Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 30 January 2023, For TSPSC Groups and TS Police

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. మహిళా విముక్తి సంఘం పేరుతో సుమారుగా 25 గ్రామాలలో భూస్వాముల ఆగడాలను, కూలీ పెరగాలనీ తెలుపుతూ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చైతన్యం చేయడంలో గణనీయమైన పాత్రపోషించిన మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలు ఎవరు?

 1. చాకలి ఐలవ్వ
 2. సదా లక్ష్మి
 3. రాజవ్వ
 4. పైనవారందరు

Q2. తెలంగాణ రాష్ట్రం కింది ఏ రాష్ట్రాలతో సరిహద్దులుగా కలిగి ఉంది?

 1. మహారాష్ట్ర
 2. కర్ణాటక
 3. ఆంధ్రప్రదేశ్
 4. ఛత్తీస్‌గఢ్

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి

(a) 1& 2

(b) 1, 2 & 3

(c)1, 3 & 4

(d) 1, 2, 3 & 4

Q3. భారత రాష్ట్రపతి జారీచేసిన ప్రసిడేన్షియల్ ఆర్డర్ యొక్క ఉల్లంఘనలు ఏవి?

 1. నియమకాలు జరిగినపుడు ముందుగా ఓపెన్ కాంపిటేషన్ ద్వారా నింపబడిన కోటకు బదులు రిజర్వు కోటాను నింపుతారు.
 2. జిల్లా స్థాయి కేడర్లను జోనల్ స్థాయి కేడర్లుగా మార్చారు
 3. నాన్ గెజిటేడ్ కేడర్లను జోనల్ స్థాయి గెజిటేడ్ కేడర్లుగా మార్చారు.
 4. పైవన్నీ

Q4. ప్రతిపాదన (A):  విశాలాంధ్ర ఏర్పాటు ప్రక్రియలో భాష ఒక్క అంశమే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సంఘం సూచనలలో లేదు.

కారణము (R) : కమీషన్ విశాలాంధ్ర ఏర్పాటుకు సూచనలు చేసే విషయంలో భాషా పరమైన అంశంకంటే, ఆర్థిక పరమైన అంశాలకే అధిక ప్రాధాన్యమిచ్చినట్లు కూడ విదితమవుతుంది.

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Q5. సీటి కాలేజి సంఘటనలో  జరిపిన కాల్పులలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 3, 4న జరిగిన కాల్పులలో 6 మంది మరణించారు. అనధికార లెక్కల ప్రకారం 8 మంది మరణించారు. కింది పేర్కొన్న వారిలో మొదటిసారి కాల్పుల్లో మరణించినది ఎవరు?

 1. మహమ్మద్ ఖాసీం
 2. షేక్ మహబూబ్
 3. మహ్మద్ ఖాన్
 4. రాములు

Q6. కాకతీయుల రాజ్యానికి ప్రధాన ఆదాయమైన భూమిశిస్తును పండించిన మొత్తం పంటలో ఎంత భాగాన్ని వసూలు చేసేవారు?

 1. 1/4 వంతు నుంచి 1/2 వరకూ
 2. పండిన పంటలో 1/3వ వంతు
 3. పండిన పంటలో 1/7వ వంతు
 4. పండిన పంటలో 1/5వ వంతు

Q7. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి  కింది వాటిలో సరిగ్గా జతకానిది ఏది?

 1. మిలటరీ గవర్నర్ – జె.ఎన్. చౌదరి
 2. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఆర్. ప్రధాన్.
 3. అడిషినల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఎస్.బాక్లే (దత్త ప్రసన్న సదాశివ బాక్లే)

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q8. TASK నైపుణ్యాల పెంపులో నూతన ఆవిష్కరణలు చేసింది. ఈ కింది వాటిలో అవి ఏవి.

 1. ఉద్యోగాల సామర్ధ్యాల పెంచటం
 2. పినిషింగ్ స్కూల్స్
 3. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్
 4. టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్

(a) 1, 3 , 4

(b) 2 మరియు 3

(c) 1, 2, 3, 4

(d) 1, 2, 3

Q9. కింది వాటిలో ‘ఆంధ్ర పరిశోధక (లక్ష్మణరాయ) మండలి’ చేసిన కార్యక్రమం ఏది?

 1. అనేక తాళపత్ర గ్రంథాలను వెలికితీసింది
 2. అనేక శాసనాలను వెలికితీసింది
 3. తెలంగాణ చరిత్ర వెలికితీతకు కృషి చేసింది
 4. పైవన్నీ

Q10. గోదావరి ఒడ్డున గల తెలంగాణలోని పుణ్యక్షేత్రాలను జత పరుచుము.

జాబితా – I                జాబితా – I

 1. శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం       1. కోటిలింగాల (జగిత్యాల జిల్లా)
 2. కోటేశ్వర సిద్దేశ్వర ఆలయం             2. కందకుర్తి (నిజామాబాద్)
 3. అంబా అగస్తేశ్వరాలయం                 3. మంథని (పెద్దపల్లి)
 4. గౌతమేశ్వరాలయం                        4. చెన్నూర్ (మంచిర్యాల)

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Solutions:

S1. Ans (c)

Sol: మహిళా విముక్తి సంఘం పేరుతో సుమారుగా 25 గ్రామాలలో భూస్వాముల ఆగడాలను, కూలీ పెరగాలనీ తెలుపుతూ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చైతన్యం చేయడంలో గణనీయమైన పాత్రపోషించిన మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలు రాజవ్వ.

S2. Ans (d)

Sol: 56లో రాష్ట్రాలను భాషాపరమైన పునర్వ్యవస్థీకరణ చేయగా, హైదరాబాదులోని తెలుగు మాట్లాడే ప్రజలను తెలంగాణ అని అనేవారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడమైంది. జూన్ 2, 2014న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పరివేష్టిత రాష్ట్రంగా ఉండి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దుగా, కర్ణాటక రాష్ట్రం, పడమరన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాన, తూర్పున సరిహద్దులుగా కలిగి ఉంది.

S3. Ans(d)

Sol: భారత రాష్ట్రపతి జారీచేసిన ప్రసిడేన్షియల్ ఆర్డర్ యొక్క ఉల్లంఘనలు:

 • నియమకాలు జరిగినపుడు ముందుగా ఓపెన్ కాంపిటేషన్ ద్వారా నింపబడిన కోటకు బదులు రిజర్వు కోటాను నింపుతారు.
 • జిల్లా స్థాయి కేడర్లను జోనల్ స్థాయి కేడర్లుగా మార్చారు
 • నాన్ గెజిటేడ్ కేడర్లను జోనల్ స్థాయి గెజిటేడ్ కేడర్లుగా మార్చారు

S4. Ans (a)

Sol:  సుదీర్ఘకాలంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రజా సంఘాలు, వ్యక్తులు విశాలాంధ్ర ఏర్పాటు కోసం ప్రబలమైన కాంక్షతో పనిచేస్తున్నందువల్ల, దీనికి భిన్నంగా మరే ఇతర కారణాలు లేకున్నట్లయితే విశాలాంధ్ర ఏర్పాటును ఆహ్వానించాల్సిందేనని సంఘం సూచించింది. మానవ వనరుల విషయంలో ఆంధ్రరాష్ట్రం అధిక్యత కలిగి ఉంటే, తెలంగాణా ఆర్థిక వనరుల విషయంలో ధనవంతమైనది కాబట్టి వనరుల విషయమై పరస్పర ప్రయోజనాన్ని పొందవచ్చని, ఇటు ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రను, ఒకే భాష మాట్లాడే వారయినప్పటికి ప్రత్యేకంగా ఉండాలను కొనే తెలంగాణా ప్రయోజనాల మధ్య సమతౌల్యతను సాధించే ధ్యేయంతోనే ఇరు ప్రాంతాలకు ఇష్టమైతేనే అనే షరతుతో విశాలాంధ్ర ఏర్పాటును సూచించినట్లు అనిపిస్తుంది. అన్నింటికంటే ప్రధానమైన అంశమేమంటే, కమీషన్ విశాలాంధ్ర ఏర్పాటుకు సూచనలు చేసే విషయంలో భాషా పరమైన అంశంకంటే, ఆర్థిక పరమైన అంశాలకే అధిక ప్రాధాన్యమిచ్చినట్లు కూడ విదితమవుతుంది. అందువల్ల భాష ఒక్క అంశమే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సంఘం సూచనలలో లేదు.

S5. Ans (a)

Sol: సీటి కాలేజి సంఘటనలో   జరిపిన కాల్పులలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 3, 4న జరిగిన కాల్పులలో 6 మంది మరణించారు. అనధికార లెక్కల ప్రకారం 8 మంది మరణించారు.

 • మహ్మద్ ఖాసీం – వయస్సు 22 సంవత్సరాలు – ఫాక్టరీ వర్కర్
 • షేక్ మహబూబ్ – వయస్సు 30 సంవత్సరాలు – రిక్షా కార్మికుడు
 • జమాలుద్దీన్ – వయస్సు 40 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
 • మహ్మద్ ఖాన్ – వయస్సు 35 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
 • రాములు – వయస్సు 18 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
 • షేక్ ముక్తార్ – వయస్సు 40 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి

S6. Ans (a)

Sol: కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/4 నుంచి 1/2 వరకు శిస్తుగా వసూలు చేసేవారు. వీరికాలంలో మోటుపల్లి (దేశీయకొండ) ప్రముఖ రేవు.

S7. Ans (b)

Sol: గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి:

 • మిలటరీ గవర్నర్ – జె.ఎన్. చౌదరి
 • చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఎస్.బాక్లే (దత్త ప్రసన్న సదాశివ బాక్లే)
 • అడిషినల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఆర్. ప్రధాన్.
 • ఇతర సభ్యులు :
 1. నవాబైన్ యార్జంగ్ బహదూర్
 2. రాజా దొందిరాజ్ బహదూర్
 • సి.వి.ఎస్.రావు
 1. సి.హెచ్. కృష్ణారావు

S8. Ans(c)

Sol: TASK నైపుణ్యాల పెంపులో నూతన ఆవిష్కరణలు చేసింది. అవి:

 • ఉద్యోగాల సామర్ధ్యాల పెంచటం
 • పినిషింగ్ స్కూల్స్
 • ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్
 • టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్

S9. Ans: (d)

Sol: ఆంధ్రజన సంఘం ఆంధ్ర మహాసభలో విలీనమైనది. ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారధ్యంలో ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించబడినది (కొమర్రాజు చనిపోయిన తరువాత ఇది లక్ష్మణ రాయ పరిశోధక మండలిగా మారింది). ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతులను వెలుగులోకి తేవడానికి అనేక శాసనాలను తాళపత్ర గ్రంథాలను వెలికి తీసింది

S10. Ans(a)

Sol: గోదావరి ఒడ్డున గల తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు:

 • శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం – కందకుర్తి (నిజామాబాద్)
 • అంబా అగస్తేశ్వరాలయం చెన్నూర్ (మంచిర్యాల)
 • కోటేశ్వర సిద్దేశ్వర ఆలయం – కోటిలింగాల (జగిత్యాల జిల్లా)
 • గౌతమేశ్వరాలయం-మంథని (పెద్దపల్లి)

 

Telangana High Court | Target Batch | Telugu Online Live Classes By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

.

.