Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers ,5...

Telugu Practice Questions and Answers ,5 April 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,5 April 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు                         

Q1. సంఘ సంస్కర్తలు దూరాచారాలనునిర్మూలించారు అనే  కర్తరి వాక్యానికి ఈ   క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి? 

(a) సంఘసంస్కర్తలు అందరూ దురాచారాలను నిర్మూలించారు. 

(b) సంఘ సంస్కర్తలు అయిన కందుకూరి గారు దురాచారాలను నిర్మూలించారు. 

(c)సంఘ సంస్కర్తల చేత దూరాచారాలు నిర్మూలించబడ్డాయి. 

(d) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడలేదు.

 

Q2.ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది  కర్తరి వాక్యం అవుతుందో  గుర్తించండి ?

(a) సంఘ సంస్కర్తలు వెట్టి చాకిరిని నిర్మూలించబడేల చేశారు. 

(b) శ్రీనాథుడు ఎన్నో కావ్యాలు రచించారు.

(c)లేఖలో నా భావాలు రచించబడెను.

(d) నా ఆలోచనలు కవితల రూపంలో రచనలుగా ముద్రించబడ్డాయి.

 

Q3. గురువు గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు అనే  కర్తరి వాక్యానికి ఈ  క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి 

(a) మంచి నిర్ణయాలు గురువు గారిచే తీసుకోబడ్డాయి.

(b) గురువు గారు ఎల్లప్పుడూ మంచి నిర్ణయాలను తీసుకుంటారు. 

(c) గురువు గారి చేత తీసుకోబడలేదు మంచి నిర్ణయాలు

(d) మంచి నిర్ణయంలను తీసుకున్నారు గురువుగారు.

 

Q4.రామకృష్ణారావు ఆమోద ముద్ర వేశారు అనే  కర్తరి వాక్యానికి ఈ  క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి?  

(a) ఆమోద ముద్ర రామకృష్ణ రావు చే వేయబడింది. 

(b) రామకృష్ణా రావుచే ఆమోద ముద్ర వేయబడింది.

(c) a మరియు b సరియైన సమాధానం

(d) a సమాధానం సరికాదు, b సమాధానం సరియైనది.

 

Q5. కొంతకాలం పర్షియన్ ట్యూటర్ గా ఆయన చేత పని చేయబడింది అనే కర్మణి  వాక్యానికి ఈ క్రింది ఇచ్చిన వాటిలో  కర్తరి వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి ?

(a)కొంతకాలం పర్షియన్ ట్యూటర్ పనినినిర్వర్తించారు. 

(b)ఆయన కొంత కాలం పర్షియన్ ట్యూటర్ పని చేశాడు

(c)కొంత కాలం గా పర్షియన్ ట్యూటర్ గా సేవలు అందించబడ్డాయి.

(d) ఆయన కొంత కాలం పర్షియన్ ట్యూటర్ గా పని చేసినారు.

 

Q6. వీరి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బుర పరిచింది. ఈ వాక్యం ఏ రకమైన వాక్యమో గుర్తించండి?

(a) కర్తరి వాక్యం.

(b) కర్మణి వాక్యం

(c) క్రియా రహిత వాక్యం

(d) a మరియు C సరియైన సమాధానం

 

Q7. పిల్లలతో నాయకులు సమయాన్ని గడిపారు అనే  కర్తరి వాక్యానికి ఈ క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి?   

(a) పిల్లలచే నాయకులతో సమయం గడపబడుతుంది.

(b) పిల్లలచే నాయకులతో సమయం గడపబడింది. 

(c)పిల్లలు చే నాయకులతో సమయం గడపబడింది. 

(d) ఏది కాదు

 

 Q8. ప్రకృతి విలయ తాండవమును సృష్టించగలదు అను  కర్తరి వాక్యానికి ఈ  క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి? 

(a) ప్రకృతి విలయ తాండవం లో సృష్టించబడింది.

(b)ప్రకృతి విలయ తాండవంను సృష్టించగలదు.

(c)విలయ తాండవం తో ప్రకృతి సృష్టింపబడింది.

(d)ప్రకృతిచే విలయ తాండవం సృష్టించబడగలదు.

 

Q9.నాలో అభ్యుదయ భావాలు వర్ధిలాయి అను ఈ కర్తరి వాక్యానికి  క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి?  

(a)నాతో అభ్యుదయ భావాలు వర్ధిలబడ్డాయి .

(b)నాలో అభ్యుదయ భావాలు వర్ధిల్లబడతాయి. 

(c) నాలో అభ్యుదయ భావాలు వర్ధిల్లబడుతున్నాయి. 

(d) నాలోనూ అభ్యుదయ భావాలు వర్ధిల్లబడ్డాయి.

 

Q10. యువతలందరూ నా మల్లెలు ధరించారుఅను  కర్తరి వాక్యానికి ఈ క్రింది ఇచ్చిన వాటిలో కర్మణీ వాక్యంలలో ఏది సరి అయినదో గుర్తించండి?  

(a)నాచే యువతలందరూ మల్లెలు ధరించబడ్డారు

(b)యువతలందరూ నాచే మల్లెలు ధరించబడ్డారు

(c)నా మల్లెలుయువతులందరిచే ధరించబడ్డాయి.  

(d)మల్లెలు ధరించబడ్డాయి యువతులచే

జవాబులు                         

Q1.ANS (c)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డ, ము, వు, లు.

ఉదా:సంఘసంస్కర్తలుదూరాచారాలనునిర్మూలించారు(కర్తరి వాక్యం)

సంఘ సంస్కర్తల చేత దూరాచారాలు నిర్మూలించబడ్డాయి.(కర్మణీ వాక్యం)

 

Q2. ANS (b)

కర్తరి వాక్యం – కర్త. ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. 

*దీనిని ఆంగ్లంలో ” Active voice” అని అంటారు.

*క్రియ- ని ఎవరు, ఎవడు అని ప్రశ్నించగా వచ్చేది – కర్త *కర్త ప్రథమా విభక్తి లో ఉంటుంది.

*ప్రథమం విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

*కర్మ- ద్వితీయ విభక్తిలో ఉంటుంది.

*ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ , నున్ , లన్ , కూర్చి , గురించి లతో కలిసి ఉంటాయి.

*ఉదా: శ్రీనాథుడు ఎన్నో కావ్యాలు రచించారు.(కర్తరి వాక్యం)

శ్రీనాథుడు చేత ఎన్నో కావ్యాలు రచింపబడ్డాయి(కర్మణీ వాక్యం)

 

Q3.ANS (a)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డ, ము, వు, లు.

ఉదా:గురువు గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు(కర్తరి వాక్యం)

మంచి నిర్ణయాలు గురువు గారిచే తీసుకోబడ్డాయి.(కర్మణీ వాక్యం)

 

Q4. ANS (c)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డ, ము, వు, లు.

*ఉదా:రామకృష్ణారావు ఆమోద ముద్ర వేశారు(కర్తరి వాక్యం)

*ఆమోద ముద్ర రామకృష్ణ రావు చే వేయబడింది(కర్మణీ వాక్యం)

*రామకృష్ణా రావుచే ఆమోద ముద్ర వేయబడింది (కర్మణీ వాక్యం)

 

Q5. ANS (b)

కర్తరి వాక్యం – కర్త. ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. 

*దీనిని ఆంగ్లంలో ” Active voice” అని అంటారు.

*క్రియ- ని ఎవరు, ఎవడు అని ప్రశ్నించగా వచ్చేది – కర్త *కర్త ప్రథమా విభక్తి లో ఉంటుంది.

*ప్రథమం విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

*కర్మ- ద్వితీయ విభక్తిలో ఉంటుంది.

*ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ , నున్ , లన్ , కూర్చి , గురించి లతో కలిసి ఉంటాయి.

*ఉదా : ఆయన కొంత కాలం పర్షియన్ ట్యూటర్ పని చేశాడు( కర్తరి వాక్యం)

*కొంతకాలం పర్షియన్ ట్యూటర్ గా ఆయన చేత పని చేయబడింది(కర్మణీ వాక్యం)

 

Q6.ANS(a)

కర్తరి వాక్యం – కర్త. ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. 

*దీనిని ఆంగ్లంలో ” Active voice” అని అంటారు.

*క్రియ- ని ఎవరు, ఎవడు అని ప్రశ్నించగా వచ్చేది – కర్త *కర్త ప్రథమా విభక్తి లో ఉంటుంది.

*ప్రథమం విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

*కర్మ- ద్వితీయ విభక్తిలో ఉంటుంది.

*ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ , నున్ , లన్ , కూర్చి , గురించి లతో కలిసి ఉంటాయి

*ఉదా:వీరి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బుర పరిచింది. 

 

Q7 ANS (d)

కర్తరి వాక్యం – కర్త. ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. 

*దీనిని ఆంగ్లంలో ” Active voice” అని అంటారు.

*క్రియ- ని ఎవరు, ఎవడు అని ప్రశ్నించగా వచ్చేది – కర్త *కర్త ప్రథమా విభక్తి లో ఉంటుంది.

*ప్రథమం విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

*కర్మ- ద్వితీయ విభక్తిలో ఉంటుంది.

*ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ , నున్ , లన్ , కూర్చి , గురించి లతో కలిసి ఉంటాయి 

*ఉదా:పిల్లలతో నాయకులు సమయాన్ని గడిపారు(కర్తరి వాక్యం)

నాయకులచే పిల్లలతో సమయం గడపబడింది(కర్మణీ వాక్యం) 

ఇచ్చే సమాధానం అర్ధవంతం గా ఉండాలి.

 

Q8.ANS(d)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

*ఉదా:ప్రకృతి విలయ తాండవమును సృష్టించగలదు(కర్తరి వాక్యం)

*ప్రకృతిచే విలయ తాండవంసృష్టించబడగలదు(కర్మణీ వాక్యం) 

 

Q9.ANS(d)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

ఉదా:నాలో అభ్యుదయ భావాలు వర్ధిలాయి(కర్తరి వాక్యం)

నాలోనూ అభ్యుదయ భావాలు వర్ధిల్లబడ్డాయి(కర్మణీ వాక్యం) 

 

Q10.ANS(c)

కర్మణీ వాక్యం: కర్మ ప్రధానంగా గల వాక్యాన్ని కర్మణీల్ వాక్యం అంటారు.

* దీనిని ఆంగ్లంలో “passive voice” అని అంటారు.

*క్రియను – ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించగా వచ్చే సమాధానం కర్మ.

*క్రియకు‘  బడు అనే ధాతువు చేరును

*కర్త – తృతీయ విభక్తిలో ఉంటుంది.

*తృతీయా విభక్తి ప్రత్యయాలు – చేతన్, చేన్, తోడన్, తోన్

* కర్మ ఎప్పుడూ ప్రథమా విభక్తిలో ఉంటుంది.

*ప్రథమా విభక్తి ప్రత్యయాలు – డు, ము, వు, లు.

ఉదా:  యువతలందరూ నా మల్లెలు ధరించారు(కర్తరి వాక్యం) 

 నా మల్లెలుయువతులందరిచే ధరించబడ్డాయి(కర్మణీ వాక్యం)

 

Telugu Practice Questions and Answers ,5 April 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,5 April 2022 ,for APPSC Group-4

Sharing is caring!