Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 8 December 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. ఈ కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన సభ్యులు

  1. బెజవాడ గోపాలరెడ్డి
  2. బూర్గుల రామకృష్ణారావు
  3. నీలం సంజీవరెడ్డి
  4. మర్రి చెన్నారెడ్డి

(a) 1, 2, 3, 4

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 3 మరియు 4

Q2. రైతుబంధు పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.

(a) 2018-19 నుండి 2020-21 సం॥ల మధ్యకాలంలో ఈ పథకం ద్వారా 35,671 కోట్ల రూపాయల్ని పంపిణీ చేయడం జరిగింది.

(b) 2020-21 సం॥లో ఈ పథకం ద్వారా 59.3 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.

(c) 2012-20 సం॥లో ఈ పథకం ద్వారా 10,532 కోట్ల రూపాయల్ని పంపిణీ చేశారు.

(d) పైవన్నీ సరియైనవి

Q3. 2020-21లో ఖనిజ ఆదాయ సేకరణ పరంగా అగ్ర జిల్లాలు జత చేయండి

జాబితా – I                          జాబితా – II

  1. సిద్దిపేట                     1. గ్రానైట్, క్వార్డ్, ఇసుక
  2. కరీంనగర్                  2. గ్రానైట్, లాటరైట్, ఇసుక
  3. సూర్యపేట                3. రోడ్డు మెటల్, క్వార్థి
  4. మహబూబ్ నగర్     4. సున్నపురాయి, గ్రానైట్, స్టోన్మెటల్స్

సరైన సమాధానం:

A        B        C        D

(a)      1        2        4        3

(b)      2        4        I         3

(c)      3        1        2        4

(d)      3        2        1        4

Q4. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBS)  కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైంది?

  1. గ్రామీణ బ్యాంక్ లపై నియమించబడ్డ వర్కింగ్ గ్రూప్ సిఫారసులపై వాణిజ్య బ్యాంకులు సహకార సంఘాలు కృషికి అనుబంధంగా RRB లను ఏర్పాటు చేసింది.
  2. ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో గ్రామీణ రుణ భారాన్ని తగ్గించి సంస్థాగత పరపతిని అందించుట ఒక అంశము.
  3. 1975 సెప్టెంబర్ ల RRB ల స్థాపనకు ఆర్డినెన్స్లను జారీ చేసింది.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q5. భూ సంస్కరణల లక్ష్యాలను గూర్చి, ప్రణాళిక సంఘం అధికారికంగా క్రింది లక్ష్యాలను ప్రకటించింది.

  1. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలు తొలగించుట.
  2. వ్యవసాయ రంగంలో ఉన్న దోపిడీలు, సాంఘిక అన్యాయాలు తొలగించి భూమి దున్నేవాడికి రక్షణ ఇచ్చుట.
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2
  4. 1 & 2 రెండూ కాదు

Q6. AGMARK (Agriculture Marketing) గుర్తు దేనికి సంబందించినది?

(a) ఆహార ప్రామాణిక తూనికలు, కొలతలు

(b) గ్రేడింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులు

(c) మార్కెటింగ్ గిడ్డంగి సౌకర్యాలు

(d) వ్యవసాయ లాబ్స్

Q7. రాష్ట్రంలో పశుసంపద సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి?

  1. పశుగణన – 2019 ప్రకారం రాష్ట్రంలో మొత్తం పశుసంపద 3 కోట్లు 2012 సంవత్సరం నుండి చూస్తే రాష్ట్రంలో 22 శాతం పశుసంపద పెరిగింది.
  2. ఆ మొత్తం పశుసంపదలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉన్నప్పటికీ గొర్రెల సంఖ్యలో ప్రథమ స్థానంలో, కోళ్ళ సంఖ్యలో (పౌల్ట్రీ) మూడవ స్థానంలో ఉంది.
  3. 2020-21 సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పశుసంపద రంగం1 శాతం వాటాను కలిగి ఉంది.
  4. 2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,481 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేయబడినాయి. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది.

(a) 3 మాత్రమే

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 1, 2, 3, 4

(d) 1, 3 మరియు 4

Q8. కింది వాటిని జతపరుచుము.

జాబితా – 1                           జాబితా – 2

  1. 1963              1. TRIFED (ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)
  2. 1958              2. రాష్ట్ర వాణిజ్యం
  3. 1987              3. NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)
  4. 1965              4. NCDC (జాతీయ సహకార అభివృద్ధి సంస్థ)

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q9. భూ సంస్కరణల అనుభవాలను P.C. Joshi ఎన్ని రకాలుగా వర్గీకరించారు?

  1. 4
  2. 7
  3. 6
  4. 2

Q10. భూ సంస్కరణలపై వ్రాయబడిన ముఖ్య గ్రంథాలు

కింది వాటిని జత చేయండి.

రచయిత                                       గ్రంథాలు

  1. ఆర్థర్ లూయిస్                  I. Agrarian Reforms in India
  2. థియోడర్ బెర్మన్               II. Telangana People’s Struggles and It’s lesson.
  3. పుచ్చలపల్లి సుందరయ్య    III. The Theory of Economic Growth
  4. శ్రీ ఎన్.జి.రంగా                   IV. The modern Indian Peasant

సరైన సమాధానం:

A        B        C        D

(a)      I         II        IV       III

(b)      IV       III       I         II

(c)      III       I         II        IV

(d)      III       II        I         IV

Solutions:

S1. Ans(a)

Sol: పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన సభ్యుల సంఖ్య – 8

తెలంగాణా ప్రాంతం వారు (నలుగురు)

1.బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి)

2.మర్రి చెన్నారెడ్డి (మంత్రి)

3.కె.వి. రంగారెడ్డి(మంత్రి)

4.నర్సింగరావు (H.S.C)

ఆంధ్రా ప్రాంతంవారు (నలుగురు)

1.బెజవాడ గోపాలరెడ్డి(ముఖ్యమంత్రి)

2.నీలం సంజీవరెడ్డి(ఉప ముఖ్యమంత్రి)

3.గౌతు లచ్ఛన్న (మంత్రి)

  1. అల్లూరి సత్యనారాయణ రాజు (A.S.C)

S2. Ans(d)

Sol: రైతుబంధు పథకానికి సంబంధించి :

  • 2018-19 నుండి 2020-21 సం॥ల మధ్యకాలంలో ఈ పథకం ద్వారా 35,671 కోట్ల రూపాయల్ని పంపిణీ చేయడం జరిగింది.
  • 2020-21 సం॥లో ఈ పథకం ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.
  • 2012-20 సం॥లో ఈ పథకం ద్వారా 10,532 కోట్ల రూపాయల్ని పంపిణీ చేశారు

S3. Ans(a)

Sol: 2020-21లో ఖనిజ ఆదాయ సేకరణ పరంగా అగ్ర జిల్లాలు:

  • సిద్దిపేట – గ్రానైట్, క్వార్డ్, ఇసుక
  • కరీంనగర్ – గ్రానైట్, లాటరైట్, ఇసుక
  • సూర్యపేట – సున్నపురాయి, గ్రానైట్, స్టోన్మెటల్స్
  • మహబూబ్ నగర్ – రోడ్డు మెటల్, క్వార్థి

S4. Ans (d)

Sol: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBS)  :

  • గ్రామీణ బ్యాంక్ లపై నియమించబడ్డ వర్కింగ్ గ్రూప్ సిఫారసులపై వాణిజ్య బ్యాంకులు సహకార సంఘాలు కృషికి అనుబంధంగా RRB లను ఏర్పాటు చేసింది.
  • ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో గ్రామీణ రుణ భారాన్ని తగ్గించి సంస్థాగత పరపతిని అందించుట ఒక అంశము.
  • 1975 సెప్టెంబర్ ల RRB ల స్థాపనకు ఆర్డినెన్స్లను జారీ చేసింది

S5. Ans (c)

Sol: భూ సంస్కరణల లక్ష్యాలను గూర్చి, ప్రణాళిక సంఘం అధికారికంగా క్రింది లక్ష్యాలను ప్రకటించింది.

1 వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలు తొలగించుట.

  1. వ్యవసాయ రంగంలో ఉన్న దోపిడీలు, సాంఘిక అన్యాయాలు తొలగించి భూమి దున్నేవాడికి రక్షణ ఇచ్చుట.

S6. Ans (b)

Sol: గ్రేడింగ్, ప్రామాణీకరణ: గ్రేడింగ్, ప్రామాణీకరణ్ సదుపాయాలు లేకుండా వ్యవసాయ మార్కెటింగ్ విధానం మెరుగకాదు. అందుచే వ్యవసాయ ఉత్పత్తుల (గ్రేడింగ్ మార్కెటింగ్) చట్టం 1937లో తీసుకు రావడం జరిగింది. గ్రేడింగ్ చేసిన. వ్యవసాయ ఉత్పత్తులకు అగ్ మార్క్ గుర్తును అందిస్తారు. 1937 (Central Quality Control Laboratory) ని నాగపూర్ లో స్థాపించారు. దీని ఆధ్వర్యంలో AGMARK (Agricultueal Marketing) ఇవ్వబడుతుంది. వ్యవసాయ వస్తువుల నాణ్యతను తెలియజేసేదే AGMARK.

S7. Ans(c)

Sol: రాష్ట్రంలో పశుసంపద సంబంధించి :

  • పశుగణన – 2019 ప్రకారం రాష్ట్రంలో మొత్తం పశుసంపద 3 కోట్లు 2012 సంవత్సరం నుండి చూస్తే రాష్ట్రంలో 22 శాతం పశుసంపద పెరిగింది.
  • ఆ మొత్తం పశుసంపదలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉన్నప్పటికీ గొర్రెల సంఖ్యలో ప్రథమ స్థానంలో, కోళ్ళ సంఖ్యలో (పౌల్ట్రీ) మూడవ స్థానంలో ఉంది.
  • 2020-21 సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పశుసంపద రంగం1 శాతం వాటాను కలిగి ఉంది.
  • 2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,481 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేయబడినాయి. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది

S8. Ans (b)

Sol:

  • 1963 – NCDC(National cooperative development corporation) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ
  • 1958 – NAFED (National Agricultural Cooperative marketing federation of Indian Limited) నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  • 1987 – TRIFED ( Tribal cooperative marketing development federation of India) ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
  • 1965 –  State trading రాష్ట్ర వాణిజ్యం

S9. Ans (a)

Sol: భూ సంస్కరణల అనుభవాలను P.C. Joshi 4 రకాలుగా వర్గీకరించారు.

  1. ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చినవి.

ఉదా : మధ్యవర్తుల తొలగింపు, కౌలుదారీ చట్టాలు, కమతాల గరిష్ట పరిమితి

  1. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినవి నిర్ణయం.

ఉదా : తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీలోని నక్సలైట్ ఉద్యమం.

  1. చట్టాలు, ఉద్యమాల ద్వారా వచ్చినవి

ఉదా : కేరళ, పశ్చిమబెంగాల్లో రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు, వామపక్ష ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, ప్రజల నుండి ఐచ్ఛికంగా వచ్చినవి ఉదా : భూ దానోద్యమం.

S10. Ans (c)

Sol: ఆర్థర్ లూయిస్  -The Theory of Economic Growth.

థియోడర్ బెర్మన్ – Agrarian Reforms in India

పుచ్చలపల్లి సుందరయ్య –  Telangana People’s Struggles and It’s lesson.

శ్రీ ఎన్.జి.రంగా   –  The modern Indian Peasant

 

adda247

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!