Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Telangana State GK MCQs Questions And Answers in Telugu.
Q1. రైతువేదిక సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి?
- తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికను నిర్మించడం ద్వారా రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరియు అధిక రాబడిని పొందడంలో సహాయపడటానికి చొరవ తీసుకుంది.
- వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, MGNREGA నిధుల నుంచి రూ.10 లక్షల వాటాతో రూ.22 లక్షల వ్యయంతో ఒక్కో రైతువేదికను నిర్మించారు.
- తెలంగాణ రైతు బంధు సమితి (టీఆర్బీఎస్) సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం రైతులు మరియు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మధ్య వారధిగా వ్యవహరించే 1,60,990 మంది సభ్యులతో గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది.
- రైతులు తమ వ్యవసాయాన్ని ఉత్పత్తి, ముఖ్యంగా ధాన్యాలు ఆరబెట్టడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రయోజన సిమెంట్ ‘కల్లం’ (ఎండబెట్టే వేదికలు) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
(a) 3 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 3, 4
(d) 1, 3 మరియు 4
Q2. హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు లో భాగంగా తరుణి స్టేషన్ గా పిలవబడే మెట్రో స్టేషన్ ఏది?
(a)మధురానగర్ మెట్రో స్టేషన్
(b) అమీర్ పేట్ మెట్రో స్టేషన్
(c) జె.బి.ఎస్ మెట్రో స్టేషన్
(d) యం.జి.బి.ఎస్ మెట్రో స్టేషన్
Q3. ఆసియా లోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ఏ జిల్లాలో ఉంది?
(a) వరంగల్
(b) ఖమ్మం
(c) ఆదిలాబాద్
(d) నిజామాబాద్
Q4. రత్నగర్భగా పిలువబడే రాష్ట్రం?
(a) ఒడిషా
(b) తెలంగాణ
(c) ఆంధ్రప్రదేశ్
(d) మహారాష్ట్ర
Q5. మహిళల పారిశ్రామిక పార్కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది?
- మెదక్ జిల్లాలోని సుల్తాన్పూర్ వద్ద మహిళా పారిశ్రామిక పార్కుల స్థాపనకు టిఎస్ఐఐసి 50 ఎకరాల మేరకు భూమిని కేటాయించింది.
- గ్రీన్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని టిఎస్ఐఐసి నిర్ణయిం తీసుకుంది.
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 2 మరియు 1
(d) 1 మరియు 2 కాదు
Q6. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది?
- భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్ వర్కను జూన్ 2020లో ప్రారంభించింది.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అభివృద్ధి చేయడానికి మరియు 2025 సంవత్సరం లోపు ప్రపంచంలో టాప్ 25వ స్థానంలో హైదరాబాదు ఉంచడం దీని ఉద్దేశ్యం.
(a) A మాత్రమే
(b) A మరియు B
(c) B మాత్రమే
(d) A మరియు B కాదు
Q7. ప్రధాన అటవీ ఉత్పత్తులు అవి లభించే జిల్లాలను జతపరుచుము
ప్రధాన అటవీ ఉత్పత్తులు జిల్లా
A. పుణికి చెట్టు 1. ఖమ్మం
B. రూసా గడ్డి 2. మహబూబ్‌నగర్
C. తుంగ గడ్డి 3. నిజామాబాద్
D. బీడి ఆకులు 4. ఆదిలాబాద్
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q8. నల్లరేగడి నేలలకు సంబందించి కింది వాటిలో సరి కానిది ఏది?
- దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి.
- ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి.
- నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉంటాయి.
(a) 1 మాత్రమే
(b) 1 మరియు 2
(c) 2 మాత్రమే
(d) 3 మాత్రమే
Q9. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఏది?
(a) విష్ణుకుండినులు
(b) ఇక్ష్వాకులు
(c) వాకాటకులు
(d) శాలంకాయనులు
Q10. రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
(a) రేచర్ల బేతిరెడ్డి
(b) రేచర్ల బమ్మిరెడ్డి
(c) రేచర్ల నాగిరెడ్డి
(d) రెండో కాటచమూపతి
Solutions:
S1. Ans (c)
Sol: రైతువేదిక :
- తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికను నిర్మించడం ద్వారా రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరియు అధిక రాబడిని పొందడంలో సహాయపడటానికి చొరవ తీసుకుంది.
- వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, MGNREGA నిధుల నుంచి రూ.10 లక్షల వాటాతో రూ.22 లక్షల వ్యయంతో ఒక్కో రైతువేదికను నిర్మించారు.
- తెలంగాణ రైతు బంధు సమితి (TRBS) సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం రైతులు మరియు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మధ్య వారధిగా వ్యవహరించే 1,60,990 మంది సభ్యులతో గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది.
- రైతులు తమ వ్యవసాయాన్ని ఉత్పత్తి, ముఖ్యంగా ధాన్యాలు ఆరబెట్టడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రయోజన సిమెంట్ ‘కల్లం’ (ఎండబెట్టే వేదికలు) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
S2. Ans (a)
Sol:
- హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్ మియాపూర్ స్టేషన్ వద్ద కలదు. దీనిని రూపొందించింది – శంకర్ నారాయణ
- మధురానగర్ మెట్రో స్టేషను పూర్తిగా మహిళల కోసం కేటాయించడం జరిగింది. దీనికి తరుణి స్టేషన్ గా నామకరణం చేశారు.
- జె.బి.ఎస్ నుండి యం.జి.బి.ఎస్ వరకు గల మెట్రోరైలు మార్గాన్ని ఫిబ్రవరి 7, 2020 న సి.యం.కె.సి.ఆర్. ప్రారంభించారు.
- హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ: మెటాస్
- హైదరాబాద్ మెట్రో రైలు చిహ్నం: నిజ్
S3. Ans (a)
Sol: కాకతీయుల కాలంలో రాజులకు వ్యతిరేకంగా గిరిజన తెగకు చెందిన మేడరాజు వంశీ యులైన సమ్మక్క, సారలమ్మలు చేసిన వీరోచిత పోరాటం నేటికి చిరస్మరణీయంగా మిగిలింది. అందుకే నేటికి వారి వీరోచిత పోరును స్ఫూర్తిగా తీసుకొని ‘మేడారం జాతర’ను నిర్వహిస్తున్నారు. ఆసియా లోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ప్రసిద్ధికెక్కింది.
S4. Ans (b)
Sol: తెలంగాణ రాష్ట్రం భిన్న భౌగోళిక లక్షణాలతో కూడిన అనేక రకాల ఖనిజ వనరులు సమృద్ధిగా కలిగి ఉన్నందున నిర్దిష్ట పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రం వివిధ రకాల ఖనిజాలకు నిలయం. భిన్నమైన శిలలు మరియు ఖనిజాలకు ప్రసిద్ది చెందిన తెలంగాణ ‘రత్నగర్భ’గా పేరు పొందింది. భిన్నమైన శిలలతో కూడిన ఈ శిలలు అనేక రకాల పారిశ్రామిక, పారిశ్రామికేతర లోహాలను నిక్షిప్తం చేసుకొని మైనింగ్ మరియు అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.
S5. Ans(c)
Sol: మహిళల పారిశ్రామిక పార్కు:
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, మెదక్ జిల్లాలోని సుల్తాన్పూర్ వద్ద మహిళా పారిశ్రామిక పార్కుల స్థాపనకు టిఎస్ఐఐసి 50 ఎకరాల మేరకు భూమిని కేటాయించింది.
- గ్రీన్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని టిఎస్ఐఐసి నిర్ణయిం తీసుకుంది.
S6. Ans(b)
Sol: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి :
- భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్ వర్కను జూన్ 2020లో ప్రారంభించింది.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అభివృద్ధి చేయడానికి మరియు 2025 సంవత్సరం లోపు ప్రపంచంలో టాప్ 25వ స్థానంలో హైదరాబాదు ఉంచడం దీని ఉద్దేశ్యం.
S7.Ans (d)
Sol:
- పుణికి చెట్టు:ఇది ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. దీన్ని ‘నిర్మల్ కొయ్యబొమ్మల’ తయారీకి ఉపయోగిస్తారు.
- రూసా గడ్డి:ఇది నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో పెరుగుతుంది. దీన్ని సెంట్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
- తుంగ గడ్డి:ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో లభిస్తుంది. దీన్ని ‘తుంగచాపల’ తయారీలో ఉపయోగిస్తారు.
- బీడి ఆకులు:వీటిని బీడిల తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఆకులను తునికాకు, తెండు ఆకులు అని పిలుస్తారు. ఇవి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో లభిస్తాయి.
- విప్ప పువ్వు:దీన్ని సారా తయారీకి ఉపయోగిస్తారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని అడవుల్లో లభిస్తాయి.
S8. Ans (d)
Sol: నల్లరేగడి నేలలు
వింధ్యా–సాత్పురా పర్వత శ్రేణుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు నల్లరేగడి మండలం విస్తరించి ఉంది. ఈ నేలలు ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని మాళ్వా పీఠభూమి, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి. నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉండవు. అందువల్ల నల్లరేగడి నేలల్లో సాగునీటి వ్యవసాయం సాధ్యం కాదు. ఇవి పత్తిసాగుకు చాలా అనువైనవి.
S9. Ans (a)
Sol: విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
S10. Ans (b)
Sol: కాకతీయ మొదటి (గరుడ) భేతరాజు (922-1052) వద్ద సేనాధిపతిగా ఉండి కాంచీపుర చోళరాజులతో జరిగిన యుద్ధంలో వారిని జయించి ప్రఖ్యాతి గడించిన రేచర్ల బమ్మ (బ్రహ్మ) సేనాని అనే బమ్మిరెడ్డి (1035-1055) ఈ వంశ మూలపురుషుడు, పాలంపేట, పిల్లల మర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడ్ని పేర్కొన్నవి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |