There are three Telugu members in the NCTE Southern Regional Committee | జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సదరన్ రీజనల్ కమిటీలో ముగ్గురు తెలుగువారు
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సదరన్ రీజనల్ కమిటీలో తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ఒకరు సభ్యులుగా నియమితులయ్యారు. కమిటీలో ఛైర్‌పర్సన్ తో పాటు మరో ఆరుగురు సభ్యులుంటారు.
తెలంగాణ నుంచి పారిపల్లి శంకర్ (ఓయూ విద్యా విభాగం), వనజ మహదాసు (ఉర్దూ వర్సిటీ) నియమితులయ్యారు. వీరిలో పారిపల్లి శంకర్‌కు రెండోసారి స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన ప్రహ్లాద్ రుద్రప్ప జోషి నియమితులయ్యారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా కర్ణాటక మహిళా విశ్వవిద్యాలయం మాజీ వీసీ మీనా రాజీవ్ చంద్రవార్కర్‌ను ఎన్‌సీటీఈ నియమించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సదరన్ రీజనల్ కమిటీ పదవీ కాలం రెండేళ్లు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |