Telugu govt jobs   »   Happy Ugadi

Happy Ugadi – Meaning and Significance | ఉగాది శుభాకాంక్షలు – కథ, అర్థం మరియు ప్రాముఖ్యత

ఉగాది శుభాకాంక్షలు: ఉగాది అనేది తెలుగు నూతన సంవత్సర పండుగ. ఈ తెలుగు కొత్త సంవత్సరానికి శ్రీ క్రోధి అని పేరు. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉగాదిని మహారాష్ట్రలో కూడా జరుపుకుంటారు మరియు దీనిని గుడి పడ్వా అని పిలుస్తారు. ఉగాది ఉల్లాసం, ఆనందం మరియు కుటుంబ సంబంధాలు మరియు సన్నిహిత బంధాల వేడుక. ఉగాది తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ మరియు వసంతకాలంలో జరుపుకుంటారు. ఈ పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం పాడ్యమితిధి, చైత్ర మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగలో ఉగాది పచ్చడి అనేది ఒక  ప్రత్యేక వంటకంగా ఉంటుంది. ఉగాది పచ్చడి జీవితంలో విభిన్న భావాలను సూచించే 6 రుచులను కలిగి ఉంటుంది. కొత్త సంవత్సరంలో అభ్యర్థులకు శుభం కలగాలని, అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు Adda247 కుటుంబం నుండి ఉగాది శుభాకాంక్షలు!!!

Ugadi Date | ఉగాది తేదీ

  • హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా, ఉగాది ని మార్చి/ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. అన్ని కోణంలో, ఉగాది భారతదేశంలో వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.
  • వసంత ఋతువును పంటకాలంగా పరిగణిస్తారు మరియు ఈ సమయంలో సీజన్ యొక్క కొత్త పంటను కోస్తారు.
  • ఈ సంవత్సరం, ఉగాది, వసంతకాలంలో చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున,  09 ఏప్రిల్ 2024న  జరుపుకుంటారు.

Ugadi Meaning | ఉగాది అర్థము

‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

The specialty of Ugadi Pachdi | ఉగాది పచ్చడి విశిష్టత

Ugadi Pachadi
Ugadi Pachadi

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . “ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

  • బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
  • ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
  • వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
  • చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
  • పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
  • కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

Health Benefits of Ugadi Pachhadi | ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

తెలుగువారి కొత్త సంవత్సరం(Telugu New Year) ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. పండగ ప్రత్యేకత ‘ఉగాది పచ్చడి’ (Ugadi Pacchadi). ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.

మధురం: ఈ పచ్చడిలో తీపినిస్తుంది కొత్తబెల్లం. ఇది ఆనందానికి సంకేతం. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైన రుచి తీపి. అంతేకాదు శరీరానికి పిండిపదార్ధాలను అందిస్తుంది బెల్లం. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. కొత్తకణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే కొంతమంది తీపి తింటే బరువు పెరుగుతామంటూ పక్కన పెడుతున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. కనుక తీపిని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఆమ్లం: పులుపు. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. అంతేకాదు పులుపు ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అయితే పులుపుని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు.

కారం: ఉగాది పచ్చడిలో మూడో రుచి కటు.. అంటే కారం. ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. ఆరోగ్య పరంగా చూస్తే , శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. జీర్ణశక్తిని పెంచుతుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. అయితే ఈ కారాన్ని కూడా తక్కువగానే తీసుకోవాలి. లేదంటే కడుపులో మంట, పిత్త సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కోపం పెరుగుతుంది.

ఉప్పు: ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం.. ఉప్పు.. ఇది భయానికి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే ఉప్పుని శరీరానికి తక్కువ పరిమాణంలోనే అందించాలి. అధిక మొత్తంలో ఉప్పుని తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. కీళ్ల వాతం, గ్యాస్ట్రిక్‌.. వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

చేదు: ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతిముఖ్యమైదని తిక్త.. చేదు. ఈ పచ్చడిలో ఈ రుచిని వేప పువ్వు ఇస్తుంది. అంతేకాదు ఈ ఉగాది పచ్చడికి వేప పువ్వే ప్రధానం. చేదు జీవితంలో కలిగే బాధలకు.. దుఃఖనికి సంకేతం. పచ్చడిలో చేదు రుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను బయటికి పంపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అయితే చేదును ఎక్కువగా తింటే శారీరకంగా బలహీనంగా మారతాము. బాధ, దిగులు ఎక్కువవుతాయి.

వగరు: ఉగాది పచ్చడిలో ఈ రుచి పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడి కాలానికి ఉగాదే మొదలు.ఈ రుచి ఆశ్చర్యానికి సంకేతం.ఈ రుచి శరీరం దృఢంగా ఉండడానికి అవసరం. గాయాలు మాని, మంట తగ్గడానికి ఈ వగరు రుచి ఉన్న పదార్థాలు తోడ్పడతాయి. అయితే అతిగా తీసుకుంటే వాత వ్యాధులు, పేగుల్లో సమస్యలు వస్తాయి. పలు మానసిక సమస్యలూ ఎక్కువవుతాయి.అందుకనే వగరు కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.

ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.

APPSC Group 2 Mains Selection Kit Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!