తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్‌లో వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, స్టాఫ్ నర్సు (నర్సింగ్ ఆఫీసర్), ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, ఆయుష్ ఫార్మాసిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో, తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ను తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 11 సెప్టెంబర్ 2024 న విడుదల చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
TG MHSRB రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ లో దరఖాస్తు గడువులు, పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానాలు, సిలబస్, ఎంపిక, జీతం నిర్మాణాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారంతో సహా పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉంటాయి. TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 నోటిఫికేషన్ PDFని యాక్సెస్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించబడింది. దిగువ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 నోటిఫికేషన్ PDF
TG MHSRB రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు
TG MHSRB రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన కీలకమైన రాబోయే ఈవెంట్‌లు మరియు తేదీలు ఇక్కడ ఉన్నాయి. అభ్యర్థులు TG MHSRB 2024 పరీక్షకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీల కోసం క్రింది పట్టికను చూడండి.
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 ముఖ్యమైన తేదీలు | |
ఈవెంట్స్ | తాత్కాలిక తేదీలు |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ నోటిఫికేషన్ PDF విడుదల | 11 సెప్టెంబర్ 2024 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 21 సెప్టెంబర్ 2024 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | 05 అక్టోబర్ 2024 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ ఆన్‌లైన్ దరఖాస్తు ఎడిట్ | 05 నుండి 07 అక్టోబర్ 2024 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ పరీక్ష (CBT) తేదీ | 10 నవంబర్ 2024 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే, అక్టోబర్ 5 నుండి 7వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 ఖాళీలు
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II 2024 ఖాళీలు | |
ప్రజారోగ్య సంచాలకుల విభాగం | 1,088 |
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి | 183 |
హైదరాబాద్ MNJ క్యాన్సర్ ఆస్పత్రి | 13 |
మొత్తం | 1,284 |
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ పరీక్ష తేదీ
అభ్యర్థుల ఎంపిక కోసం నవంబర్ 10న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్ష నిర్వహించబడుతుంది. దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉంటే, పరీక్షను రెండు లేదా మూడు సెషన్లలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష పేపర్ పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ఉండనుంది.
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ అర్హత ప్రమాణాలు 2024
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టులకు అర్హత ప్రమాణాలు క్రింద అందించబడ్డాయి:
విద్యార్హతలు:
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టులకు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది వాటిలో ఏదో ఒక విద్యార్హతను కలిగి ఉండాలి.
- సర్టిఫికెట్ ఇన్ ల్యాబోరేటరీ టెక్నిషియన్ కోర్సు
- MLT(VOC)/ ఇంటర్మీడియట్ (MLT వొకేషనల్).. ఒక ఏడాది క్లినికల్ ట్రైనింగ్/అప్రెంటిషిప్ ట్రైనింగ్
- డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు (DMLT)
- బీఎస్సీ (MLT)/ ఎంఎస్సీ(MLT)
- డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నీషియన్ కోర్సు
- బ్యాచ్‌లర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ (BMLT)
- పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ
- పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ
- బీఎస్సీ (మైక్రో బయోలజీ) / ఎంఎస్సీ (మైక్రో బయోలజీ)
- ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయో కెమిస్ట్రీ
- ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రో బయోలజీ
- ఎంఎస్సీ ఇన్ బయో కెమిస్ట్రీ
వయోపరిమితి ( 01/07/2024 నాటికి)
- దరఖాస్తుదారులు కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు మించకూడదు. వయస్సు 01/07/2024 నాటికిలెక్కించబడుతుంది
- SC/ST/BCs &EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 03 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు.
ప్రత్యేక వెయిటేజ్ మార్కులు
ఈ పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక వెయిటేజ్ మార్కులు ఇవ్వబడతాయి. ఇందుకోసం, అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవ ధృవపత్రాలను సమర్పించాలి. అలాగే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యార్హతలను తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిష్టర్ చేసుకోవడం తప్పనిసరి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |