Telugu govt jobs   »   Article   »   TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్...

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 చివరి తేదీ, దరఖాస్తు లింక్

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు

మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలోని 1931 మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల (మహిళ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 పక్రియ 01 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023 సాయంత్రం 5.00 వరకు ఉంటుంది. TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కు ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కధనంలో TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అందించాము.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023, 1520 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 01 సెప్టెంబర్ 2023 నుండి 19 సెప్టెంబర్ 2023 వరకు అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.inలో అందుబాటులో ఉంటుంది. TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్ లైన్ దరఖాస్తు అవలోకనం

సంస్థ పేరు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB)
పోస్ట్ పేరు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
పోస్ట్‌ల సంఖ్య 1931
నోటిఫికేషన్ విడుదల తేదీ 26 జూలై 2023
వర్గం ఆన్ లైన్ దరఖాస్తు
దరఖాస్తు విధానం ఆన్ లైన్
ఉద్యోగ స్థానం తెలంగాణ
పే స్కేల్ రూ. 31,040 – 92,050
అధికారిక సైట్ https://mhsrb.telangana.gov.in

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు 2023 ముఖ్యమైన తేదీలు

కింది పట్టికలో, అభ్యర్థులు TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్ లైన్ దరఖాస్తు 2023 కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను వివరంగా తెలుసుకోవచ్చు.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ 2023 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్స్ తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 26 జూలై 2023
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ 01 సెప్టెంబర్ 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023
పరీక్ష తేదీ

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 01 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు పక్రియ చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023 సాయంత్రం 5.00 వరకు ఉంటుంది. అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించకుండా మేము TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్ ను ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్  కి దరఖాస్తు చేసుకోగలరు. లింక్ ఆక్టివ్ కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023 

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కి ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కి 1931 ఖాళీల పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కింది దశలను అనుసరించి అభ్యర్ధులు తమ దరఖాస్తును సమర్పించవచ్చు.

 • దశ 1: అభ్యర్ధులు ముందుగా మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ను సందర్శించాలి.
 • దశ 2:  మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
 • దశ 3: దరఖాస్తు ఫారమ్‌లో పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, విద్యార్హత మొదలైన అన్ని తప్పనిసరి వివరాలను పూరించి నమోదు చేసుకోండి.
 • దశ 4: రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ పొందడానికి సూచనలను అనుసరించండి మరియు దశల వారీగా నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
 • దశ 5: నిర్ణీత పరిమాణంలో పత్రాల స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
 • దశ 6: సమర్పించే ముందు, దరఖాస్తు ఫారమ్‌ను ప్రివ్యూ చేసి, అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
 • దశ 7: భవిష్యత్ సూచన కోసం మీ దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ 2023 దరఖాస్తు రుసుము

 • ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500/-. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు.
 • ప్రాసెసింగ్ ఫీజు: దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200/-.
 • అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH & మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రంలోని 18 నుండి 44 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
 • గమనిక: ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడరు.

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 01 సెప్టెంబర్ 2023

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 19 సెప్టెంబర్ 2023

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

TS MHSRB మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కి ఈ కధనంలో ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.