Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers ,2...

Telugu Practice Questions and Answers ,2 April 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,2 April 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు         

Q1.కవిత గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చింది అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలోఏ రకమైన అసమాపక క్రియా వాక్యము అవుతుందో గుర్తించండి?

(a) అప్యర్థక వాక్యం

(b) చేదర్థక వాక్యం

(c) శత్రర్ధక వాక్యం

 (d) క్త్వార్ధక వాక్యం

 

 Q2. అర్జునుడు ఎంతటి వీరుడనైనా జయించ గలడు అనే  వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో  ఏ వాక్య రకానికి చెందునో గుర్తించండి?

(a) చేదర్థక వాక్యం

(b)సామర్థ్యార్థక వాక్యం

(c) అనుమత్యర్థక వాక్యం

(d) అనంతర్యార్థక వాక్యం

 

Q3. ఈ క్రింది ఇచ్చిన వాటిలో సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది అనే  ఈ వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలోఏ రకమైన అసమాపక వాక్యం అవుతుందో గుర్తించండి?

(a)క్త్వార్ధక వాక్యం

(b)చేదర్థక వాక్యం

(c)అప్యర్థక వాక్యం

(d)శత్రర్ధక వాక్యం

 

Q4. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆకస్మిక  భావోద్వేగములను వెల్లిబుచ్చుటకు వాడే పదాలు కలిగిన అర్ధ బోధక క్రియలతో ఏ రకమైన వాక్యమును  నిర్మించవచ్చునో గుర్తించండి?

(a) విద్యర్థక వాక్యం

(b)శత్రర్ధక వాక్యం

(c) ఆశ్చర్యార్థక వాక్యం

(d) అప్యర్థక వాక్యం

 

Q5. మీరు పరీక్షలు రాయవచ్చు అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాపక  క్రియ కి  చెందుతుందో గుర్తించండి?

(a)ఆశ్చర్యార్థక వాక్యం

(b) అనుమత్యర్థక వాక్యం

(c)అప్యర్థక వాక్యం

(d)ఆశీరార్దక వాక్యం

 

Q6. అధికారులు వచ్చినా సమస్యలు తీరలేదు అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాప క్రియ కలిగిన  వాక్యానికి చెందుతుందో గుర్తించండి?

(a) ఆశ్చర్యార్థక వాక్యం

(b) అనుమత్యర్థక వాక్యం

(c)అప్యర్థక వాక్యం

(d)ఆశీరార్దక వాక్యం

 

Q7. కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటదే వస్తుంది  అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాప క్రియ కలిగిన  వాక్యానికి చెందుతుందో గుర్తించండి? 

(a)శత్రర్ధక వాక్యం

(b)అప్యర్థక వాక్యం

(c) క్త్వార్ధక వాక్యం

(d) చేదర్థక వాక్యం

 

Q8. భోజనం చేయగానే నిద్రవచ్చును అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాప క్రియ కలిగిన  వాక్యానికి చెందుతుందో గుర్తించండి? 

(a)ఆశ్చర్యార్థక వాక్యం

(b) ఆశీరార్దక వాక్యం

(c)అనంతర్యార్థక వాక్యం

(d) అప్యర్థక వాక్యం

 

Q9.నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాప క్రియ కలిగిన  వాక్యానికి చెందుతుందో గుర్తించండి? 

(a) నిషేధార్థక వాక్యం.

(b) విద్యర్థక వాక్యం 

(c) అస్వర్థక వాక్యం

(d) సంభావనార్థక వాక్యం

 

Q10. జీతాలు చాలక ఉద్యోగ సంఘాలు సమ్మె చేశాయి అనే వాక్యం ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ రకమైన అర్ధబోధక క్రియలలో గల అసమాప క్రియ కలిగిన  వాక్యానికి చెందుతుందో గుర్తించండి? 

(a) వ్యతిరేక క్త్వార్ధకం

(b) వ్యతిరేక ఉద్యర్థకం 

(c) సందేహార్థక వాక్యం 

(d) ఆశిశ్మాపార్ధక వాక్యం

జవాబులు                             

Q1.ANS (d) 

క్త్వార్ధక వాక్యం : ఒక కర్తను ఆశ్రయించి ఉన్న పనులలో ముందు చేసిన పనిని తెలియజేయు క్రియారూపం క్త్వార్ధకం‘  

*ధాతువుకిచేరుతుంది 

ఉదా: కవిత గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చింది ఈ వాక్యం నందు 

* రెండు పనులలో గ్రంథాలయానికి  వెళ్ళడం ముందుగా జరిగెను. ఈ పని సూచించు క్రియారూపమైన వెళ్లిఅనునది క్త్వార్ధకం.

 

Q2. ANS (b)

సామర్థ్యార్థక వాక్యం : ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి  ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. 

*ఉత్తమ పురుష కి వాడవచ్చు. 

*ఉదా: అర్జునుడు ఎంతటి వీరుడనైనా జయించగలడు.

 

Q3.ANS (d)

శత్రర్ధక వాక్యం :  ఒక కర్తను ఆశ్రయించి ఏక కాలములో జరిగిన రెండు పనులలో ముందు చెప్పబడిన పనిని తెలియజేయు క్రియా రూపము శత్రర్ధకం . 

*క్రియా ధతువుకి చున్ అనే ప్రత్యయం చేరెను . 

*వాక్య నిర్మాణం యందు తూ లేదా టూ గా రూపాంతరం చెందును. 

ఉదా:సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.

 

Q4. ANS (C)

ఆశ్చర్యార్థక వాక్యం :

ఆకస్మిక భావోద్వేగాలను వెల్లిబుచ్చుటకు  వాడే పదాలను ” ఆశ్చర్యార్థకములు” అంటారు.

*ఆశ్చర్యము, భయము, జగప్ప, సంతోషము మొదలైన వానిని కూడా తెలియజేయు పదములు *ఆశ్చర్యార్థకములు,వీటిని కలిగి ఉన్న వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు.

*ఇంగ్లీషులో Hello! ,  Alas!  ,Hurrah! , Ah! , అనే పదాలను Interjections అంటారు. 

*Sudden గా పుట్టిన భ్వాగోద్రేకాల్ని ఇవి తెలియజేయును. వీటికి వ్యాకరణం తో ప్రాముఖ్యం లేదు.

ఉదా: 1) అయో! రమణ గారు మరిగించారు.

         2) ఆహా! శ్రీరామ్ ఎంత మంచివాడు.

 

Q5.ANS (b)

అనుమత్యర్థక వాక్యం  : అనుమతి, ఒప్పుకోవటాన్ని తెలియచేయు క్రియా రూపాలను” అనుమత్యర్థకం” అంటారు.

                       (లేదా) 

 ఏదైనా ఒక పనిని చేయటానికి అనుమతిని ఇచ్చే వాక్యలనే

అనుమత్యర్థక వాక్యం అంటారు.

2) మీరు వెళ్ళవచ్చు.

3) నీవు లోపలికి రావచ్చు.

 

Q6. ANS (c)

అప్యర్థక వాక్యం :

* కార్యాకారణ సంబంధం ఉన్న క్రియలలో కారణం ఉన్నప్పటికి కార్యం జరగకపోవడాన్ని “అప్యర్ధకం” అ

 *రెండు వైవిధ్యమైన పదాలు ఉన్నప్పుడు వాటి మధ్య కార్యకారణ సంబంధం ఉన్న దానిని అప్యర్ధకం

*రెండు వ్యాపారాల్లో వైరుధ్యం ఉన్నప్పుడు వాడే అసమాపక క్రియను అప్యర్ధకం అంటారు. * సంస్కృతంలో “అపిఅంటే కూడఅని అర్ధం కలదు.

* కనుక కూడఅనే అర్థాన్నిచ్చే ప్రత్యయం చేరిన క్రియా రూపాలను అప్యర్ధకాలుఅంటారు. 

*క్రియా ధాతువులపై ఇనాఅనే ప్రత్యయం చేరడం వలన అపకాలు ఏర్పడతాయి.

 

Q7.ANS(d)

చేదర్థక వాక్యం : భవిష్యత్కాలిక అసమాపక క్రియను చేదర్థకం” అంటారు.

* కార్యం ఫలించడానికి కారణం అవసరం. * కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థకవాక్యం.

* కార్యకారణ సంబంధాన్ని తెలియచేసేటప్పుడు కారణ బోధక క్రియగా చేదర్థకంపనిచేస్తుంది. 

* కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో “టే, తే, ఇతే, ఐతే” అనే ప్రత్యయాలు చేరతాయి .

*క్రియా ధాతువుకు ఇనన్” ప్రత్యయం చేరుతుంది. * దీనిని బట్టి వీటిని “చేత్” అనే అర్ధం ఇచ్చే ప్రత్యయాలు అంటారు.

* “జరిగినపుడు” అనే అర్థం ఇచ్చే క్రియారూపాలను చేదర్థకం అంటారు.

ఉదా : కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటదే వస్తుంది

ప్ర : ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?

జ:కష్టపడి పనిచేస్తే. కష్టపడడం – కారణం

 

Q8.ANS (c)

అనంతర్యార్ధక వాక్యం : ఒక పని జరిగిన తరువాత వెంటనే మరొక క్రియ జరగడాన్ని “అనంతర్యార్ధకము” అంటారు.

* అనంతరము అంటే తరువాత అని అర్ధము. ప్రత్యయం – డున్ * డున్ అనగా జరిగిపోయినది.

* తెలుగు ప్రత్యయాలు – గా, గానే

ఉదా : 1. భోజనం చేయగానే నిద్రవచ్చును,

  1. బస్సు ఎక్కగానే పడుకున్నాను.

 

Q9.ANS (b)

విద్యర్థక వాక్యం : విధులను, ఆజ్ఞలను తెలియజేయు క్రియా రూపములను విధ్యర్ధకముఅందరు. 

*సాధారణము గావిధ్యర్ధకము మధ్యమపురుషలో మాత్రమే ఉండును. 

ఉదా :1. నీవు చదువు 

         2.చేతులు కడుక్కొ!

 

 Q10. ANS (a)

వ్యతిరేక క్త్వార్ధకం : భూతకాలిక వ్యతిరేక అసమాపక క్రియను వ్యతిరేక క్త్వార్ధకం అంటారు.

క్రియ ధాతువుపై అక అనే వ్యతిరేక క్త్వార్ధక ప్రత్యయం చేరడం వల్ల వ్యతిరేకార్ధం వస్తుంది.

ఉదా : 1.జీతాలు చాలక ఎన్జీవోలు ఉద్యోగ సంఘాలు సమ్మె చేశాయి..

          2.రవి చదవక పరీక్ష తప్పినాడు.

 

 

Telugu Practice Questions and Answers ,2 April 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,2 April 2022 ,for APPSC Group-4

 

Sharing is caring!