హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్ పేర్కొంది. ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని.. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయని పేర్కొంది. 2020 మార్చి 31తో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది.
‘బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని ప్రభుత్వం అధిగమించింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారు. 75 శాతానికి పైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారు. దీంతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడింది. 2019-20లో విద్య, వైద్యరంగాలపై తక్కువ ఖర్చు కొనసాగింది. ఆ ఏడాదిలో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదు’’ అని కాగ్ పేర్కొంది.
ముఖ్యమైన అంశాలు
CAG చైర్‌పర్సన్: శ్రీ గిరీష్ చంద్ర ముర్ము
CAG ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
******************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
