Telugu govt jobs   »   Telugu Current Affairs   »   The Government of Andhra Pradesh has...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలుబండ గ్లోబల్‌ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలుబండ గ్లోబల్‌ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుంది.

అల్యూమినియం కాయిల్స్, ప్యానెళ్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు దుబాయ్‌కి చెందిన అలుబండ గ్లోబల్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దుబాయ్‌ ఎక్స్‌పో – 2020లో భాగంగా అవగాహన ఒప్పంద పత్రాలపై (ఎంవోయూ) సంస్థ ఛైర్మన్‌ షాజి ఎల్‌ ముల్క్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో సుబ్రమణ్యం ఫిబ్రవరి 17న సంతకాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అబుదాబిలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, జీ42, ముబదల గ్రూప్‌ ప్రతినిధులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్, స్మార్ట్‌సిటీ, హెల్త్‌కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్‌ గవర్నెన్స్, ఐటీ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు అవకాశముందని వివరించారు. ఈ సమావేశంలో జీ42 కంపెనీ ముఖ్య అభివృద్ధి అధికారి రఫేల్‌ బ్రెస్పి, గ్రూప్‌ సీఈవో మన్సూర్‌అల్‌ మన్సూరి పాల్గొన్నారు.

ఏపీలో ఫుడ్‌పార్కులు, ఆహారశుద్ధి పరిశ్రమల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని అలానా గ్రూప్‌ ఛైర్మన్‌ ఇర్ఫాన్‌ అలానాను మంత్రి కోరారు. గల్‌్్ఫఫుడ్‌ ఫెస్టివల్‌లో అలానా ఫుడ్‌ పరిశ్రమ ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి పరిశీలించారు. రంజాన్‌ తర్వాత రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశంపై చర్చిస్తామని అలానా గ్రూప్‌ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

 

రెండు లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు షరాఫ్‌ గ్రూప్‌తో ఒప్పందం

 

రాష్ట్రంలో రెండు లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు కోసం దుబాయ్‌కి చెందిన షరాఫ్‌ గ్రూప్‌ రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ మొత్తంతో గిడ్డంగులు, ప్యాకేజింగ్‌ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు ఏర్పాటు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల 700 మందికి ప్రత్యక్షంగా, 1300 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

ap-top-in-telemedicine-services

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ap-top-in-telemedicine-services

 

Sharing is caring!