Telugu govt jobs   »   Current Affairs   »   TIMS to Setup Medical Edu Research...

TIMS to Setup Medical Edu Research Center in Hyderabad | హైదరాబాద్ లో మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఏర్పాటు చేయనున్న TIMS

TIMS to Setup Medical Edu Research Center in Hyderabad | హైదరాబాద్ లో మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఏర్పాటు చేయనున్న TIMS

తెలంగాణ లో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ సేవాలతో పాటు నర్సింగ్ మరియు డెంటల్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో వివిధ కోర్సులను అందించడంతో పాటు ఇవి నాణ్యమైన వైద్య విధ్యను అందిస్తాయి అని భావిస్తున్నారు. TIMS స్పెషాలిటీ ఆసుపత్రులలో ప్రత్యేక డెంటల్ మరియు నర్సింగ్ కళాశాలలను కలిగి ఉంటాయి. వీటికి అదనంగా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు మరియు మెడికల్ టెక్నీషియన్‌ల వంటి పారామెడికల్ మరియు అనుబంధ కోర్సులను కూడా అందించనున్నాయి.

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాక్ట్, 2023 ప్రకారం TIMS తరపునుండి, నర్సులకు, డెంటల్ లోను శిక్షణ అందించనుంది. వీటితో పాటు ఇతర ముఖ్యమైన వైద్య కోర్సులను కూడా అందించేందుకు వీలు కల్పించనుంది. “ఆరోగ్య కార్యకలాపాల యొక్క అన్ని ముఖ్యమైన శాఖలలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి మరియు PG వైద్య విద్య రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి TIMS అత్యున్నత స్థాయి విద్యా సౌకర్యాలను ఒకే చోట తీసుకువస్తుంది” అని ఈ TIMS యాక్ట్ లో పొందుపరిచారు.

TIMS నాలుగు చోట్ల గచ్చిబౌలి, ఎల్‌బి నగర్, అల్వాల్ మరియు సనత్‌నగర్‌లో వివిధ కళాశాలను ఏర్పాటు చేయనుంది. రూ.2,679 కోట్లతో ఈ నాలుగు చోట్ల కళాశాలను అభివృద్ధి చేయనుంది. వీటి ఏర్పాటుతో వైద్య విధ్యలో PG స్థాయి లో వివిధ కోర్సు లను అందించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే డాక్టర్లను సమాజానికి అందించనుంది. NIMS, OGH, మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల మాదిరిగానే రోగులకు మంచి ఆరోగ్య సేవలను అందిస్తుంది.

National Highways in Telangana, Download PDF_250.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!