Telugu govt jobs   »   Current Affairs   »   Telangana State Is At The Top...
Top Performing

Telangana State Is At The Top In Fish Farming And Production | చేపల పెంపకం, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

Telangana State Is At The Top In Fish Farming And Production | చేపల పెంపకం, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తి, వృద్ధి రెండింటిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో మత్స్య సంపదను 1.98 లక్షల టన్నుల నుంచి 4.24 లక్షల టన్నులకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆగస్టు 25న హైదరాబాద్‌లోని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్యలో వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దీటి మల్లయ్య అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. మత్స్యకారులకు మొబైల్ యాప్ ద్వారా అన్ని రకాల సేవలందిస్తున్నామని, చెరువుల్లోని చేపలను దళారులకు తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, వివిధ జిల్లాల మత్స్యకారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

2023 సంవత్సరానికి ఉచిత చేపలు మరియు రొయ్య పిల్లల పంపిణీ ఆగస్టు 26 నుండి తెలంగాణలో ప్రారంభమవుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందజేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మరియు నియోజకవర్గాల్లో చేపల పంపిణీని మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో సహా వివిధ అధికారులు ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఈ సంవత్సరం 26,357 నీటివనరుల్లో రూ.84.13 కోట్లతో 85.60 కోట్ల చేపపిల్లలను, 300 నీటివనరుల్లో రూ.25.99 కోట్లతో 10 కోట్ల రొయ్యపిల్లలను విడుదల చెయ్యనుంది.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State Is At The Top In Fish Farming And Production_4.1

FAQs

భారతదేశంలో అతిపెద్ద చేపల పెంపకం ఏది?

డియోలీ ఫిష్ ఫామ్ గోవింద్ సాగర్ రిజర్వాయర్‌లో సిల్వర్ కార్ప్ చేపలను నిల్వ చేయడంలో అగ్రగామిగా ఉంది, దీని కారణంగా హెక్టారుకు చేపల ఉత్పత్తి సామర్థ్యం దేశంలోనే అత్యధికంగా మారింది.