Telugu govt jobs   »   Current Affairs   »   TSPSC ఛైర్మన్  గా ఎం.మహేందర్ రెడ్డి

TSPSC ఛైర్మన్ గా ఎం.మహేందర్ రెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి సమర్పించిన రాజీనామాలను గవర్నర్ తమిళిసై జనవరి 11 న ఆమోదించారు, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఛైర్మన్ మరియు ఇతర సభ్యుల నియామక ప్రక్రియ చేపట్టింది.

TSPSC ఛైర్మన్ గా ఎం.మహేందర్ రెడ్డి నియామకం

TSPSC ఛైర్మన్ మరియు ఇతర సభ్యుల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది ప్రస్తుతం TSPSC ఛైర్మన్  గా ఎం.మహేందర్ రెడ్డి నియమించబడ్డారు. ఎం. మహేందర్ రెడ్డి నియమకాన్ని గవర్నర్ ఆమోదించారు మరియు గతంలో ఆయన DGPగా పనిచేసిన అనుభవం ఉంది. TSPSC ఛైర్మన్ బాద్యతలను తెలంగాణ కి చెందిన ఒక విశ్రాంత ఐపిఎస్ అధికారికి అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు అయిదుగురు సభ్యులను కూడా ఎంపిక చేశారు, వీరిలో ముగ్గురు సభ్యులు అనితారాజేంద్ర, రజనీ కుమారి, యాదయ్య ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన సభ్యులు రామమోహన్ రావు, అమీరుల్లాఖాన్ ప్రమాణస్వీకారం చేయలేదు. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు నిబంధనల ప్రకారం నిర్వహిస్తాము అని ఛైర్మన్ తెలిపారు. అభ్యర్ధులకు  తొందర్లోనే నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించడానికి మార్గం సుగమం అయింది కావున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారి పరీక్షా ప్రణాళికని తయారుచేసుకోవాలి.

Telangana Mega Pack (Validity 12 Months)

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!