Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. సేద్యంచేయడానికి భూమి అందుబాటులో ఉన్నప్పటికి సేద్యం చేయని భూములు రకాలు కింది వాటిలో ఏవి?
- శాశ్వత పచ్చిక భూములు
- పంట భూమిలో చేరని పలురకాల చెట్లు, తోటల కింద ఉన్న భూములు.
- సాగుకు పనికి వచ్చే బంజరు భూమి (culturable waste)
(a) 3 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 3
(d) 1 మరియు 3
Q2. రైతువేదిక సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి?
- తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికను నిర్మించడం ద్వారా రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరియు అధిక రాబడిని పొందడంలో సహాయపడటానికి చొరవ తీసుకుంది.
- వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, MGNREGA నిధుల నుంచి రూ.10 లక్షల వాటాతో రూ.22 లక్షల వ్యయంతో ఒక్కో రైతువేదికను నిర్మించారు.
- తెలంగాణ రైతు బంధు సమితి (టీఆర్బీఎస్) సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం రైతులు మరియు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మధ్య వారధిగా వ్యవహరించే 1,60,990 మంది సభ్యులతో గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది.
- రైతులు తమ వ్యవసాయాన్ని ఉత్పత్తి, ముఖ్యంగా ధాన్యాలు ఆరబెట్టడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రయోజన సిమెంట్ ‘కల్లం’ (ఎండబెట్టే వేదికలు) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
(a) 3 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 3, 4
(d) 1, 3 మరియు 4
Q3. ప్రతిపాదన (A): గాంధీజీ, అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం 1932లో జరిగింది. పూనా ఒప్పందం ప్రకారం హరిజన ప్రజాప్రతినిధులను భారతదేశంలోని సబ్బండ వర్ణాల వారు ఎన్నుకోవాలని నిర్ణయించబడింది.
కారణము (R) : గాంధీజీని ఉప్పు సత్యాగ్రహ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి 1932లో ఎర్రవాడ జైలులో ఉంచింది. ఆ సమయంలో కమ్యునల్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకారం దళితుల చేత ఎన్నుకోబడ్డ వారు దళిత ప్రతినిధులుగా ఉంటారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యునల్ అవార్డును వ్యతిరేకిస్తు గాంధీజీ ఎర్రవాడ జైలులోనే ఉపవాస దీక్ష చేశారు.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Q4. రాంజీ గోండు తిరుగుబాటు కు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
- చత్తీస్గర్లోని చాందమానిక్ఢ్ లతో పాటు. తెలంగాణలోని ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ గోండు రాజుల పాలనలో ఉండేవి. నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలతో సిఫాబాద్ ప్రాంతాన్ని రాంజీగోండ్లు పాలించేవారు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ అనేవారు.
- బ్రిటీష్, నిజాం సైన్యం దాడులకు రాంజీగోండ్ నాయకత్వంలో గోండులు ఎదురుతిరిగారు.
- కల్నల్ రాబర్ట్ 1857, ఏప్రిల్ 9న నిర్మల్ దగ్గరలో రాంజీగోండ్ పై దాడి చేసి రాంజీగోండ్, అతని వెయ్యి మంది అనుచరులను నిర్మల్ ఖజనా చెరువు దగ్గరి మట్టి చెట్టుకు ఉరి తీసారు.
(a) 1, 2, 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1 మరియు 3
Q5. ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్ యూనియన్) యొక్క రాష్ట్ర మహాసభలుకు సంబందించి కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- మొదటి రాష్ట్ర మహాసభ 1. వరంగల్
- రెండవ రాష్ట్ర మహాసభ 2. హైదరాబాద్
- మూడవ రాష్ట్ర మహాసభ 3. గుంటూరు
- నాల్గవ రాష్ట్ర మహాసభ 4. అనంతపూర్
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 1, C – 2, D – 4
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q6. యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకరు. తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేశారు. అయినప్పటికి ఎప్పుడూ తెలంగాణ యాసతోనే అందున గ్రామీణ ప్రాంతపు వారు మాట్లాడినట్లుగానే మాట్లాడేవారు. అందుకే తెలంగాణ గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షరబద్ధం చేసింది. ఈమె అక్షరబద్ధం చేసినవి కింది వాటిలో ఏవి?
- మా వూరి ముచ్చట్లు – 1973 (1950 నాటి తెలంగాణ గ్రామీణ సంస్కృతి)
- ధర్మశాల – 1999
- ఎచ్చమ్మ కథలు – 2000 (1960-70 నాటి భాషను సాంస్కృతిక గ్రామీణ జీవనాన్ని గూర్చి)
- “ఎదుర్కోలు” (పెళ్లిలోని ఎదుర్కోలు సంప్రదాయం గూర్చి)
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) పైనపెర్కొన్నవని
Q7. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి కింది వాటిలో సరైంది ఏది?
- తెలంగాణ ఉద్యమంలో 2010 మార్చి 9న వరంగల్ జిల్లాలో అమరుడైన తొలి జర్నలిస్టు సునీల్ కుమార్.
- 2001 మే 30న తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ (టిజెఎఫ్) ఆవిర్భవించింది.
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 1 మరియు 2 రెండూ
- 1, 2 కాదు
Q8. కింది ప్రకటనలలో సరికానిది ఏది?
- తెలంగాణలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు వరుసగా. నల్లగొండ, 2. ఖమ్మం
- రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి 2. నల్లగొండ.
- రాష్ర్టంలో జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఖమ్మం, 2. ఆదిలాబాద్
- జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు నల్లగొండ 2. మెదక్
Q9. ప్రధాన అటవీ ఉత్పత్తులు అవి లభించే జిల్లాలను జతపరుచుము
ప్రధాన అటవీ ఉత్పత్తులు జిల్లా
- పుణికి చెట్టు 1. ఖమ్మం
- రూసా గడ్డి 2. మహబూబ్‌నగర్
- తుంగ గడ్డి 3. నిజామాబాద్
- బీడి ఆకులు 4. ఆదిలాబాద్
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q10. నల్లరేగడి నేలలకు సంబందించి కింది వాటిలో సరి కానిది ఏది?
- దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి.
- ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి.
- నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉంటాయి.
- 1 మాత్రమే
- 1 మరియు 2
- 2 మాత్రమే
- 3 మాత్రమే
Solutions:
S1. Ans (c)
Sol: సేద్యంచేయడానికి భూమి అందుబాటులో ఉన్నప్పటికి సేద్యం చేయని భూములు
దీనిని మూడు రకాల భూములు కలవు.
- శాశ్వత పచ్చిక భూములు
- పంట భూమిలో చేరని పలురకాల చెట్లు, తోటల కింద ఉన్న భూములు.
- సాగుకు పనికి వచ్చే బంజరు మి (culturable waste)
S2. Ans (c)
Sol: రైతువేదిక :
- తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికను నిర్మించడం ద్వారా రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మరియు అధిక రాబడిని పొందడంలో సహాయపడటానికి చొరవ తీసుకుంది.
- వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, MGNREGA నిధుల నుంచి రూ.10 లక్షల వాటాతో రూ.22 లక్షల వ్యయంతో ఒక్కో రైతువేదికను నిర్మించారు.
- తెలంగాణ రైతు బంధు సమితి (TRBS) సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం రైతులు మరియు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మధ్య వారధిగా వ్యవహరించే 1,60,990 మంది సభ్యులతో గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది.
- రైతులు తమ వ్యవసాయాన్ని ఉత్పత్తి, ముఖ్యంగా ధాన్యాలు ఆరబెట్టడం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రయోజన సిమెంట్ ‘కల్లం’ (ఎండబెట్టే వేదికలు) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
S3. Ans (a)
Sol: గాంధీజీని ఉప్పు సత్యాగ్రహ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి 1932లో ఎర్రవాడ జైలులో ఉంచింది. ఆ సమయంలో కమ్యునల్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకారం దళితుల చేత ఎన్నుకోబడ్డ వారు దళిత ప్రతినిధులుగా ఉంటారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యునల్ అవార్డును వ్యతిరేకిస్తు గాంధీజీ ఎర్రవాడ జైలులోనే ఉపవాస దీక్ష చేశారు. చివరికి గాంధీజీ, అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం 1932లో జరిగింది. పూనా ఒప్పందం ప్రకారం హరిజన ప్రజాప్రతినిధులను భారతదేశంలోని సబ్బండ వర్ణాల వారు ఎన్నుకోవాలని నిర్ణయించబడింది.
S4. Ans (a)
Sol: రాంజీ గోండు తిరుగుబాటు :
- చత్తీస్గర్లోని చాందమానిక్ఢ్ లతో పాటు. తెలంగాణలోని ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ గోండు రాజుల పాలనలో ఉండేవి. నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలతో సిఫాబాద్ ప్రాంతాన్ని రాంజీగోండ్లు పాలించేవారు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ అనేవారు.
- బ్రిటీష్, నిజాం సైన్యం దాడులకు రాంజీగోండ్ నాయకత్వంలో గోండులు ఎదురుతిరిగారు.
- కల్నల్ రాబర్ట్ 1857, ఏప్రిల్ 9న నిర్మల్ దగ్గరలో రాంజీగోండ్ పై దాడి చేసి రాంజీగోండ్, అతని వెయ్యి మంది అనుచరులను నిర్మల్ ఖజనా చెరువు దగ్గరి మట్టి చెట్టుకు ఉరి తీసారు.
S5. Ans(a)
Sol: కొండపల్లి సీతారామయ్య వర్గం విద్యార్థులు పి.డి.ఎస్.యు నుండి బయటికి వచ్చి 1974 అక్టోబర్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు.
- మొదటి రాష్ట్ర మహాసభలు: ఆర్.ఎస్.యు 1975 లో రాష్ట్రస్థాయి మహాసభలను హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ సభలలోనే తొలి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.
- రెండవ రాష్ట్ర మహాసభలు (1978): రెండవ రాష్ట్ర మహాసభలు వరంగల్లో జరిగాయి.
- మూడవ రాష్ట్ర మహాసభలు : ఆర్.ఎస్.యు యొక్క మూడవ రాష్ట్ర మహాసభలు అనంతపూర్లో జరిగాయి.
- నాల్గవ రాష్ట్ర మహాసభలు : 1981లో గుంటూరులో నాల్గవ రాష్ట్ర మహాసభలు జరిగాయి.
S6. Ans(d)
Sol: గ్రామీణ జీవిత కథకురాలు యశోదా రెడ్డి:
- యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకరు.
- ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠం అధిష్టించారు.
- తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేశారు.
- అయినప్పటికి ఎప్పుడూ తెలంగాణ యాసతోనే అందున గ్రామీణ ప్రాంతపు వారు మాట్లాడినట్లుగానే మాట్లాడేవారు.
- అందుకే తెలంగాణ గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షరబద్ధం చేసింది. ఈమె అక్షరబద్ధం చేసినవి:
- మా వూరి ముచ్చట్లు – 1973 (1950 నాటి తెలంగాణ గ్రామీణ సంస్కృతి)
- ధర్మశాల – 1999
- ఎచ్చమ్మ కథలు – 2000 (1960-70 నాటి భాషను సాంస్కృతిక గ్రామీణ జీవనాన్ని గూర్చి)
- “ఎదుర్కోలు” (పెళ్లిలోని ఎదుర్కోలు సంప్రదాయం గూర్చి)
- గ్రామీణ ఆడపడుచుల ముచ్చట్లు, బతుకమ్మ, పీర్లపండగను జరుపుకునే సంప్రదాయాలను చిత్రీకరించారు.
S7. Ans(a)
Sol: 2001 మే 31న తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ (టిజెఎఫ్) ఆవిర్భవించింది.
దీని వ్యవస్థాపకులు :
- అల్లం నారాయణ
- పల్లె రవికుమార్
- నెల్లుట్ల వేణుగోపాల్
- రమణ కుమార్
- శశికాంత్
- క్రాంతి
- 2010 మార్చి 9న వరంగల్ జిల్లాలో ఆత్మ బలిదానానికి పూనుకున్న సునీల్ కుమార్ అనే జర్నలిస్టు యొక్క త్యాగము తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరు.
- తెలంగాణ ఉద్యమంలో అమరుడైన తొలి జర్నలిస్టుగా సునీల్ కుమార్ చరిత్రలో మిగిలిపోతాడు. ఇటువంటి అనేక త్యాగాల ఫలమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.
- తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 2010 ఏప్రిల్ 28న జర్నలిస్టులు నిరాహారదీక్ష చేశారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు టిజెఎఫ్ ఆధ్వర్యంలో 2010 అక్టోబర్ హైదరాబాద్ మీడియా మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
S8. Ans(a)
Sol:
- తెలంగాణలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాలు వరుసగా.. ఆదిలాబాద్, 2. ఖమ్మం
- రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి 2. నల్లగొండ.
- రాష్ర్టంలో జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఖమ్మం, 2. ఆదిలాబాద్
- జిల్లా భౌగోళిక విస్తీర్ణం పరంగా అడవులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు నల్లగొండ 2. మెదక్
S9.Ans (d)
Sol:
- పుణికి చెట్టు:ఇది ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. దీన్ని ‘నిర్మల్ కొయ్యబొమ్మల’ తయారీకి ఉపయోగిస్తారు.
- రూసా గడ్డి:ఇది నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో పెరుగుతుంది. దీన్ని సెంట్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
- తుంగ గడ్డి:ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో లభిస్తుంది. దీన్ని ‘తుంగచాపల’ తయారీలో ఉపయోగిస్తారు.
- బీడి ఆకులు:వీటిని బీడిల తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఆకులను తునికాకు, తెండు ఆకులు అని పిలుస్తారు. ఇవి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో లభిస్తాయి.
- విప్ప పువ్వు:దీన్ని సారా తయారీకి ఉపయోగిస్తారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని అడవుల్లో లభిస్తాయి.
S10. Ans (d)
Sol: నల్లరేగడి నేలలు
వింధ్యా–సాత్పురా పర్వత శ్రేణుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు నల్లరేగడి మండలం విస్తరించి ఉంది. ఈ నేలలు ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని మాళ్వా పీఠభూమి, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి. నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉండవు. అందువల్ల నల్లరేగడి నేలల్లో సాగునీటి వ్యవసాయం సాధ్యం కాదు. ఇవి పత్తిసాగుకు చాలా అనువైనవి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |