Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana Static GK MCQs Questions And...

Telangana Static GK MCQs Questions And Answers in Telugu, 19th September 2023 For TSPSC GROUPs & TSPSC DAO

Telangana Static GK MCQs Questions And Answers in Telugu : Practice Telangana Static Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana Static. Most of the questions asked in the Telangana Static GK sections are based on current affairs.

Telangana Static GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Static GK MCQs Questions And Answers in Telugu.

Q1. మంజీర నదిని ఏ రాష్ట్రంలో “మంజ్రా” అని పిలుస్తారు?

(a) ఆంధ్రప్రదేశ్

(b) తెలంగాణా

(c) మహారాష్ట్ర

(d) తమిళనాడు

Q2. కింది వాటిని జతపరుచుము.

                        జాబితా                                    – I జాబితా – II

  1. శివరాం వన్యప్రాణుల అభయారణ్యం      1. నెమలి
  2. కాసు బ్రహ్మనందరెడ్డిజాతీయ పార్కు       2. మార్ష్ మొసలి
  3. కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యం    3. కృష్ణ జింక
  4. ప్రాణహిత వన్యమృగ అభయారణ్యం      4. పులి

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q3. కింది వాటిని జతపరుచుము.

                         జాబితా                   – I జాబితా – II

                     (నది)                              (తెలంగాణాలో ప్రవేసించే ప్రదేశం)

  1. కృష్ణా                                                  1. మహాదేవపూర్ (కరీంనగర్)
  2. గోదావరి                                              2. ఆలంపూర్ (మహబూబ్ నగర్)
  3. ఇంద్రవతి                                         3. తంగడి (మహబూబ్ నగర్)
  4. తుంగభద్ర                                        4. బాసర (ఆదిలాబాద్)

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q4. కింది వాటిని జతపరుచుము.

                                    జాబితా                             – I జాబితా – II

  1. రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ                    1. NH 150

రహదారి

  1. రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి          2. NH 44
  2. రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి         3. SH9
  3. రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి              4. SH 1

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q5. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?

(a) వరంగల్

(b) ఖమ్మం

(c) హైదరాబాద్

(d) రంగారెడ్డి

Q6. హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు లో భాగంగా తరుణి స్టేషన్ గా పిలవబడే మెట్రో స్టేషన్ ఏది?

(a) మధురానగర్ మెట్రో స్టేషన్

(b) అమీర్ పేట్ మెట్రో స్టేషన్

(c) జె.బి.ఎస్ మెట్రో స్టేషన్

(d) యం.జి.బి.ఎస్ మెట్రో స్టేషన్

Q7. నిర్మల్ కొయ్య బొమ్మల’ను ఏ కలపతో తయారు చేస్తారు?

(a) ఇండియన్ రోజ్‌వుడ్

(b) పుణికి 

(c) కాజురైనా

(d) టేకు

Q8. శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదిశ్వరుడు అని ఎందులో పేర్కొనబడింది?

  1. హర్ష చరిత్ర
  2. మను చరిత్ర
  3. కావ్య మీమాంస 
  4. పైనవేవి కావు 

Q9. శాతవాహనల సామ్రాజ్యానికి ఏది తొలి రాజధాని?

  1. కొండాపూర్
  2. కోటిలింగాల
  3. పెద్ద బొంకూరు
  4. ధూళికట్ట

Q10. శాతవాహనులు అనంతరం తెలంగాణను పాలించిన తొలి క్షత్రియులు ______?

  1. శాలంకాయనులు 
  2. ఇక్ష్వాకులు
  3. బృహత్పలాయనులు
  4. విష్ణుకుండినులు

Solutions:

S1. Ans(c)

Sol. మంజీర నది: ఈ నది వేసవికాలంలో ఎండిపోతుంది. అజీవనది (non-perenial) గోదావరి నదికి ప్రధాన ఉపనది. 644 కి.మీ పొడవైన ఈ నదిని మహారాష్ట్రలో “మంజ్రా” అని పిలుస్తారు. ఈ నది 823 మీటర్ల ఎత్తులో ఉన్న అహ్మదనగర్ జిల్లాలోని కొండల సమీపంలో బాలాఘాట్లో మొదలవుతుంది. మంజీరా నది తెలంగాణలో మెదక్ జిల్లాలో ప్రవేశించే ముందు కర్ణాటకలోని, బీదర్, మహారాష్ట్ర, లాతూర్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్ మండలాల ద్వారా మెదక్ జిల్లాలో 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నది కందుకుర్తి దగ్గర హరేద్రా (బాసర దగ్గర) నదిలో కలుస్తూ త్రివేణి సంగమం ఏర్పరుస్తూ గోదావరి నదిలో కలుస్తుంది. మంజీరా నదిపై ఆనకట్టలు నిజాం సాగర్ డ్యాం తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అచ్చంపేట్, బంజపల్లె గ్రామాల మంజీరా నదిపై నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు మంచినీరు అందిస్తుంది.

S2. Ans(a)

Sol.

  • శివరాం వన్యప్రాణుల అభయారణ్యం – మార్ష్ మొసలి
  • కాసు బ్రహ్మనందరెడ్డిజాతీయ పార్కు – నెమలి, ఉడుము
  • కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యం – పులి, అడవి దున్న
  • ప్రాణహిత వన్యమృగ అభయారణ్యం – కృష్ణ జింక

S3. Ans(c)

Sol.

  • నది – తెలంగాణాలో ప్రవేసించే ప్రదేశం
  • కృష్ణా – మహబూబ్ నగర్ జిల్లాలోని తంగడి వద్ద ప్రవేశిస్తుంది. 
  • గోదావరి – ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద ప్రవేశిస్తుంది
  • ఇంద్రవతి – కరీంనగర్ జిల్లాలోని మహాదేవపూర్ వద్ద ప్రవేశిస్తుంది
  • తుంగభద్ర – మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ వద్ద ప్రవేశిస్తుంది

S4. Ans(a)

Sol.

  • రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి – NH 44
  • రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి NH 150
  • రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి – SH 1
  • రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి – SH9. ఇది NH 365బి గా మారింది.

S5. Ans(b)

Sol. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ: దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో విదేశీ సహాయంతో 1980లో స్థాపించారు. ఇందులో తక్కువస్థాయి బొగ్గును ఉపయోగిస్తున్నారు.

S6. Ans(a)

Sol.

  • హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్ మియాపూర్ స్టేషన్ వద్ద కలదు. దీనిని రూపొందించింది – శంకర్ నారాయణ
  • మధురానగర్ మెట్రో స్టేషను పూర్తిగా మహిళల కోసం కేటాయించడం జరిగింది. దీనికి తరుణి స్టేషన్ గా నామకరణం చేశారు.
  • జె.బి.ఎస్ నుండి యం.జి.బి.ఎస్ వరకు గల మెట్రోరైలు మార్గాన్ని ఫిబ్రవరి 7, 2020 న సి.యం.కె.సి.ఆర్. ప్రారంభించారు.

S7. Ans(b)

Sol. తెలంగాణలో నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. వీటి తయారీకి స్థానికంగా దొరికే కలప, రంగులను వాడతారు. వీటికి వాడే కలప ‘పునిక కర్ర’ ఇది తేలికగా, అందంగా తీర్చిదిద్దడానికి అనువుగా ఉంటుంది. పేయింటింగ్స్ కోసం డ్యూకో పేయింట్స్ వాడతారు. 

ఈ కళాకారులు “గనిజా” అనే ప్లేయింగ్ కార్డ్స్ తయారుచేస్తారు. వీటిపై పేటెంట్ పొందిన సంవత్సరం 2010. నిర్మల్ ఫర్నీచర్పై భౌగోళిక గుర్తింపు (G.I) పొందిన సంవత్సరం 2009.

S8. Ans(a)

Sol: బాణుడు రాసిన హర్శచారిత్రలో శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదిశ్వరుడు అని పేర్కొన్నాడు.

S9. Ans(b)

Sol: కోటిలింగాల శాతవాహనల సామ్రాజ్యానికి తొలి రాజధాని. ఇది ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కోటగోడలు, ఒక బురుజు బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహనుల్లో మొదటి రాజైన శ్రీముఖుని నాణేలు, శాతవాహనల పూర్వపు రాజుల నాణేలు దొరికాయి.

S10. Ans.(b)

Sol: శాతవాహనులు అనంతరం తెలంగాణను పాలించిన తొలి క్షత్రియులు ఇక్ష్వాకులు. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, విష్ణుకుండినుల రాజవంశాలు పాలించాయి. వీరి కాలంలో ఆంధ్రదేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website