Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. వరి (Paddy) కు సంబంధించి కింది ప్రకటనలో సరైంది ఏది?
- ఇది ఉష్ణ మండల పంట. దీనికి ఒండ్రుమట్టి నేలలు అత్యంత అనుకూలం.
- సాగుకు యోగ్యమైన భూమిలో 25% విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.
- తెలంగాణాలో అధికంగా వరి పండించే జిల్లాలు: నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జగిత్యాల, ఖమ్మం.
- తెలంగాణలో వరి ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నిజామాబాద్
(a) 1 & 2
(b) 1, 2 & 3
(c) 1, 2, 3 & 4
(d) 1, 3 & 4
Q2. సేంద్రియ వ్యవసాయం ఈ కింది ప్రయోజనాలను కలిగి ఉంది. అవి ఏవి?
- సేంద్రీయ వ్యవసాయం అధిక నాణ్యత కలిగిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, సహజ వనరుల ఆధారాన్ని మరియు పర్యావరణాన్ని పెంపొందించడానికి.
- రైతుల ఆదాయాన్ని పెంచడానికి (దిగుబడిలో స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ, ఉత్పత్తిపై ప్రీమియం ధర నుండి వస్తుంది) మరియు రైతుల సంక్షేమం దోహదం చేస్తుంది.
(a) 1 మరియు 2
(b) 2 మాత్రమే
(c) 1 మాత్రమే
(d) పైవేవి కావు
Q3. వ్యవసాయ మార్కెటింగ్ బలహీనతలు ఏవి?
- ఎలక్ట్రానిక్ వేలంపాట లేకపోవుట
- వినియోగదారులకు ప్రతిరోజు టోకు ధరలు సమాచారం ఇవ్వకపోవుట
- రిటైల్ ధరలలో ఉత్పత్తి దారునకు 20-25% మధ్యలో మాత్రమే వెళ్లుట
- రెగ్యులేటెడ్ మార్కెట్లలో మౌళిక సదుపాయాలు లేకపోవుట.
(a) 1, 2, 3, 4
(b) 1, 3 మరియు 4
(c) 2 మరియు 3 మాత్రమే
(d) 2 మాత్రమే
Q4. కింది వాటిని జరపరుచుము.
పత్రికలు సంవత్సరం
- శైవ ప్రచారిణి 1. 1912
- సరోజినీ విలాస్ 2. 1923
- ఆంధ్ర మాత 3. 1922
- నీలగిరి 4. 1917
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q5. ప్రతిపాదన (A): ఆంధ్రమాతను తెలుగుమాతగా మార్చి తెలంగాణ వారి మాతగా చేశారు.
కారణము (R) : తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలేదు.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Q6. లోక్సభ ఎన్నికలలో సంపూర్ణమెజారిటీ సాధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించలేదు. దీంతో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు అయిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ రక్షణ విషయ ఇందిరాగాంధితో 6 అంశాల ఒప్పందంను మౌఖికంగా కుదుర్చుకొని తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ లో కలిపివేశాడు. ఆ అంశాలు ఏవి?
- తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చట్టబద్దమైన అధికారాలు
- తెలంగాణకు ప్రత్యేకబడ్జెట్, ప్రత్యేక అంచనాల తయారీ
- ప్రత్యేకంగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
- ముల్కి నిబంధనలను అమలు చేయడం.
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) 1, 2, 3 & 4
Q7. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి 1. NH 150
- రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి 2. NH 44
- రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి 3. SH9
- రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి 4. SH 1
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q8. వాహనాల బాడీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని వాణిజ్య వాహన తయారీదారైన ____ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
- TATA
- HONDA
- ASHOK LAYLAND
- TVS
Q9. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఏది?
- విష్ణుకుండినులు
- ఇక్ష్వాకులు
- వాకాటకులు
- శాలంకాయనులు
Q10. రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
- రేచర్ల బేతిరెడ్డి
- రేచర్ల బమ్మిరెడ్డి
- రేచర్ల నాగిరెడ్డి
- రెండో కాటచమూపతి
Solutions:
S1. Ans (c)
Sol: వరి (Paddy):
- ఇది ఉష్ణ మండల పంట. దీనికి ఒండ్రుమట్టి నేలలు అత్యంత అనుకూలం.
- సాగుకు యోగ్యమైన భూమిలో 25% విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.
- వరి సాగు చేయు విధానంను హై కల్చర్ (Hoe Culture)
- తెలంగాణాలో అధికంగా వరి పండించే జిల్లాలు: నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జగిత్యాల, ఖమ్మం
- తెలంగాణలో వరి సాగు విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నిజామాబాద్
- తెలంగాణలో వరి ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నిజామాబాద్
- ప్రపంచంలో వారిని అధికంగా ఉత్పత్తి చేయునది చైనా తరువాత భారత్.
- రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ: కరీంనగర్
S2. Ans (a)
Sol: సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు:
- సేంద్రీయ వ్యవసాయం అధిక నాణ్యత కలిగిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, సహజ వనరుల ఆధారాన్ని మరియు పర్యావరణాన్ని పెంపొందించడానికి.
- రైతుల ఆదాయాన్ని పెంచడానికి (దిగుబడిలో స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ, ఉత్పత్తిపై ప్రీమియం ధర నుండి వస్తుంది) మరియు రైతుల సంక్షేమం దోహదం చేస్తుంది.
S3. Ans (a)
Sol: వ్యవసాయ మార్కెటింగ్ బలహీనతలు :
- ఎలక్ట్రానిక్ వేలంపాట లేకపోవుట
- వినియోగదారులకు ప్రతిరోజు టోకు ధరలు సమాచారం ఇవ్వకపోవుట
- రిటైల్ ధరలలో ఉత్పత్తి దారునకు 20-25% మధ్యలో మాత్రమే వెళ్లుట
- రెగ్యులేటెడ్ మార్కెట్లలో మౌళిక సదుపాయాలు లేకపోవుట.
S4. Ans (a)
Sol:
- శైవ ప్రచారిణి – 1923
- సరోజినీ విలాస్ – 1912
- ఆంధ్రమాత – 1917
- నీలగిరి – 1922
S5. Ans(c)
Sol: తెలుగువారి మధ్య భావసమైక్యతను సాధించి తెలంగాణ ఉద్యమాన్ని మరుగున పడేయడానికి కంకణం కట్టుకున్న వెంగళరావు 1975 ఏప్రిల్ లో ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాదులో నిర్వహించాడు. ఈ తెలుగు మహాసభలకు చార్ మినార్ నుండి లాల్ బహదూర్ దాకా ముఖ్యమంత్రి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి తెలుగు మహాసభలకు ప్రాచుర్యం కల్పించాడు. ఈ తెలుగు మహాసభల కోసమే శంకరంబాడి సుందరాచారి అనే ఆంధ్ర కవి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనే గేయాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఈ పాటలో కేవలం రుద్రమదేవి మినహా మరే ఇతర అంశము తెలంగాణకు సంబంధించినది లేదు. వెంగళరావు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ తెలుగు మహాసభల సందర్భంగా సన్మానించబడిన కవులలో కేవలం ఇద్దరు కవులు (కాళోజీ, పెంబర్తి) మాత్రమే తెలంగాణావారు ఉన్నారు. ఈ విధంగా ఒక క్రమపద్ధతిలో ఆంధ్రమాతను తెలుగుమాతగా మార్చి తెలంగాణ వారి మాతగా కూడా చేశారు.
S6. Ans (d)
Sol: లోక్సభ ఎన్నికలలో సంపూర్ణమెజారిటీ సాధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించలేదు. దీంతో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు అయిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ రక్షణ విషయ ఇందిరాగాంధితో 6 అంశాల ఒప్పందంను మౌఖికంగా కుదుర్చుకొని తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ లో కలిపివేశాడు.
6 అంశాల కార్యక్రమం (మౌఖిక ఒప్పందం):
- తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చట్టబద్దమైన అధికారాలు
- తెలంగాణకు ప్రత్యేకబడ్జెట్, ప్రత్యేక అంచనాల తయారీ
- ప్రత్యేకంగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
- ప్రత్యేక రాష్ట్ర సమస్యను మరో సమయంలో తిరగదోడవచ్చు.
- ముల్కి నిబంధనలను అమలు చేయడం.
- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మార్చడం.
S7. Ans (a)
Sol:
- రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి – NH 44
- రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి NH 150
- రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి – SH 1
- రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి – ఇది NH 365బి గా మారింది.
S8. Ans(c)
Sol: 500 కోట్లు పెట్టుబడితో వాహనాల బాడీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని వాణిజ్య వాహన తయారీదారైన అశోక్ లీలాండ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఏర్పాటయ్యే ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా అనేకమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
S9. Ans (a)
Sol: విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.
S10. Ans (b)
Sol: కాకతీయ మొదటి (గరుడ) భేతరాజు (922-1052) వద్ద సేనాధిపతిగా ఉండి కాంచీపుర చోళరాజులతో జరిగిన యుద్ధంలో వారిని జయించి ప్రఖ్యాతి గడించిన రేచర్ల బమ్మ (బ్రహ్మ) సేనాని అనే బమ్మిరెడ్డి (1035-1055) ఈ వంశ మూలపురుషుడు, పాలంపేట, పిల్లల మర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడ్ని పేర్కొన్నవి.

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |