Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 03 November 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 1 November 2022 |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – Questions

Q1. 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరియైనవి ఏవి?

  1. ఈ నివేదిక ప్రకారం ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తున్నారు.
  2.  తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి  21 మంది శిశువులు మరణిస్తున్నారు. 
  3. 2014లో రాష్ట్రంలో ప్రతివెయ్యి శిశు మరణాల్లో 50మంది మరణించేవారు.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. 1, 2 మాత్రమే సరైనవి 
  2. 1 మాత్రమే సరైనది 
  3. 2,3 మాత్రమే సరైనది
  4. అన్నీ సరైనవి

Q2. రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మరియు స్వయం సహాయక బృందాలు (SHGలు) మార్కెట్ ఆక్సెస్ ని ప్రారంభించడానికి క్రింది వాటిలో ఏది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(SERP), తెలంగాణతో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది?

  1. అమెజాన్ 
  2. గూగుల్
  3. ఫ్లిప్ కార్ట్ 
  4. మైక్రోసాఫ్ట్

Q3. రాష్ట్రంలో  అత్యధిక పంటలసాంద్రత గల జిల్లా ఏది?

  1. నల్గొండ
  2. మహబూబ్ నగర్
  3. కామారెడ్డి
  4. నిజమాబాద్

Q4. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏ రెండు జిల్లాల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది?

  1. పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి
  2. సిద్ధిపేట, కరీంనగర్
  3. రాజన్న సిరిసిల్ల, ములుగు
  4. కామారెడ్డి, సంగారెడ్డి

Q5. తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాత జిల్లా ఏది?

  1. ఆదిలాబాద్ 
  2. వరంగల్
  3. నిజామాబాద
  4. నల్గొండ

Q6. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2022-23 కేటాయింపుల్లో సరికాని అంశం ఏది?

  1. మహిళా విశ్వ విద్యాలయానికి 100 కోట్లు
  2. అటవీ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు 
  3. కొత్త వైద్య కళాశాలల కోసం 1000 కోట్లు
  4. హరితహారం పథకానికి 1000 కోట్లు

Q7. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టిఎస్- ప్రైడ్ కి సంబంధించి క్రిందివాటిలో సరికానిది ఏది?

  1. టిఎస్- ప్రైడ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మాత్రమే వర్తిస్తుంది.
  2. ఇండస్ట్రియల్ పార్క్ లోని ప్లాట్లను జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 15.3%, ఎస్టీలకు 9.3% కేటాయించనున్నారు.
  3. 2014 నుండి 2022 వరకు ఎస్సీ, ఎస్టీ లకు పరిశ్రమల స్థాపన కోసం 46,697 యూనిట్లను 2084 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. 
  4. అన్నీ సరైనవే

Q8. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరితనిధి ని ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించి సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల కొత్త మొత్తాన్ని ఈ ఫండ్ కి జమ చేయాలి.
  2. నియోజక వర్గ అభివృద్ది నిధి నుంచి 5% హరితనిదికి జమ చేయాలి.
  3. వ్యాపార సంస్థలు లైసెన్స్ రిన్యువల్ సందర్భంగా రూ. 500 జమచేయాలి.
  4. విద్యార్థులు అడ్మిషన్ల సందర్భంగా పాఠశాల విద్యార్థులు రూ.10, ఇంటర్ విద్యార్థులు రూ.15, డిగ్రీ విద్యార్థులు రూ.25 జమ చేయాలి.
  1. 1,2 మాత్రమే సరైనవి
  2. 1,3 మాత్రమే సరైనవి
  3. 1,4 మాత్రమే సరైనవి
  4. అన్నీ సరైనవి

Q9. ‘అటవీ సర్వే ద్వై వార్షిక నివేదిక -2021’ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో అటవీ విస్తీర్ణం ఎంత మేర పెరిగింది?

  1. 899 చ.కి.మీ
  2. 632 చ.కి.మీ
  3. 647 చ.కి.మీ
  4. 537 చ.కి.మీ

Q10. నేతన్నకి చేయూత పథకము ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకి ఎంత సబ్సిడిపై నూలు, రంగులు అందజేస్తుంది?

  1. 20%
  2. 30%
  3. 40%
  4. 50%

Solutions:

S1. Ans(a)

Sol: 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా  తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతివెయ్యి శిశు మరణాల్లో 35మంది శిశువులు చనిపోయేవారని ఈ నివేదిక వెల్లడించింది.

S2. Ans(c)

Sol: రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మరియు స్వయం సహాయక బృందాలు (SHGలు) మార్కెట్ ఆక్సెస్ ని ప్రారంభించడానికి ఫ్లిప్ కార్ట్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(SERP), తెలంగాణతో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.

S3. Ans (d)

Sol. రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా- నిజామాబాద్, అత్యల్ప పంటల సాంద్రత గల జిల్లా -కొమురం భీం అసిఫాబాద్. రాష్ట్ర సగటు పంటల సాంద్రత – 1.27

S4. Ans(c)

Sol. ఆరోగ్య తెలంగాణా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను మార్చి5 న రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించారు. తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. ఈ వివరాలను ‘ఈ-హెల్త్’ మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు.

S5. Ans(a)

Sol. తెలంగాణాలో పత్తి ఉత్పత్తి చేసే జిల్లాల్లో ఆదిలాబాద్,రాజన్న సిరిసిల్ల,ఖమ్మం మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర కలవు.

S6. Ans (d)

Sol. తెలంగాణ వార్షిక బడ్జెట్ – రూ. 2.56 లక్షల కోట్లు

  • విద్యారంగానికి అధిక ప్రాధాన్యం 
  • మహిళా విశ్వ విద్యాలయానికి 100 కోట్లు
  • అటవీ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు 
  • కొత్త వైద్య కళాశాలల కోసం 1000 కోట్లు
  • హరితహారం పథకానికి 932 కోట్లు
  • వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు
  • పామాయిల్ సాగుకు 1000 కోట్లు

S7. ans(a)

Sol: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు ప్రకటిస్తూ టిఎస్- ప్రైడ్ ను 2014, నవంబర్ 29న ప్రకటించింది.

ఇండస్ట్రియల్ పార్క్ లోని ప్లాట్లను జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 15.3%, ఎస్టీలకు 9.3% కేటాయించనున్నారు.

2014 నుండి 2022 వరకు ఎస్సీ, ఎస్టీ లకు పరిశ్రమల స్థాపన కోసం 46,697 యూనిట్లను 2084 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది.  

T-PRIDE: తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబెషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రైనుర్స్

S8. Ans(c)

Sol: తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరితనిధి ని ఏర్పాటు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. 2021, అక్టోబర్ 1 న హరితనిధికి సంబంధించి  ఈ క్రింది విషయాలు వెల్లడించారు.

  1. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల కొత్త మొత్తాన్ని ఈ ఫండ్ కి జమ చేయాలి.(MLA, MP, MLC లు నెలకు రూ. 500/-, IAS, IPS, IFS, మేయర్ , జిల్లా పరిషత్ చైర్మన్ మొదలగు అధికారులనుండి నెలకు రూ. 100/-, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుండి నెలకు రూ. 25/- హరితనిధికి జమ చేస్తారు.)
  2. నియోజక వర్గ అభివృద్ది నిధి నుంచి 10% హరితనిదికి జమ చేయాలి.
  3. వ్యాపార సంస్థలు లైసెన్స్ రిన్యువల్ సందర్భంగా రూ. 1000 జమచేయాలి.
  4. విద్యార్థులు అడ్మిషన్ల సందర్భంగా పాఠశాల విద్యార్థులు రూ.10, ఇంటర్ విద్యార్థులు రూ.15, డిగ్రీ విద్యార్థులు రూ.25 జమ చేయాలి.
  5. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవికి రూ.50 చొప్పున హరితనిదికి జమచేయాలి.

S9. Ans(b)

Sol:  ‘అటవీ సర్వే ద్వై వార్షిక నివేదిక – 2021’ ను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ జనవరి13, 2022న విడుదల చేసారు. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొత్తగా పచ్చదనాన్ని సనతరించుకుంది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ( 647 చ.కి.మీ. పెరుగుదల),

తెలంగాణ (632 చ,కి.మీ. పెరుగుదల), ఒడిశా (537 చ.కి.మీ. పెరుగుదల) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

  • తెలంగాణలో నమోదైన మొత్తం అటవీ ప్రాంతం 27,688 చ.కి.మీ. కాగా, రాష్ట్ర భూభాగంలో ఇది 24.70%. అత్యధికంగా కరీంనగర్ పూర్వ జిల్లాలో 217.81 చ.కి.మీ. అందుబాటులోకి వచ్చింది. 
  • తెలంగాణలో దట్టమైన అడవులు 1,624 చ.కి.మీ. , మధ్యస్థాయి దట్టమైన ప్రాంతం 9,119 చ.కి.మీ., ఓపెన్ ఫారెస్ట్ ప్రాంతం 10, 471 చ.కి.మీ. మేర ఉంది.

తెలంగాణలో చెట్ల విస్తీర్ణం 2,848 చ.కి.మీ.కాగా, రాష్ట్ర భూభాగంలో ఇది 2.54%.

S10. ans(d)

Sol: నేతన్నకి చేయూత పథకం 2017, జూన్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లిలో కేటీఆర్ ప్రారంభించారు. 

ఈ పథకం వల్ల రాష్ట్రంలో 30 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. 

50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందజేస్తారు. 

18 ఏళ్ళు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు.

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu 1 November 2022 |_80.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!