Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers 12...

Telugu Practice Questions and Answers ,12 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,12 March 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1.వాక్యం లో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు వున్నాయని చెప్పడానికి సూచించే విరామ చిహ్నంను గుర్తించండి?

(a) పొడవు గీత

(b) న్యూన బిందువు

(c) అర్థ బిందువు

(d) మూడు చుక్కలు

 

Q2.ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని తెలిపే పదాల చివర ఉపయోగించే విరామ చిహ్నంను గుర్తించండి?

(a) ప్రశ్నార్థకం

(b) ఆశ్చర్యార్థకము

(c)అర్థ బిందువు

(d)వాక్యాంశ బిందువు

 

Q3.వాక్యములో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు ఉపయోగించే విరామ చిహ్నంను గుర్తించండి?

(a) అనుకరణ చిహ్నాలు

(b) న్యూన బిందువు

(c) పొడవు గీత

(d) అర్థ బిందువు

 

Q4. భాషా పదాల వివరణ ఇచ్చుటకు, అంకెలను అక్షరములలో వ్రాయునపుడు వినియోగించే విరామచిహ్నం ను గుర్తించండి?

(a) పొడవు గీత 

(b) వాక్యాంశ బిందువు

(c) మూడు చుక్కలు

(d) కుండలీకరణం

 

Q5. వాక్యం పూర్తి అయినట్లుగా తెలియజేయడానికి సూచించే విరామచిహ్నంను గుర్తించండి?

(a) వాక్యాంశ బిందువు

(b) అర్ధ బిందువు

(c) న్యూన బిందువు

(d) బిందువు

 

Q6. ప్రత్యక్షానుకరణము నందును, ఉద్ధరణ వాక్యములను ఉదహరించునపుడును  తెలియజేయు విరామచిహ్నంను గుర్తించండి?

(a) అనుకరణ చిహ్నములు

(b) వాక్యాంశ బిందువు

(c) అర్థ బిందువు

(d) కుండలీకరణం

 

Q7.ఏదైనా విషయాన్ని గూర్చి ఎదుటి వారిని అడిగేటప్పుడు  ఆ వాక్యం చివర వినియోగించే విరామచిహ్నంను గుర్తించండి?

(a)ఆశ్చర్యార్థకము

(b) ప్రశ్నార్థకం.

(c)వాక్యాంశ బిందువు

(d) న్యూన బిందువు.

 

Q8. వాక్యాల్లో వరుసగ కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు ఉపయోగించే విరామచిహ్నంను గుర్తించండి?

(a) న్యూన బిందువు

(b) పొడవు గీత 

(c) వాక్యాంశ బిందువు

(d)బిందువు

 

Q9. ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర వచ్చే విరామచిహ్నంను గుర్తించండి?

 (a) న్యూన బిందువు

(b)అర్థ బిందువు

(c) వాక్యాంశ బిందువు.

(d)బిందువు

 

Q10. వ్యక్తుల పేర్ల తర్వాత చేర్చు డిగ్రీలకు, బీరుదులకు, పదవులకు ముందు వినియోగించే విరామ చిహ్నంను గుర్తించండి?

(a)బిందువు

(b) అర్థ బిందువు

(c) ప్రశ్నార్థకం

 (d) వాక్యాంశ చిందువు

జవాబులు

Q1. Ans (d) 

 మూడు చుక్కలు(…):వాక్యములో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పటాన్ని సూచించడానికి గాను మూడుచుక్కలను ఉపయోగిస్తారు.

వాక్యాంతములో బిందువుతో కలిసి మొత్తం నాలుగు చుక్కలు ఉదా: 1) అతడు పాఠమును …

2) ఒక అండిలో శాంసనం ఇలా ఉంది. స్వస్తి సంవత్సరం 1896లో కృషవర్మ మహారాజు తమ… పేరిట ఈ దాన శాసనాన్ని వ్రాయించారు.

 

Q2. Ans (b)

ఆశ్చర్యార్థకము (!) ఎక్స్ క్లమేటరీ మార్కె: ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును, తెలిపే పదాల చివర ఈ గుర్తు ‘!’ను ఉపయోగిస్తారు.

ఉదా: 1) అయ్యో ! ఎంత కష్

 2) భళా! బాగున్నావురా!

3) అబ్బా!ఎంత ఆశ్చర్యం.

 

Q3. Ans (c)

పొడవు గీత (_):

వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు పొడవుగీతను వాడతారు. 

ఉదా : 1) శ్రీరాముడు – దశరథుని కుమారుడు – అయోధ్యకు రాజు.

2) దుర్యోధనుడు – ధృతరాష్ట్రుని కుమారుడు – రారాజు.

 

 Q4.Ans (d)

కుండలీకరణము() బ్రాకెట్:

భాషా పదాల వివరణ ఇచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ ఇచ్చుటకు, అంకెలను అక్షరములలో వ్రాయునప్పుడు ఈ కుండలీకరణమును వాడుదురు. 

ఉదా: 1) కాంతివేగము (సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు)ను నక్షత్రముల మధ్య దూరమును కొలుచుటకు ఉపయోగించుదురు. 

2) మనోవేగాన్ని (కొలుచుటకు వీలులేని వేగాన్ని) ఇదీ అని వివరింపలేము

3)వ్యాకరణము (Grammar), వేదయుగం (vedic Period).

 

Q5. Ans (d) 

బిందువు (.) ఫుల్ స్టాప్ : వాక్యం పూర్తి అయినప్పుడు పూర్తి అయినట్లుగా తెలియజేయడాన్ని సూచించటానికి (.) బిందువు పెడతారు.

2)నిశ్చయార్థక, ప్రార్థనాద్యర్థక వాక్యముల చివర బిందువు వచ్చును.

ఉదా: రాజు చదువుతున్నాడు. 

3) సంక్షిప్త రూపములలో కూడా బిందువు వచ్చును. ఉదా: క్రీ.శ (క్రీస్తు శకము)

కి.మీ (కిలోమీటరు)

సి.నా.రె (సి.నారాయణరెడ్డి) 

 

Q6. Ans (a)

అనుకరణ చిహ్నములు(” “) ఇన్వర్టెడ్ కామ: ప్రత్యక్ష్యానుకరణము నందునుఉద్ధరణ వాక్యములను ఉదహరించునప్పుడు అనుకరణ చిహ్నములు వచ్చును. 

ఉదా: 1) “ఓం నమో నారాయణాయ”అని స్వామి నాకు  మంత్రోపదేశం చేశారు.

2)”ప్రకృత్యారాధనా హృదయం ఉండాలి.” అని భావకవులు చెప్తారు.

3) “నేను వస్తున్నాను” అని రవి అన్నాడు.

 

Q7. Ans(b)

ప్రశ్నార్థక చిహ్నమును (?) క్వశ్చన్ మార్క్:

ఏదైనా విషయాన్ని గూర్చి ఎదుటివారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థక చిహ్నమును (?) ఉపయోగిస్తారు.

ఉదా: 1) వ్యాకరణ విజ్ఞానం ఏం చెబుతున్నది

         2)నీ పేరు ఏమిటి?

 

Q8. Ans (a)

న్యూన బిందువు (:) కోలన్:వాక్యాల్లో వరుసగ కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు (:) వచ్చును.

1)ఇది మూడు మాత్రల కాలపు విరామ చిహ్నమును సూచించును. 

ఉదా: భాషా భాగములు ఐదు. 

అవి: నామవాచకము, సర్వనామము, క్రియ…

 

Q9. Ans (b)

అర్ధ బిందువు(😉 సెమీ కోలన్ :ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్థ బిందువు వస్తుంది. 

1)ఇది ద్విమాతకాలపు విరామచిహ్నమును సూచించును.

ఉదా: 1) ప్రేమ అడిగిపుచ్చుకునేది కాదు; కాని, అడిగినా ప్రేమించరు కొందరు.

2)జీవితేచ్ఛ లేకపోతే సృష్టిలేదు ;స్థితి లేదు; లయము లేదు. 

 

Q10.Ans (d)

వాక్యాంశ బిందువు (,) కామా :

చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి, వాక్యం పూర్తిగానప్పుడు వాక్యాంశ బిందువును(,) కామా ఉపయోగిస్తాము.

2)వాక్యాంశ బిందువు ఏక మాత్రకాలపు, విరామమును సూచించును.

3)వ్యక్తుల పేర్ల తరువాత చేర్చు డిగ్రీలకు, బిరుదులకు, పదవులకు ముందు వచ్చును.

ఉదా: 1) శ్రీ.వి. వేశాంగోపాలరావు, బి.ఎస్.సి, బి.ఇడి.  

4)అనన్వయమునందు సమీప బంధము కలిగిన నామవాచకములు, విశేషణములు, అసమాపక క్రియలు వరుసగా వచ్చినప్పుడు వాటి మధ్య ఈ వాక్యాంశ బిందువు వచ్చును.

5) ఉత్తరం వ్రాయునప్పుడు ప్రారంభంలోను, చివరను చేయు సంబోధనముల చివర ఈ వాక్యాంశ బిందువు వచ్చును. 

ఉదా: 1) ప్రియమైన రవికి, నీ స్నేహితుడు..

2) ప్రియమైన తలిదండ్రులకు,మీ కుమార్తె.

 

Telugu Practice Questions and Answers ,12 March 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,12 March 2022 ,for APPSC Group-4

 

Sharing is caring!