Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 29 March 2023, For TSPSC Groups, TS Police, TSSPDCL, and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 29 March 2023, For TSPSC Groups, TS Police, TSSPDCL, and Other Exams |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu.

Q1. వితంతుల పునర్ వివాహాల చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో తీర్మానం ప్రతిపాదించింది ఎవరు?

(a) స్వామి దయానంద సరస్వతి

(b) పండిత కేశవరావు

(c) వినాయకరావు విద్యాలంకార్

(d) నరేంద్ర జీ

Q2. రైతులు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) ఆర్డినెన్స్‌ 2020 కి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైంది?

  1. రైతులు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) ఆర్డినెన్స్‌ 2020 ని జూన్ లో తీసుకువచ్చారు.
  2. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (APMCs) లైసెన్స్ ఇచ్చిన మార్కెట్ యార్డు సరిహద్దులు దాట రైతులు తన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చు. వ్యాపారస్తులు కొనవచ్చు.
  3. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్కు వచ్చి పంట కొనుగోలు చేస్తే మార్కెట్ రుసుం 1% మార్కెట్ కమిటీకి చెల్లించాలి.

(a) 1 మరియు 3

(b) 1, 2, 3

(c) 1 మాత్రమే

(d) 2 మరియు 3 మాత్రమే

Q3. తెలంగాణ ప్రాంతీయ నైసర్గిక  స్వరూపానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది?

  1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సర్వే చట్టం, 2014 ప్రకారం రాష్ట్రం 1,12,077 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది (యాక్ట్ నం.6, 2014 ప్రకారం 1,14, చ.కి.మీ).
  2. దేశంలో జనాభాపరంగా 12వ పెద్ద రాష్ట్రంగా, వైశాల్యపరంగాను 11 వ పెద్ద రాష్ట్రంగా అవతరించింది.
  3. తెలంగాణ రాష్ట్రం 15° 50N నుంచి 19°51′ N అక్షాంశాల మధ్య మరియు 17°15′E నుంచి 81°19′E రేఖాంశాల మధ్య ఉంటుంది.

(a) 1, 2 మాత్రమే

(b) 1, 2 & 3

(c) 1, 3 మాత్రమే

(d) 2, 3 మాత్రమే

Q4. ప్రతిపాదన (A): తెలంగాణ ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడి నీరు మెల్లగా వెడెక్కడంచేత హిందూ మహాసముద్రంలో అధికపీడనం ఏర్పడి నైరుతి రుతుపవనాలుగా వీస్తాయి.

కారణం (R): సూర్యకిరణాలు తెలంగాణ ప్రాంతంలో నిట్టనిలువుగా పడటంవల్ల తెలంగాణ ప్రాంతం అంతా అత్యధికంగా వేడెక్కుతుంది.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Q5. భూ సంస్కరణలపై వ్రాయబడిన ముఖ్య గ్రంథాలు

కింది వాటిని జత చేయండి.

రచయిత                                                    గ్రంథాలు

  1. ఆర్థర్ లూయిస్                       I. Agrarian Reforms in India
  2. థియోడర్ బెర్మన్                   II. Telangana People’s Struggles and It’s lesson.
  3. పుచ్చలపల్లి సుందరయ్య     III. The Theory of Economic Growth
  4. శ్రీ ఎన్.జి.రంగా                        IV. The modern Indian Peasant

సరైన సమాధానం:

A           B           C            D

(a)        I             II           IV          III

(b)        IV          III          I             II

(c)        III          I             II           IV

(d)        III          II           I             IV

Q6. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు

  1. మెహదీ హాసన్
  2. దీన్ యార్ జంగ్
  3. అలీయవర్ జంగ్
  4. మొయిన్ నవాజ్ జంగ్

Q7. తెలంగాణ పీఠభూమికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?

  1. ఈ పీఠభూమి యొక్క సగటు ఎత్తు దాదాపు 500 మీటర్లు
  2. ఇది ప్రధానంగా ఆర్కియన్ గ్నీసెస్‌తో కూడి ఉంటుంది
  3. ఈ పీఠభూమి ప్రాంతం మొత్తాన్ని కనుమలు, పెనెప్లైన్ గా విభజించబడింది.

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:

(a) 1 & 2

(b) 1 & 3

(c) 2 & 3

(d) 1, 2 & 3

Q8. ఛాంపియన్ మరియు సేత్ వర్గీకరణ (1968) ప్రకారం తెలంగాణలో అడవులను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవి?

  1. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
  2. దక్షిణ శుష్క ఆకురాల్చే అడవులు
  3. ఉత్తర మిశ్రమ శుష్క ఆకురాల్చే అడవులు
  4. శుష్క సవన్నా అడవులు

(a) 1& 2

(b) 1, 2 & 3

(c) 1, 3 & 4

(d) 1, 2, 3 & 4

Q9. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: (RRBS) కు సంబంధించి ఈ కింది వాటిలో సరి కానిది ఏది?

  1. 1977 సం॥లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం వచ్చినది.
  2. వీటికి కేంద్రం, రాష్ట్రం, స్పాన్సర్ చేసిన బ్యాంకులు 50:15:35 శాతంలో నిధులు సమకూర్చినవి. ఇవి నరసింహ కమిటీ సిఫారసులపై ఏర్పడినవి.
  3. RRB లకు నాబార్డు రీ ఫైనాన్స్ సౌకర్యం కల్పించినది.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 1 మాత్రమే

(d) 1, 2, 3

Q10. “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ ఎంత?

(a) రూ.11.6 లక్షల కోట్లు.

(b) రూ.12.6 లక్షల కోట్లు.

(c) రూ.10.5 లక్షల కోట్లు.

(d) రూ.18.6 లక్షల కోట్లు

Solutions:

S1. Ans ( b)

Sol:  వితంతుల పునర్ వివాహాల చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో పండిత కేశవరావు (ఈయన హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు) హైదరాబాద్ రాష్ట్ర శాసన సభలో 1930లో ఒక తీర్మానం ప్రతిపాదించారు. అభివృద్ధి నిరోధకులైన హిందూ ముస్లిం నాయకులు ఏకమై దానిని ప్రతిఘటించారు. అయినా అంత కాలానికి పండిత వినాయకరావు విద్యాలంకార్ నిరంతర ప్రయత్నాల మూలంగా అది చట్టంగా మారింది

S2. Ans (b)

Sol: రైతులు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) ఆర్డినెన్స్‌ 2020 :

  • రైతులు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) ఆర్డినెన్స్‌ 2020 ని జూన్ లో తీసుకువచ్చారు.
  • దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (APMCs) లైసెన్స్ ఇచ్చిన మార్కెట్ యార్డు సరిహద్దులు దాట రైతులు తన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చు. వ్యాపారస్తులు కొనవచ్చు.
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్కు వచ్చి పంట కొనుగోలు చేస్తే మార్కెట్ రుసుం 1% మార్కెట్ కమిటీకి చెల్లించాలి

S3. Ans (b)

Sol: తెలంగాణ ప్రాంతీయ నైసర్గిక స్వరూపానికి సంబంధించి :

  • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవ్య చట్టం, 2014 ప్రకారం రాష్ట్రం 1,12,077 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది (యాక్ట్ నం.6, 2014 ప్రకారం 1,14, చ.కి.మీ).
  • దేశంలో జనాభాపరంగా 12వ పెద్ద రాష్ట్రంగా, వైశాల్యపరంగాను 11 వ పెద్ద రాష్ట్రంగా అవతరించింది.
  • తెలంగాణ రాష్ట్రం 15° 50N నుంచి 19°51′ N అక్షాంశాల మధ్య మరియు 17°15′E నుంచి 81°19′E రేఖాంశాల మధ్య ఉంటుంది.

S4. Ans(a)

Sol: ఏప్రిల్, మే మాసాలలో సూర్యకిరణాలు తెలంగాణ ప్రాంతంలో నిట్టనిలువుగా పడటంవల్ల తెలంగాణ ప్రాంతం అంతా అత్యధికంగా వేడెక్కుతుంది. ఈ అధికవేడి ఆ ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి కారణమవుతుంది. అదే సమయంలో నీరు మెల్లగా వెడెక్కడంచేత హిందూ మహాసముద్రంలో అధికపీడనం ఏర్పడుతుంది. మెల్లగా అల్పపీడనం, ఆగ్నేయ పవనాలను భూమధ్యరేఖ వద్ద ఆకర్షించి భారతదేశ పశ్చిమతీరానికి తాకి నైరుతి రుతుపవనాలుగా వీస్తాయి.

S5. Ans (c)

Sol: ఆర్థర్ లూయిస్              –   The Theory of Economic Growth.

థియోడర్ బెర్మన్                  –    Agrarian Reforms in India

పుచ్చలపల్లి సుందరయ్య    –    Telangana People’s Struggles and It’s lesson.

శ్రీ ఎన్.జి.రంగా                      –  The modern Indian Peasant

S6. Ans.(2)

Sol: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పుడు దీన్ యార్ జంగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్

S7. Ans (d)

Sol: పీఠభూమి: తెలంగాణ ఎక్కువ భాగం ఆర్కియస్ వ్యవస్థకు చెందిన నీస్, సిష్ట్ లతో విస్తరించి ఉన్నది. ఈ పీఠభూమి 500 మీ. నుంచి 600 మీ. ఎత్తులో గలదు. సాధారణంగా ఈ పీఠభూమి ప్రాంతాన్ని “తెలంగాణా పీఠభూమి”గా వ్యవహరిస్తారు. అయితే ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం అధిక ఎత్తున కలిగి ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి ప్రాంతం గుండా ప్రయాణిస్తాయి. అయితే ఈ పీఠభూమి ప్రాంతం మొత్తాన్ని కనుమలు, పెనెప్లైన్ గా విభజించడం జరుగుతుంది.

S8. Ans (d)

Sol: ఛాంపియన్ మరియు సేత్ వర్గీకరణ (1968)

” ఈ వర్గీకరణ ప్రకారం తెలంగాణలో అడవులను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు

  • ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
  • దక్షిణ శుష్క ఆకురాల్చే అడవులు
  • ఉత్తర మిశ్రమ శుష్క ఆకురాల్చే అడవులు
  • శుష్క సవన్నా అడవులు
  • ఉష్ణమండల ఉష్ణ సతత హరిత పొదలు

S9. Ans (c)

Sol: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: (RRBS)

  • 1976సం॥లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం వచ్చినది.
  • వీటికి కేంద్రం, రాష్ట్రం, స్పాన్సర్ చేసిన బ్యాంకులు 50:15:35 శాతంలో నిధులు సమకూర్చినవి. ఇవి నరసింహ కమిటీ సిఫారసులపై ఏర్పడినవి.
  • RRB లకు నాబార్డు రీ ఫైనాన్స్ సౌకర్యం కల్పించినది

S10. Ans (c)

Sol: “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదిక ప్రకారం.  రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 29 March 2023, For TSPSC Groups, TS Police, TSSPDCL, and Other Exams |_50.1

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i find Telangana State GK MCQs Questions And Answers?

You can found different quizzes at adda 247 website.

Download your free content now!

Congratulations!

Telangana State GK MCQs Questions And Answers in Telugu 29 March 2023, For TSPSC Groups, TS Police, TSSPDCL, and Other Exams |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana State GK MCQs Questions And Answers in Telugu 29 March 2023, For TSPSC Groups, TS Police, TSSPDCL, and Other Exams |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.