TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయబడింది
తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయబడింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ – 1 పరీక్షలు రద్దు అయినట్లు అయింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైనారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం పరీక్షను నిర్వహించారు. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయబడింది – అవలోకనం
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రద్దు చేసిన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వివరాలు ఇక్కడ అందించాము.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయబడింది | |
సంస్థ పేరు | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ పేరు | గ్రూప్ 1 |
పోస్టుల సంఖ్య | 503 |
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన తేదీ | 11 జూన్ 2023 |
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష స్థితి | రద్దు చేయబడింది |
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ | తెలియజేయాలి |
అధికారిక వెబ్‌సైట్ | http://tspsc.gov.in// |
TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2023
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడానికి గల కారణం
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని తెలియజేశారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా OMR షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని హై కోర్టు ఆదేశించింది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ – 1 పరీక్ష ఇంతకుముందే ఒకసారి రద్దైన సంగతి తెలిసిందే.
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |