Telugu govt jobs   »   TSPSC Group 2   »   TSPSC Group 2 may be Postponed...

TSPSC Group 2 may be Postponed Again | TSPSC గ్రూప్ 2 మళ్లీ వాయిదా పడవచ్చు

TSPSC Group 2 may be Postponed Again | TSPSC గ్రూప్ 2 మళ్లీ వాయిదా పడవచ్చు: తెలంగాణ రాష్ట్రంలో TSPSC గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే పరీక్షకు ఈ వారంలో హాల్ టికెట్లు విడుదలవుతాయా? లేక మరోసారి పరీక్షలు వాయిదా పడతాయా? అనే  విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. TSPSC చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి మరియు మరో ముగ్గురు కమిషన్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించలేదు. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం, పరీక్షను నిర్వహించడం లేదా వాయిదా వేయడం వంటివి కమిషన్‌కు తుది అధికారం ఉంటుంది. రాజీనామాల పర్వం నడుస్తున్న ఈ సమయంలో  జనవరి 6 మరియు 7 తేదీల్లో జరగాల్సిన TSPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ పరీక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పరీక్ష వాయిదాపై మరో రెండు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

TSPSC గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారా?

2024 జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా? యధావిధిగా నిర్వహిస్తారా? అనే విషయమై TSPSC నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఒకవేళ జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు జరిగితే, పరీక్షలకు సరిగ్గా వారం రోజులు ముందుగా హాల్ టికెట్లు విడుదల చేయాలి. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ మునుపటి సంవత్సరం పేపర్లు, డౌన్‌లోడ్ PDF_30.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC బోర్డ్ సభ్యుల వరుస రాజీనామా

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత TSPSC చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి మరియు మరో ముగ్గురు కమిషన్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించలేదు. ప్రస్తుతం అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా సభ్యులుగా కొనసాగుతున్నారని, త్వరలోనే కొత్త చైర్మన్, సభ్యులను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా నియామక నోటిఫికేషన్లను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

TSPSC గ్రూప్ 2 పరీక్ష ఎన్ని సార్లు వాయిదా

ఇప్పుడు TSPSC గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడితే అది మూడోసారి అవుతుంది. తొలుత ఆగస్టు 29 మరియు 30 తేదీల్లో జరగాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థనల మేరకు నవంబర్ 2 మరియు 3 తేదీలకు మార్చబడింది. అయితే నవంబర్‌ తేదీలు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌తో ఉండటం వలన మళ్లీ జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 ఖాళీలను కమిషన్ గత ఏడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ADDAPEDIA Monthly Current Affairs eBooks (English and Telugu) By Adda247

TSPSC Group 2
TSPSC Group 2 Notification TSPSC Group 2 Selection Process
TSPSC Group 2 Syllabus TSPSC Group 2 Salary
TSPSC Group 2 Exam Pattern TSPSC Group 2 Books
TSPSC Group 2 Previous Year Questions Papers TSPSC Group 2 Exam Date
TSPSC Group 2 Previous Year cut-off  How to Prepare For TSPSC Group 2: Preparation Strategy
TSPSC Group 2 Hall Ticket 2023  How to Prepare Notes for TSPSC Group 2 2023 Exam?

Sharing is caring!