Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers ,21...

Telugu Practice Questions and Answers ,21 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,21 March 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

                   

Q1. మదము చేత ఏనుగు భూజదర్పం చేత రాజు ప్రకాశించుచుండెను. ఈ వాక్యంలో గల అలంకారంను గుర్తించండి?

(a) దీపక అలంకారము 

(b) వ్యాజస్తుతి అలంకారము

(c) వ్యాజనింద అలంకారము 

(d) ఉత్ప్రేక్ష అలంకారము.

 

Q2.ఇందు వదన కుందర దన మంద గమన మధుర లలనవే 

పైన ఇచ్చిన వాక్యం ఏ అలంకారమును కల్గి ఉందో గుర్తించండి?

(a) లాఠాను ప్రాస అలంకారము 

(b) అంత్యాను ప్రాస అలంకారము 

(c) ఛేకాను ప్రాస అలంకారము 

(d) వృత్యాను ప్రాస అలంకారము 

 

Q3. ఆ మృత్యు భయంకరమైన అలలు శిశువులకు ఊయలలు  ఊపే తల్లి వోలె జోలపాటలు పాడుచున్నవి. ఈ వాక్యంలో అలంకారము  ను గుర్తించండి?

(a) రూపక అలంకారము.

(b) ఉత్ప్రేక్ష అలంకారము.

(c) ఉపమ అలంకారము

(d) అనన్వయ అలంకారము.

 

Q4. మా ఇంటి పెరటిలో ఉన్న నూతిలో భూలోక వాసుల మాటలు వినబడుచున్నవి. ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారమును గుర్తించండి?

(a)శ్లేష అలంకారం.

(b) అతిశయోక్తి అలంకారు.

(c) ఉల్లేఖ అలంకారం 

(d) దృష్టాంతర అలంకారం.

 

Q5. మదర్ థెరిస్సా రోగులకు ప్రేమానురాగాలతో సేవ చేసింది. 

మానవతా మూర్తులకు పరోపకార పరాయణత సహజ లక్షణం కదా 

ఈ వాక్యంలో   ఏ అలంకారమును కలిగి ఉన్నదో గుర్తించండి?

(a) అర్థాంతర వ్యాస అలంకారం. 

(b) అతిశయోక్తి అలంకారం

(c) అనన్వయ అలంకారము

(d) ఉత్ప్రేక్ష అలంకారం

 

Q6. హరి భజియించు హస్తములు హస్తములు. పైన ఇచ్చినటు వంటి వాక్యంలో గల అలంకారమును గుర్తించండి?

(a)వృత్యాను ప్రాస అలంకారం

(b) ఛేకాను ప్రాస అలంకారం

(c) లాఠాను ప్రాస అలంకారము 

(d) అంత్యాను ప్రాస అలంకారం

 

Q7. కందర్ప దర్పములగు సుందర దరహాసరుచులు పైన ఇచ్చిన వాక్యం ఈ క్రింది వాటిలో ఏ అలంకారానికి చెందుతుందో గుర్తించండి?

(a) వృత్యును ప్రాసఅలంకారం

(b) ఛేకాను ప్రాస అలంకారం

(c) లాటాను ప్రాస అలంకారం

(d) అంత్యాను ప్రాస అలంకారం

 

Q8. లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి ఈ వాక్యంలో దాగి ఉన్న కారును ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ అలంకారు అవుతుందో గుర్తించండి?

(a) రూపక అలంకారం

(b) ఉపమా  అలంకారం

(c) అనన్వయ అలంకారం

(d) ఉత్ప్రేక్ష అలంకారం

 

Q9. మన వేటికి నూతనమా ! 

        తనమానినిబ్రేమదనకుద్రక్కితిననుమా

        ననుమానక దయ దనరం 

        దనరంతులు మాని నరసధవు రమ్మనవే

 (a) ముక్తపద గ్రస్త అలంకారము 

(b) అంత్యాను ప్రాస అలంకారము

(c)యమక అలంకారం. 

(d) శ్లేష అలంకారం. 

 

Q10. మన్మథుడు చంద్రుని వలె, చంద్రుడు మన్మథుని వలె విరహులను బాధించుట లో నేర్పులు. 

పైన ఇచ్చిన వాక్యంతో ఏ అలంకారం అవుతుందో గుర్తించండి?

(a) ఉపమా అలంకారం. 

(b)ఉత్ప్రేక్ష అలంకారం.

(c) ఉపమేయ ఉపమాలంకారము.

(d) ఉల్లేఖ అలంకారం

జవాబులు 

Q1.Ans (a)

దీపక అలంకారం : ప్రకృతా ప్రకృతములు ధర్మైఖ్యం చెప్పటను దీపక అలంకారంఅంటారు.

ప్రస్తుతం చెప్పదలచుకున్న ప్రకృతి విషయాన్ని ఆప్రకృతా విషయంతో ఐక్యం చేయుట.

ఉదా: మదము చేత ఏనుగు భూజదర్పం చేత రాజు

వివరణ: రాజు భూజదర్పం  చేత ప్రకాశించబడుతున్నాడు అనే ప్రకృతా విషయాన్ని, మదము చేత ఏనుగు ప్రకాశించబడుతుంది అనే అప్రస్తుత విషయం తో ఐక్యం చేయబడుతుంది.

 

Q2. Ans(d)

వృత్యానుప్రాస అలంకార లక్షణం: ఒకటిగాని లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు అనేక సార్లు తిరిగి రావడాన్ని వృత్యాను ప్రాస అలంకారం అంటారు.

వృత్తి అంటే ఆ వృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.

ఉదా: ఇందు వదన కుందరదన మంద గమన మధుర లలనవే 

పై వాక్యంలో ద న అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కాబట్టి ఇది వృత్యాను ప్రాస అనే శబ్దాలంకారం.

 

Q3. Ans (C)

ఉపమాలంకారం: ఉపమేయాన్ని ఉపమానంతో పోలిక చేసి చెప్పుటను ఉపమాలంకారం అంటారు.

ఉపమేయం ఉపమానంలకు రమ్యమైన పోలిక చెపటను ఉపమాలంకారం అంటారు.

ఉదా: ఆ మృత్యు భయంకరమైన అలలు శిశువులకు ఊయలలు  ఊపే తల్లి వోలె జోలపాటలు పాడుచున్నవి.

 ఉపమేయం – అలలు.

 ఉపమానం – తల్లి

 ఉపమావాచకం – వోలె

 

Q4.Ans (b)

అతిశయోక్తి అలంకార లక్షణము: ఒక వస్తువును ఉన్నదాని కంటే అధికముగా వర్ణించినచో అది అతిశయోక్తి అలంకారం

 గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం

వివరణ: ఈ ఉదాహరణ యందు మా ఇంటి పెరటిలో ఉన్న నూతిలో భూలోక వాసుల మాటలు వినబడుచున్నవి  అని చెప్పుట వలన ఇది అతిశయోక్తి అలంకారము. 

 

Q5.Ans(a)

అర్ధంతరన్యాస అలంకారము 

సామాన్య వాక్యమును, విశేషణ వాక్యము చేత గాని, విశేషణవాక్యమును సామ్యన్య వాక్యముతో గాని జతపరిచి చెప్పడాన్ని ” అర్ధంతరన్యాస అలంకారం” అంటారు.

ఉదా:మదర్ థెరిస్సా రోగులకు ప్రేమానురాగాలతో సేవ చేసింది ( విశేషం)

మానవతా మూర్తులకు పరోపకార పరాయణత సహజ లక్షణం కదా( సామాన్యం)

 

Q6. Ans (c) 

లాఠాను ప్రాస అలంకారము  :  ఒక వాక్యం/ పద్యం యందు జంట పదాలు అర్థభేదము లేకుండా తాత్పర్యం భేదముతో కలుగునట్లు వెంట వెంటనే ప్రయోగింపబడితేఅది లాఠాను ప్రాస అలంకారము ఉదా: హరి భజియించు హస్తములు హస్తములు. వివరణ: హస్తములుఅనగా చేతులు, ‘హస్తములు హస్తములుఅని రెండుసార్లు ప్రయోగింపబడటం వల్ల ఆ చేతులే చేతులు మిగిలినవి కావుఅని తాత్పర్యము వస్తున్నది. కావున ఇది లాఠాను ప్రాస అలంకారము.

 

Q7. Ans (b)

ఛేకాను ప్రాస అలంకారం: అర్థ భేదంతో కూడిన హల్లుల జంటలు వెంట వెంటనే రావడం  (లేదా) రెండు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు అర్థ భేదంతో వెంట వెంటనే రావడం ఛేకాను ప్రాస అలంకారం.

ఉదా:కందర్ప దర్పములగు సుందర దరహాసరుచులు

ఇక్కడ దర్ప దర్ప ,దర దర అనే పదాలు వెంట వెంటనే రావడం గమనించవచ్చు .

 

Q8. Ans (a)

రూపక అలంకారము: ఉపమాన ఉపమేయములకు అబేధం చెప్పినట్లయితే అది రూపక అలంకారము. 

ఉదా:లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి

పై పద్య పాదములో ఉపమేయం – లతలు ,ఉపమేయం – కుసుమాలు

ఉపమానం – లలనాలు ,ఉపమానం – అక్షతలు.

 

Q9. Ans (a)

ముక్త పదగ్రస్త అలంకారము :

పద్య రచన యందు గాని, ఒక పాదం చివర గాని విడిచిన పద భాగములను వ్యవధానము లేకుండ  వెంటనే ప్రయోగింపబడినచో అది ముక్తపదగ్రస్త అలంకారముఅంటారు.

వివరణ: ఈ ఉదాహరణ పద్యము నందు తనమా‘ ‘తనమా‘ ,’ ననుమా ‘ ‘ననుమా‘,’ దనరం దనరంఅను పదములు ఒక పాదము విడువడి తరువాతి పాదమున అవ్యవధానముగా ప్రయోగింపబడినవి. కావున ఇది ముక్తపదగ్రస్తము.

 

Q10.Ans (c)

ఉపమేయ ఉపమాలంకారము:ఉపమేయము ఉపమానము గా, ఉపమానం ఉపమెయంగా చెప్పబడితే దానిని ఉపమేయ ఉపమాలంకారము అంటారు.

ఉదా : మన్మథుడు చంద్రుని వలె, చంద్రుడు మన్మథునివలె విరహులను బాధించుట లో నేర్పులు.

       మన్మథుడు – ఉపమేయం ,చంద్రుడు- ఉపమానం

       చంద్రుడు – ఉపమేయం,మన్మథుడు -ఉపమానం.

 ఇక్కడ ఉపమేయము ఉపమానము గా, ఉపమానం ఉపమెయంగా చెప్పబడింది.

 

Telugu Practice Questions and Answers ,21 March 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,21 March 2022 ,for APPSC Group-4

 

Sharing is caring!