Telugu govt jobs   »   Telugu Current Affairs   »   The central government has allocated Rs...

ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 7,032 కోట్లు కేటాయించింది , The central government has allocated Rs 7,032 crore for AP railway projects

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రూ.7,032 కోట్లను కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆయన బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, తలారి రంగయ్య, వై.ఎస్‌.అవినాశ్‌రెడ్డి అడిగిన వేర్వేరు ప్రశ్నలకు బదులిచ్చారు. ‘2021 ఏప్రిల్‌ 1 నాటికి పూర్తిగా/పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వచ్చే 1,917 కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.22,670 కోట్ల విలువైన ఈ పనుల్లో 130 కిలోమీటర్ల మార్గం ఇప్పటికే ప్రారంభమైంది. ఏపీలో మౌలిక వసతులు, భద్రతా పనుల కోసం 2009-14 మధ్య కాలంలో ఏటా రూ.886 కోట్లు కేటాయించగా 2014-19 మధ్య కాలంలో ఆ మొత్తాన్ని రూ.2,830 కోట్లకు పెంచాం. గత అయిదేళ్లలో వార్షిక కేటాయింపులు 219% పెరిగాయి. గతానికి భిన్నంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రాజెక్టుల కోసం రూ.7,032 కోట్లు కేటాయించాం. 2009-14 మధ్యకాలంలో కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 694% అధికం’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 1,515 ఐఏఎస్‌ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 6,746 పోస్టులకు ప్రస్తుతం 5,231 పోస్టులే భర్తీ అయినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 45, తెలంగాణలో 44 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 346 మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ తెలిపారు. లోక్‌సభలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని గోదాములను నిర్మిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ తెలిపారు. లోక్‌సభలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ముఖ్యమైన అంశాలు

కేంద్ర రైల్వే మంత్రి: అశ్వినీ వైష్ణవ్‌

 

The central government has allocated Rs 7,032 crore for AP railway projects

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

The central government has allocated Rs 7,032 crore for AP railway projects

 

Sharing is caring!