Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.
Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telugu Practice Questions for APPSC Group-4
Telugu Practice Questions -ప్రశ్నలు
Q1. అరణ్యం నకు వెళ్ళిన సీతారాములు. ఈ వాక్యంలో ‘అరణ్యం’అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి?
(a) ఆటవికం, అడుగు, వర్గం, విపినం.
(b) అర్థాంగి, పత్ని, ఇల్లాలు, భార్య.
(c) విపినం, అటవి, అడవి, వనం.
(d) పైవన్నీ
Q2. ఈ క్రింది వాటిలో ‘సుంత’ అను పదానికి గల పర్యాయపదాలను గుర్తించండి?
(a) ఇంచుక, ఇసుమంత, కొంచెం
(b) ఇబ్బంది, ఇరుకు, ఇనుడు.
(c) ఇల్లు, గేహం, నికేతం.
(d) b మరియు c
Q3. ఈ క్రింది వాటిలో “సంఘం” అను పదానికి గల పర్యాయ పదాల ను గుర్తించండి?
(a) సంత, బృహత్సం, గురుకులం
(b) సమూహం, బృందం, గుంపు
(c) కెంపు, బృందావనం, సమాజం
(d) సమాజం, భవిత, భవిష్యం
Q4. ఈ క్రింది వాటిలో ‘కైరవం’ అను పదానికి పర్యాయ పదాలు గుర్తించండి?
(a) ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం
(b) కోపం, క్రోధం, అలుక, ఆగ్రహం
(c) అక్షి, చక్షువు, నేత్రం, నయనం
(d) కలువ, కల్హారం, కుముదం, ఇందిరవం
Q5. ఈ క్రింది వాటిలో ‘చాడ్పు’ అను పదానికి పర్యాయపదం కానిది గుర్తించండి?
(a) విధం
(b) భంగి
(c) రీతి
(d) తీరు
(e) ఏదీ కాదు
Q6. ఈ క్రింది వాటిలో ‘ధరణి’ అను పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
(a) భూమి, ధరిత్రి, పృథ్వి
(b) పుడమి, రణం, పోరు.
(c) కాంత, కౌముది, లత.
(d) ముఖం, ఆననం, మోము.
Q7. ఈ క్రింది వాటిలో ‘కుసుమం’ అను పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
(a) పుష్పం, విరి, పూవు.
(b) ఇరులు, పుష్పాలు,పల్లవి
(c) కాంచనం, పూవు, విన్మయం
(d) చీకటి, అంధకారం, ఇడుములు
Q8. ఈ క్రింది వాటిలో ‘నరుడు’ అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి?
(a) మనిషి, నారాయణుడు, హరి
(b) రిపువు, మనువు, వైరి
(c) మనువు, మర్త్యుడు, మందరుడు
(d) మానవుడు, మనిషి, మర్త్యుడు
Q9. ఈ క్రింది వాటిలో ‘భాగీరథి’ అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి ?
(a)పావని, గౌతమి, వైనతేయ
(b) గంగ, యమున, సరస్వతి.
(c) గంగానది, జాహ్నవి, పావని
(d) పావని, సువర్ణముఖి, పంచవటి
Q10. ఈ క్రింది వాటిలో ‘అన్నం’ అను పదానికి గల పర్యాయపదాలను గుర్తించండి?
(a) బువ్వ, కూడు, బోనం
(b) తిండి, ఆహారం, భోగం
(c) ఆహారం, ఓగిరం, ఒన్నం
(d) అననం, అమృతం,కాణాచి.
జవాబులు
Q1. Ans(c)
అరణ్యం = విపినం, అటవి, అడవి, వనం.
Q2. Ans (a)
సుంత = ఇంచుక, ఇసుమంత, కొంచెం.
Q3. Ans (b)
సంఘం = సమూహం, బృందం, గుంపు.
Q4. Ans (d)
కైరవం = కలువ, కల్హారం, కుముదం, ఇందీవరం.
Q5. Ans (e)
చాడ్పు = విధం, భంగి, రీతి, తీరు.
Q6. Ans (a)
ధరణి = భూమి, ధరిత్రి, పృధ్వి
Q7. Ans (a)
కుసుమం = పుష్పం, పూవు, విరి.
Q8. Ans(d)
నరుడు = మానవుడు, మనిషి, మర్త్యుడు.
Q9. Ans(c)
భాగీరథి = గంగానది, జాహ్నవి, పావని.
Q10. Ans (a)
అన్నం = బువ్వ, కూడు, బోనం.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************