Tera Rajinikanth Reddy Elected as AAG of Telangana High Court | తెలంగాణ హైకోర్టు AAGగా తేరా రజనీకాంత్ రెడ్డి ఎన్నికయ్యారు
తెలంగాణ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) గా న్యాయవాది తేరా రజనీకాంత్ రెడ్డిని నియమస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆ బాధ్యతలను తప్పించే వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు. గత ప్రభుత్వ హయాంలో అనేక అంశాలపై రేవంత్రెడ్డి హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం చేశారు. రేవంత్ తరఫున రజనీకాంత్ ఆ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించారు. ముఖ్యమైన కేసులన్నీ కూడా రజనీకాంత్ తో చర్చించేవారు. రజినీకాంత్ 45 ఏళ్లకే అదనపు ఏజీగా అవకాశం దక్కింది. తెలంగాణ, ఏపీ, ఉమ్మడి హైకోర్టులలో చూసినా అతిపిన్న వయసులో AAG బాధ్యతలు చేపడు తున్న న్యాయవాదిగా తేరా రికార్డు కెక్కనున్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాత రెండవ AAGగా వ్యవహరించనున్నారు.
APPSC/TSPSC Sure shot Selection Group
తేరా రజనీకాంత్ రెడ్డి గురించి
రజనీకాంత్ స్వస్థలం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పిన్నఊర. ఉస్మానియా వర్సిటీ నుండి LLB పూర్తి చేశారు. 2004లో న్యాయవాదిగా హైకోర్టులో నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో 200లకు పైగా, తెలంగాణ హైకోర్టులో 900పైగా కేసులు వాదించారు. హైకోర్టులో ఏపీ జెన్కో స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. 2019లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా గెలిచారు. పలు ట్రిబ్యునళ్ల తరఫున న్యాయవాదిగా కూడా వ్యవహరించారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |