Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 3 December 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. తెలంగాణ రాష్ట్రం కింది ఏ రాష్ట్రాలతో సరిహద్దులుగా కలిగి ఉంది?

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. ఆంధ్రప్రదేశ్
  4. ఛత్తీస్‌గఢ్

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి

(a) 1& 2

(b) 1, 2 & 3

(c)1, 3 & 4

(d) 1, 2, 3 & 4

Q2. హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు లో భాగంగా తరుణి స్టేషన్ గా  పిలవబడే మెట్రో స్టేషన్ ఏది?

  1. మధురానగర్ మెట్రో స్టేషన్
  2. అమీర్ పేట్ మెట్రో స్టేషన్
  3. జె.బి.ఎస్ మెట్రో స్టేషన్
  4. యం.జి.బి.ఎస్ మెట్రో స్టేషన్

Q3. ఆసియా లోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ఏ జిల్లాలో ఉంది?

  1. వరంగల్
  2. ఖమ్మం
  3. ఆదిలాబాద్
  4. నిజామాబాద్

Q4. రత్నగర్భగా పిలువబడే రాష్ట్రం?

  1. ఒడిషా
  2. తెలంగాణ
  3. ఆంధ్రప్రదేశ్
  4. మహారాష్ట్ర

Q5. . కింది వాటిని జతపరుచుము

  వన్యమృగ సంరక్షణ కేంద్రం                ప్రాంతం
A. శివ్వారం                        1.  నాగర్‌కర్నూల్, నల్లగొండ
B. పోచారం                        2. కొత్తగూడెం
C. రాజీవ్ గాంధీ              3. మంచిర్యాల, పెద్దపల్లి
D. కిన్నెరసాని                       4. మెదక్, కామారెడ్డి   

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q6. తెలంగాణ జనాభా లింగ నిష్పత్తి కు సంబంధించి కింది ప్రకటనలో సరైంది ఏది?

  1. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యగా నిర్వచించబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ నిష్పత్తి
  2. లింగ నిష్పత్తి రాష్ట్రంలో 1991లో 967 నుండి 2001లో 971కి మరియు 2011లో 988కి మెరుగుపడింది.
  3. 2011లో ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి 1,008గా ఉంది. 977 వద్ద ఉన్న ST జనాభా లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 988 కంటే స్వల్పంగా తక్కువగా ఉంది

(a) 1, 2 మాత్రమే

(b) 2, 3 మాత్రమే

(c) 1, 3 మాత్రమే

(d) 1, 2 & 3

Q7. తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా సగటు వర్షపాతం సంవత్సరానికి 906.6 మిల్లీ మీటర్లుగా వుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది?

  1. నైరుతి ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 715 మిల్లీ మీటర్లు
  2. ఈశాన్య ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 129 మిల్లీ మీటర్లు.
  3. ఇతర వర్షాలు వలన లభించు సగటు వర్షపాతం 92 మిల్లీ మీటర్లు
  4. పైనపెర్కొన్నవని సరైనవే

Q8. జలవిద్యుత్ శక్తి యొక్క అదనపు ప్రయోజనాలు?

  1. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల జీవిత కాలం ఎక్కువ.
  2. విద్యుత్ ఉత్పత్తికి మూలమైన నీటికి ఉండే సహజ పునరుత్పాదక సామర్థ్యం
  3. పని, నిర్వహణ ఖర్చులు తక్కువ
  4. నదిలో నీరు ఉన్నంత వరకు శక్తి ఉత్పత్తికి అంతరాయం ఉండక పోవడం

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి

(a) 1 & 2

(b) 1, 2 & 3

(c) 1, 3 & 4

(d) 1, 2, 3 & 4

Q9. రాష్ట్రంలో ప్రధాన నీటిపారుదల మూల వసతులుగా కాలువలు, చెరువులు, గొట్టపు బావులు, బావులు వంటివి ఉన్నాయి. ఈ వసతుల ద్వారా లభించే జలాలను ఏ విధానాలలో తెలంగాణలో వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచడంలో వినియోగించుకోవడం జరుగుతుంది?

  1. నీటి పంపిణి గొట్టాలద్వారా
  2. బిందు సేద్యం వద్ధతి (Drip)
  3. నీటిని చిమ్ము పద్దతి (Sprinkler)
  4. పైనపెర్కొన్నవని

Q10. SCCL ముఖ్యంగా ఈ కింది ఏ ప్రధాన కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తుంది.

  1. రామగుండం (NTPC) జాతీయ థర్మల్ పవర్ కార్పోరేషన్
  2. తెలంగాణా రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (TSGENCO)
  3. కర్ణాటక శక్తి కార్పొరేషన్
  4. పార్లిశక్తి (MAHAGENCO)

(a) 1 & 2

(b) 1, 2 & 3

(c) 1, 3 & 4

(d) 1, 2, 3 & 4

Solutions:

S1. Ans (d)

Sol: 1956లో రాష్ట్రాలను భాషాపరమైన పునర్వ్యవస్థీకరణ చేయగా, హైదరాబాదులోని తెలుగు మాట్లాడే ప్రజలను తెలంగాణ అని అనేవారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడమైంది. జూన్ 2, 2014న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పరివేష్టిత రాష్ట్రంగా ఉండి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దుగా, కర్ణాటక రాష్ట్రం, పడమరన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాన, తూర్పున సరిహద్దులుగా కలిగి ఉంది.

S2. Ans (a)

Sol:

  • హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్ మియాపూర్ స్టేషన్ వద్ద కలదు. దీనిని రూపొందించింది – శంకర్ నారాయణ
  • మధురానగర్ మెట్రో స్టేషను పూర్తిగా మహిళల కోసం కేటాయించడం జరిగింది. దీనికి తరుణి స్టేషన్ గా నామకరణం చేశారు.
  • జె.బి.ఎస్ నుండి యం.జి.బి.ఎస్ వరకు గల మెట్రోరైలు మార్గాన్ని ఫిబ్రవరి 7, 2020 న సి.యం.కె.సి.ఆర్. ప్రారంభించారు.
  • హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ: మెటాస్
  • హైదరాబాద్ మెట్రో రైలు చిహ్నం: నిజ్

S3. Ans (a)

Sol: కాకతీయుల కాలంలో రాజులకు వ్యతిరేకంగా గిరిజన తెగకు చెందిన మేడరాజు వంశీ యులైన సమ్మక్క, సారలమ్మలు చేసిన వీరోచిత పోరాటం నేటికి చిరస్మరణీయంగా మిగిలింది. అందుకే నేటికి వారి వీరోచిత పోరును స్ఫూర్తిగా తీసుకొని ‘మేడారం జాతర’ను నిర్వహిస్తున్నారు. ఆసియా లోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ప్రసిద్ధికెక్కింది.

S4. Ans (b)

Sol: తెలంగాణ రాష్ట్రం భిన్న భౌగోళిక లక్షణాలతో కూడిన అనేక రకాల ఖనిజ వనరులు సమృద్ధిగా కలిగి ఉన్నందున నిర్దిష్ట పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రం వివిధ రకాల ఖనిజాలకు నిలయం. భిన్నమైన శిలలు మరియు ఖనిజాలకు ప్రసిద్ది చెందిన తెలంగాణ ‘రత్నగర్భ’గా పేరు పొందింది. భిన్నమైన శిలలతో కూడిన ఈ శిలలు అనేక రకాల పారిశ్రామిక, పారిశ్రామికేతర లోహాలను నిక్షిప్తం చేసుకొని మైనింగ్ మరియు అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.

S5. Ans(c)

Sol:   వన్యమృగ సంరక్షణ కేంద్రం                  ప్రాంతం

  • శివ్వారం–        మంచిర్యాల, పెద్దపల్లి               
  • పోచారం–        మెదక్, కామారెడ్డి     
  • రాజీవ్ గాంధీనాగర్‌కర్నూల్, నల్లగొండ 
  • కిన్నెరసాని–         కొత్తగూడెం         

S6. Ans (d)

Sol: తెలంగాణ జనాభా లింగ నిష్పత్తి:

  • లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యగా నిర్వచించబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ నిష్పత్తి
  • ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు ఖమ్మం జిల్లాల్లో లింగ నిష్పత్తి 1,000 పైగా ఉంది.
  • లింగ నిష్పత్తి రాష్ట్రంలో 1991లో 967 నుండి 2001లో 971కి మరియు 2011లో 988కి మెరుగుపడింది.
  • మొత్తం జనాభాలో అనుకూలమైన లింగ నిష్పత్తి ఉన్నప్పటికీ, 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల లింగ నిష్పత్తి 2001లో 957 నుండి 2011లో 932కి తగ్గింది.
  • 2011లో ఎస్సీ జనాభా లింగ నిష్పత్తి 1,008గా ఉంది, ఇది రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మహబూబ్‌నగర్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో రాష్ట్ర సగటు 988 కంటే చాలా ఎక్కువ.
  • 977 వద్ద ఉన్న ST జనాభా లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 988 కంటే స్వల్పంగా తక్కువగా ఉంది, అయితే ఇది ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంది.

S7. Ans (d)

Sol: తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా సగటు వర్షపాతం సంవత్సరానికి 906.6 మిల్లీ మీటర్లుగా వుంటుంది.

  • నైరుతి ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 715 మిల్లీ మీటర్లు
  • ఈశాన్య ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 129 మిల్లీ మీటర్లు.
  • ఇతర వర్షాలు వలన లభించు సగటు వర్షపాతం 92 మిల్లీ మీటర్లు

S8. Ans (d)

Sol: జలవిద్యుత్ శక్తి యొక్క అదనపు ప్రయోజనాలు

  • జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల జీవిత కాలం ఎక్కువ.
  • విద్యుత్ ఉత్పత్తికి మూలమైన నీటికి ఉండే సహజ పునరుత్పాదక సామర్థ్యం
  • పని, నిర్వహణ ఖర్చులు తక్కువ
  • నదిలో నీరు ఉన్నంత వరకు శక్తి ఉత్పత్తికి అంతరాయం ఉండక పోవడం

S9. Ans (d)

Sol: రాష్ట్రంలో ప్రధాన నీటిపారుదల మూల వసతులుగా కాలువలు, చెరువులు, గొట్టపు బావులు, బావులు వంటివి ఉన్నాయి. ఈ వసతుల ద్వారా లభించే జలాలను ఉపరితల నీటి పంపిణి గొట్టాలద్వారా, బిందు సేద్యం వద్ధతి (Drip), నీటిని చిమ్ము పద్దతి (Sprinkler) వంటి విధానాల్లో నీటి లభ్యత, వినియోగించడంలో సాధ్యాసాధ్యాలు, ఇతరత్రాల ప్రాతిపదికన తెలంగాణలో వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచడంలో వినియోగించుకోవడం జరుగుతుంది. నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాన్ని మరియు దాని పరిధిని పెంచడం వంటి బాధ్యతలను ప్రభుత్వం నిరంతరం వివిధ ప్రణాళికా బద్ధమైన కార్యక్రమాల ద్వారా చేపడుతుంది.

S10. Ans(d)

Sol: SCCL సరఫరా చేసే బొగ్గులో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 66% సిమెంట్ పరిశ్రమలకు 13.5% స్పాంజ్ ఐరన్ పరిశ్రమకు 3.1%, పరిశ్రమలకు ఇతర అవసరాలకు 10.8% గా ఉంది. SCCL ముఖ్యంగా ఈ కింది ప్రధాన కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తుంది.

  • రామగుండం (NTPC) జాతీయ థర్మల్ పవర్ కార్పోరేషన్
  • తెలంగాణా రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (TSGENCO)
  • కర్ణాటక శక్తి కార్పొరేషన్
  • పార్లిశక్తి (MAHAGENCO)

ఇవేగాక (SCCL) బొగ్గును ప్రధానంగా 52% సిమెంట్ కార్ఖానాలకు 32 శక్తిప్లాంట్లకు 53 స్పాంజ్ లోహయూనిట్స్ సరఫరా చేస్తుంది.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!