ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పంచాయతీలు జాతీయ అవార్డులను అందుకున్నాయి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ లోని మూడు గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం జాతీయ పంచాయతీ అవార్డులను అందుకోవడానికి రాష్ట్రంలోని పలు పంచాయతీలను ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా జూన్ 5న జాతీయ పర్యావరణ దినోత్సవం రోజున ఈ అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా, ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు పంచాయతీలతో సహా దేశవ్యాప్తంగా 100 పంచాయతీలను ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసిన పంచాయతీల్లో తూర్పుగోదావరి జిల్లా బిల్లనందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడలూరు ఉన్నాయి. జూన్ 5న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం ఆయా పంచాయతీలకు ఈ అవార్డులను అందజేయనుంది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************