ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన “తెలంగాణ పునర్నిర్మాణ సభ”లో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 15 రోజుల్లోనే 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
TSLPRB పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తున్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన హామీలో భాగంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేవంత్ రెడ్డి వరుసగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
APPSC/TSPSC Sure Shot Selection Group
15 రోజులలో 15000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూసే అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియ త్వరలోనే చేపడతామన్నారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేసే బాధ్యత మంత్రి వర్గం తీసుకుంటుంది అని చెప్పారు.
2022 లో తెలంగాణలో సివిల్, AR తదితర 16,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,640 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ TSLPRB కానిస్టేబుల్ ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేసింది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |