Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana Static GK MCQs Questions And...

Telangana Static GK MCQs Questions And Answers in Telugu, 14th September 2023 For TSPSC GROUPs & TS DSC

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Static GK MCQs Questions And Answers in Telugu.

Q1. శాతవాహనులలో ఎవరి కాలాన్ని  ‘ప్రాకృతంలో స్వర్ణయుగం’ అంటారు?

  1. 1వ పులోమావి 
  2. గుణాడ్యుడు
  3. కుంతల శాతకర్ణి 
  4. హాలుడు

Q2. కుతుబ్ షాహీలలో ఎవరి యొక్క కవితలు కులియత్ కులీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి?

  1. సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా
  2. మొహమ్మద్ కులీ కుతుబ్ షా 
  3. జంషీద్ కులీ కుతుబ్ షా
  4. అబ్దుల్లా కుతుబ్ షా

Q3. హైదరాబాద్ తొలి పత్రిక – రిసాల తబ్బి(ఉర్దూ) ఒక 

  1. వ్యాపార ప్రకటనల పత్రిక
  2. విద్యా సమాచార పత్రిక
  3. ఉద్యోగ పత్రిక
  4. వైద్యపత్రిక

Q4. క్రింది వాటిని జతపరచండి.

  1. ఫలక్ నమా పాలస్                     a. 1890
  2. చంచల్ గుడా                              b. 1874
  3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్        c. 1882
  4. నిజామియ అబ్సర్వేటరీ            d. 1884
  1. I-d, II-c, III-b, IV-a
  2. I-d, II-b, III-a, IV-c
  3. I-d, II-c, III-a, IV-b
  4. I-d, II-a, III-b, IV-c

Q5. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు?

  1. 1919 ఆగష్టు 15
  2. 1919 ఆగష్టు 14
  3. 1919 ఆగష్టు 25
  4. 1919 ఆగష్టు 28

Q6. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు నిర్వహించింది?

  1. ఆగష్టు 19, 2014
  2. ఆగష్టు 24, 2014
  3. ఆగష్టు 27, 2014
  4. ఆగష్టు 29, 2014

Q7. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లకు ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ ని ఇవ్వాలని నిర్ణయించారు?

  1. 100 యూనిట్లు
  2. 200 యూనిట్లు
  3. 250 యూనిట్లు
  4. 300 యూనిట్లు

Q8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు రూపొందించిన యాప్ ఏది?

  1. టాస్క్
  2. ఫాస్ట్
  3. టి-శాట్
  4. డీట్

Q9. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టిఎస్-ఐపాస్ చట్టం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?

  1. 2014
  2. 2015
  3. 2016
  4. 2018

Q10. సద్దిమూట పథకం ఎవరికోసం ఉద్దేశించబడింది?

  1. భవన నిర్మాణ కార్మికుల కోసం
  2. మత్స్యకారుల కోసం
  3. మార్కెట్ యార్డుల్లో రైతులు, హమాలీల కోసం 
  4. పొలంలో పనిచేసే రైతులు, కూలీల కోసం 

Solutions:

S1. Ans(d)

Sol:  శాతవాహన రాజు హాలుడి యొక్క కాలాన్ని ‘ప్రాకృతంలో స్వర్ణయుగం’ అంటారు.హాలుడి రచన గాథా సప్తశతి. ఇతని బిరుదు కవి వత్సలుడు.

S2. Ans(b)

Sol: మహమ్మద్ కులీ కుతుబ్ షా కవితలు కులియత్ కులీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.

ఇతని కలం పేరు – మానీల్

S3. Ans(d)

Sol: హైదరాబాద్ తొలి పత్రిక – రిసాల తబ్బి(ఉర్దూ) ఒక వైద్య పత్రిక.

S4. Ans(a)

Sol: ఫలక్ నమా పాలస్                    1884

      చంచల్ గుడా                            1882

      సికింద్రాబాద్ రైల్వే స్టేషన్      – 1874

      నిజామియ అబ్సర్వేటరీ          – 1890

S5. Ans(d)

Sol: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్ట మొదటి భవంతి అయిన  ఆర్ట్స్ కళాశాల 1919 ఆగష్టు 28న ప్రారంభం అయింది. మీర్ అక్బర్ అలీ ఆధ్వర్యంలోని విద్యా సదస్సు సూచనల మేరకు 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది.

S6. ans(a)

Sol: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, ఆగష్టు 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఒకే రోజు రాష్ట్రంలోని 1.09 లక్షల కుటుంబాల వివరాలను 4 లక్షల మంది ఉద్యోగులు సేకరించారు.

S7. ans(c)

Sol: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ని ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ 2021 ఏప్రిల్ 4న నిర్ణయించారు.

S8. ans(d)

Sol:  వివిధ రంగాలకు చెందిన అన్ని రకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు డీట్ యాప్, పోర్టల్ ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. 

DEET – Digital Employment Exchange of Telangana

S9. ans(a)

Sol: పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “టిఎస్- ఐపాస్” అనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది. 

టిఎస్-ఐపాస్ చట్టం- 2014 , డిసెంబర్4 నుండి అమలులోకి వచ్చింది.

TS-iPASS: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం.

S10. ans(c)

Sol: మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల కోసం రూ. 5లకే భోజనం అందించడం కోసం సద్దిమూట పథకం ఉద్దేశించబడింది. 2015, అక్టోబర్ 13న మంత్రి హరీష్ రావు గారు సిద్ధిపేట మార్కెట్ యార్డు లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website