Telugu govt jobs   »   TSPSC will follow 1:3 ratio for...

TSPSC will follow 1:3 ratio for selection of candidates for district category posts | జిల్లా కేటగిరీ పోస్టులకు అభ్యర్థులు ఎంపికకు1: 3 నిష్పత్తిని అనుసరించనున్న TSPSC

TSPSC ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లలో పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చర్యలు చేపట్టింది. పోస్టుల భర్తీలో భాగంగా అత్యధిక సంఖ్యలో పోస్టులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న TSPSC గ్రూప్ 4 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తిని అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలోకి వచ్చే మిగలిన పోస్టులకు కూడా ఇదేవిధంగా అమలు చేస్తారని తెలుస్తోంది. జోనల్, మల్టీజోనల్‌ స్థాయి ఉద్యోగాలకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకోని అమలు చేసేందుకు TSPSC సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

అభ్యర్ధుల ఎంపికకు 1:3 నిష్పత్తి ఎందుకు?

నోటిఫికేషన్‌లో నిర్దేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియను పరిశీలిస్తే, దాదాపు 15 శాతం ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతాయి. అందుకు గల కారణాలలో ఒక్కో అభ్యర్థికి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం, అలాగే అన్ని రకాల పోస్టులకు సంబంధించి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ కు హాజరుకావడం, సరైన అభ్యర్థులు లేకపోవడం వంటి వాటి వలన ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో అర్హులైన అభ్యర్ధులను ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని TSPSC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పద్ధతి ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్నీ పోస్టులను కూడా భర్తీ చేయొచ్చని కమిషన్ యోచిస్తోంది.

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది

TSPSC ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్ లో ఉన్న TSPSC Group 1, TSPSC Group 2, TSPSC Group 3, TSPSC DAO, TSPSC HWO పరీక్షల తేదీలను ఇప్పటికే TSPSC ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్నీ అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘ఆన్సర్ కీ’లు, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను కూడా TSPSC విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కు సంబంధించి ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో TSPSC వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

TSPSC Group 3 Selection Kit Batch | Online Live Classes by Adda 247

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో, కోడ్ ముగిసిన తర్వాత ప్రాథమిక ఎంపిక లిస్ట్‌ను ప్రకటించడం, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది TSPSC. అయితే ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్ స్థాయి, మల్టీజోనల్‌ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా, ఇప్పటిదాకా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాలు బోర్డు(TREIRB) , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(TSLPRB), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TMHSRB) లు ప్రాథమిక లిస్ట్‌ ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాయి.

TSPSC Group 2 Selection Kit Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!