Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. దిగువ పేర్కొన్నవి పరిగణనలోకి తీసుకోండి.
- కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార’ అనే రచన చేశారు.
- అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
రుద్రదేవుడు గురించి దిగువ పేర్కొన్న ప్రకటన (లు) ఏది సరైనది/సరైనది?
(a) I మాత్రమే
(b) II మాత్రమే
(c) I మరియు II రెండూ
(d) I, II కాదు
Q2. దిగువ వాటిని జతచేయండి
జాబితా I (రచయితలు ) జాబితా II (రచనలు)
- నేబతి కృష్ణమంత్రి 1. కుముదవల్లీ విలాసం
- ఎలకూచి బాలసరస్వతి 2. తోతినామా (అనువాద కథలు)
- గవాసి 3. యాదవ రాఘవ పాండవీయం
- పొనుగోటి జగన్నాథరాయలు 4. రాజనీతి రత్నాకరం
Code:
a b c d
(a) 4 3 2 1
(b) 1 2 3 4
(c) 3 2 4 1
(d) 1 4 2 3
Q3. 1957-66 మధ్య ఫ్యాక్టరీల చట్టం కింద నమోదయిన ఫ్యాక్టరీల సంఖ్య ఆంధ్ర మరియు తెలంగాణలో వరుసగా ఎంత శాతం?
(a) 2.2% & 12.7%
(b) 15% & 10%
(c) 12.7% & 15%
(d) 12.7% & 2.2
Q4. వ్యవసాయ పరపతి 2019-20 జులై బడ్జెట్లో 12 లక్షల కోట్లు ఉండగా , 2020-21 బడ్జెట్లో ఎన్ని కోట్లు లక్ష్యంగా నిర్ధేశించెను?
(a) 13 లక్షల కోట్లు
(b) 15 లక్షల కోట్లు
(c) 10 లక్షల కోట్లు
(d) 18 లక్షల కోట్లు
Q5. ప్రతిపాదన (A): వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
కారణము (R) : మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Q6. జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం:
- ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా ఏపీలో కలిపారు, పూర్తిగా కోల్పోయిన మండలాలు :
కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర రామచంద్రాపురం) 5. చింతూరు - ఖమ్మం జిల్లాలోని 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలిపారు. పాక్షికంగా కోల్పోయిన మండలాలు – భద్రాచలం 2. బూర్గంపహాడ్.
దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 1 మరియు 2 రెండూ
- 1, 2 కాదు
Q7. శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదిశ్వరుడు అని ఎందులో పేర్కొనబడింది?
- హర్ష చరిత్ర
- మను చరిత్ర
- కావ్య మీమాంస
- పైనవేవి కావు
Q8. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- రాష్ట్ర కళాకారుల, రచయితల, మేథావుల ఐక్యవేదిక 1. గూడ అంజయ్య (కన్వీనర్)
- తెలంగాణ పాటకవుల ఐక్యవేదిక 2. బి.యస్.రాములు (కన్వీనర్)
- తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన 3. సుజాత సూరేపల్లి (కన్వీనర్)
- దళిత మహిళా వేదిక 4. యస్.పృథ్వీరాజ్ (అధ్యక్షులు)
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q9. రెండవ ప్రణాళిక & మూడవ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో తెలంగాణ వాటా వరుసగా?
- 45% & 42.6%
- 37% & 45%
- 6% & 37%
- 5% & 45%
Q10. హిందుమతం నుంచి ఇస్లాంలోకి మార్చబడ్డ వారిని ఆర్య సమాజం వారు తిరిగి హిందూ మతంలోకి మార్చడానికి స్థాపించిన సంస్థ ఏది?
(a) హిందూ సమాజం
(b) శుద్ధి సభ
(c) ధర్మ మండలి
(d) సత్యార్థ ప్రకాశిక
Solutions:
S1. Ans (c)
Sol: కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు. కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార’ అనే రచన చేశారు. అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
S2. Ans: (b)
Sol: నేబతి కృష్ణమంత్రి – రాజనీతి రత్నాకరం
ఎలకూచి బాలసరస్వతి – యాదవ రాఘవ పాండవీయం
పొనుగోటి జగన్నాథరాయలు – కుముదవల్లీ విలాసం
గవాసి – తోతినామా (అనువాద కథలు)
S3. Ans(d)
Sol: ప్రాంతాలవారిగా పరిశ్రమల మీద కేంద్రం పెట్టిన పెట్టుబడులు తెలంగాణలో 84.86కోట్లు ఆంధ్రలో 41.71 కోట్లు అదేవిధంగా 1957-66 మధ్య ఫ్యాక్టరీల చట్టంకింద నమోదయిన ఫ్యాక్టరీల సంఖ్య ఆంధ్రలో 12.7% కాగా తెలంగాణలో 2.2% మాత్రమే.
S4. Ans (b)
Sol: వ్యవసాయ పరపతి 2019-20 జులై బడ్జెట్లో 12 లక్షల కోట్లు ఉండగా, 2020-21 బడ్జెట్లో 15 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ధేశించెను
S5. Ans( a)
Sol: ముఖ్యంగా మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది. వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. హద్దులేర్పర్చే సమయానికి డుగా పడిఉన్న భూములను, అంతకుముందు వాటిని ‘శివాయి జమాబంది’ (ఆక్రమణ) పద్ధతిలో గిరిజనులు సాగుచేస్తూ న్నప్పటికీ, రిజర్వ్ ఫారెస్ట్ కలిపేశారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
S6. Ans (c)
Sol: జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలిపారు.
- పూర్తిగా కోల్పోయిన మండలాలు – కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర రామచంద్రాపురం) 5. చింతూరు
- పాక్షికంగా కోల్పోయిన మండలాలు – భద్రాచలం 2. బూర్గంపహాడ్
- భద్రాచలం మండలం నుంచి భద్రాచలం పట్టణం మినహా 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలను, బూర్గంపహాడ్ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలను, 4 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిశాయి.
- మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ పంచాయతీలను కోల్పోయింది.
- 46 మండలాలకుగాను 5 మండలాలను పూర్తిగా కోల్పోవడంతో ఖమ్మం జిల్లాలో 41 మండలాలు మిగిలాయి.
S7. Ans(a)
Sol: బాణుడు రాసిన హర్శచారిత్రలో శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదిశ్వరుడు అని పేర్కొన్నాడు
S8. Ans(a)
Sol:
- రాష్ట్ర కళాకారుల, రచయితల, మేథావుల ఐక్యవేదిక : బి.యస్.రాములు (కన్వీనర్)
- బి.సి. సంఘర్షణ సమితి – వి.జి.ఆర్.నారగోని (అధ్యక్షులు)
- తెలంగాణ పాటకవుల ఐక్యవేదిక – గూడ అంజయ్య (కన్వీనర్)
- తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన – యస్.పృథ్వీరాజ్ (అధ్యక్షులు)
- దళిత మహిళా వేదిక: సుజాత సూరేపల్లి (కన్వీనర్), శ్రీమతి మేరికుమారి మాదిగ (కో-కన్వీనర్)
S9. Ans(a)
Sol: రెండవ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో తెలంగాణ వాటా 45% ఉన్నప్పటికి ఖర్చు పెట్టిన మొత్తం 34% మించలేదు. అదేవిధంగా మూడవ ప్రణాళిక కాలంలో 42.6% తెలంగాణ వాటా ఉన్నా 37% మించి ఖర్చు చేయలేదు, పర్యవసనంగా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి కావల్సిన ప్రోత్సాహకం లభించలేదు
S10. Ans ( b)
Sol: హిందుమతం నుంచి ఇస్లాంలోకి మార్చబడ్డ వారిని ఆర్య సమాజం వారు తిరిగి హిందూ మతంలోకి మార్చడానికి “శుద్ధి సభ” అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ సభ ద్వారా ఇస్లాంలోకి వెళ్ళిన వారిని తిరిగి హిందూమతంలోకి మార్చారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |