ఈ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి, ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000కి పైగా ఖాళీలను, గ్రూప్ 1కి సంభందించి 140కి పైగా ఖాళీలను, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాల అధ్యపకుల ఖాళీలను కూడా విడుదల చేయనున్నారు. APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023కి సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మీకు తెలియజేస్తాము.
APPSC ద్వారా త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ వివరాలు:
- గ్రూప్ 1
- గ్రూప్ 2
- డిగ్రీ లెక్చరర్
- పాలిటెక్నిక్ లెక్చరర్
- ఇంటర్మీడియట్ లెక్చరర్
- AEE
మేము ఇతర పోస్ట్ వివరాలను ఇక్కడ పత్రికా ప్రకటన వెలువడిన తర్వాత అప్‌డేట్ చేస్తాము.
APPSC గ్రూప్ 2 సిలబస్ లో మార్పులు:
రాబోయే నోటిఫికేషన్లలో గ్రూప్ 2 కి సంభందించి సమగ్రత కోసమే గ్రూప్ 2 సిలబస్ లో మార్పులు చేశారు. గత నోటిఫికేషన్లో హిస్టరీ మరియు పొలిటీకి కలిపి 150 మార్కులు ఉంటే ఒక్క ఎకనమిక్స్ కి మాత్రమే 150 మార్కులు ఉన్నాయి, దీని వలన ఎకనమిక్స్ చదివిన విధ్యార్ధులు మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ లాభ పడుతున్నారు ఈ విషయాన్ని గుర్తించి అందరికీ సమానమైన ప్రశ్న పత్రాన్ని సిలబస్ ని ప్రవేశపెట్టారు. నూతన సిలబస్ లో ఎకనమిక్స్-75 మార్కులకు, సైన్స్ అండ్ టెక్నాలజీ- 75 మార్కులు కేటాయించారు. కొత్తగా ఇండియన్ సొసైటిని సిలబస్ లో చేర్చారు.
గ్రూప్ 2 సిలబస్: ఇండియన్ సొసైటి
కొత్తగా ఇండియన్ సొసైటీ అనే కొత్త సిలబస్ లో, భారత సమాజం ఎలా ఉందని, కులాలు, మతాలు, వాటి వల్ల వచ్చే సమస్యలేంటి, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు ఏంటనేది ఈ సబ్జెక్ట్లో ఉంటుందని, ఈ అంశాలపై అవగాహన గ్రూప్ 2 అధికారికి చాలా అవసరమని, అందుకే సిలబస్లో మార్పలు చేశామని చెప్పారు.
నోటిఫికేషన్ కి సంభందించి ఏదైనా అధికారిక పత్రికా ప్రకటన వెలువడిన వెంటనే ADDA247 వెబ్సైట్ లేదా అప్లికేషన్ లో అప్డేట్ చేస్తాము.
ఏపిపిఎస్సి గ్రూప్ 2 గత సంవత్సర ప్రశ్న పత్రాలు
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |