Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu,21 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu,19 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. భారత వ్యవసాయ మార్కెటింగ్ రకాలు కింది వాటిలో ఏవి?

  1. ప్రాథమిక మార్కెట్లు
  2. ద్వితీయ మార్కెట్లు
  3. అంతిమ మార్కెట్లు
  4. సహకార మార్కెటింగ్

(a) 3 మాత్రమే

(b) 1, 2, 3, 4

(c) 2 మరియు 3 మాత్రమే

(d) 1, 3 మరియు 4

 

Q2. ఇంధన వనరుల రకాలకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది?

  1. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, పునరుత్పాదన సాధ్యమయ్యే ఇంధన వనరులకు ముఖ్య ఉదాహరణలు. జలవిద్యుత్, సౌరశక్తి, పవనశక్తి, తరంగ శక్తి
  2. పునరుత్పాదన కాని ఇంధన వనరులు : శిలాజ ఇంధన రకాలయిన బొగ్గు, ‘చమురు, గ్యాస్ వంటివి ఈ రకమైన వాటికి ఉదాహరణలు.
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1, 2 కాదు

 

Q3. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II

  1. బిజెపి 1. “తెలంగాణ తెచ్చేది మేమే – ఇచ్చేది మేమే
  2. కాంగ్రెస్ పార్టీ 2. “ఒక ఓటు – రెండు రాష్ట్రాలు”
  3. రాజశేఖర్రెడ్డి 3. విజయమో విరస్వర్గామో
  4. O. U విద్యార్ధులు 4. “తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశియులమవుతాం అక్కడికి వెళ్ళాంటే మనకు పాస్పోర్ట్ కావాలి

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q4. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా శాతం ఎంత

  1. 4.5
  2. 3.6 
  3. 4. 45
  4. 5. 6

 

Q5. కింది ప్రకటనలను పరిగణించండి.

  1. 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
  2. హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. 
  3. 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు.

పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏవి సరైనవి?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) పైనపేర్కొన్నవన్ని సరైనవి

(d) పైన పేర్కొన్నవన్ని సరైనవి కావు

 

Q6. పార్లమెంటులో తెలంగాణ బిల్లు కు సంబంధించి కింది ప్రకటనలలో సరైంది ఏది?

  1. 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి “సుశీలక్కుమార్ షిండే”, “రాష్ట్ర పునర్విభజన బిల్లును” లోక్సభలో ప్రవేశపెట్టారు.
  2. 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్సభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ – “పొన్నం ప్రభాకర్”.
  3. లోక్సభ ముజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18 న ఆమోదించారు.
  4. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

 

Q7. క్రింది వాటిలో సరియైనది.

  1. కౌలుదార్ల సమస్యలు పరిష్కరించడానికి నిజాం ప్రభుత్వం మొట్టమొదటి సారి 1937లో భరూచా కమిటి నియమించారు.
  2. ఈ కమిటి ప్రకారం కౌలుదార్లు 2 రకాలు a. షక్మీదారు మరియు  b. అసామీ షక్మీదారు.
  3. 1944లో భరూచా సిఫారసులపై 1354 ఫసలీ అసామీ షక్మీ చట్టం చేయబడింది.
  4. 6 సం॥లు కౌలు భూమిని సేద్యం చేస్తే వారు అసామీ షక్మీ కౌలుదారులు అవుతారు.

(a) 1, 2, 3, 4

(b) 2 మరియు  3 మాత్రమే

(c) 2, 3 మరియు  4

(d) 1, 2 మరియు  3

 

Q8. ఏ సంస్థ  హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్‌ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

  1. కాల్‌అవే గోల్ఫ్‌
  2. క్వాల్కమ్
  3. ఫిస్కర్‌ 
  4. స్లేబ్యాక్‌ ఫార్మా 

 

Q9. కింది వాటిలో సరిగా జతకానిది ఏది?

  1. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ముఖ్యపాత్ర వహించింది – బి.ఎస్‌.రాములు, బి. వి.ఆర్‌.చారి, ప్రొ.గంగాధర్‌
  2. మొదటగా తెలంగాణ తల్లి రూపాన్ని కవర్‌ పేజిగా రూపొందించిన వార్తా పత్రిక –  నవ తెలంగాణా వార పత్రిక
  3. తెలంగాణ తల్లి విగ్రహం మొదట తయారు చేయబడినది – నల్గొండ జిల్లా బేగంపేట గ్రామంలో
  4. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బేగంపేట గ్రామంలో ఆవిష్కరించింది –  విజయశాంతి

 

Q10. ఆచార్య వినోభాభావే 1951లో భూదాన ఉద్యమాన్ని తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ భూదానోద్యమంలో మొదటి భూ దాత ఎవరు?

(a) కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి

(b) శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి

(c) జయప్రకాశ్ నారాయణ

(d) శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి

Solutions:

S1. Ans (b)

Sol: భారత వ్యవసాయ మార్కెటింగ్ రకాలు :

  • ప్రాథమిక మార్కెట్లు
  • ద్వితీయ మార్కెట్లు
  • అంతిమ మార్కెట్లు
  • సహకార మార్కెటింగ్
  • సంతలు
  • క్రమబద్ధమైన మార్కెట్లు

 

S2. Ans (c)

Sol: ఇంధన వనరులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. పునరుత్పాదక ఇంధన వనరులు 
  2. పునరుత్పాదన కాని ఇంధన వనరులు.

పునరుత్పాదన సాధ్యమయ్యే ఇందన వనరులుఈ రకమైన ఇంధన వనరుల ముఖ్య లక్షణం ఏమిటంటే వీటి లభ్యత నిరంతరాయంగా ఉంటుంది. అయినప్పటికీ జలవిద్యుత్, జీవ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి వంటివి నిరంతరాయంగా అందుబాటులో ఉండాలంటే కొంత నిర్వహణ పరమైన నియంత్రణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది. ఇతర పునరుత్పాదన సాధ్యమయ్యే శక్తి / ఇంధన వనరులయిన సౌరశక్తి, పవనశక్తి, తరంగ శక్తి వంటివి మానవుని ప్రమేయంతో సంబంధం లేకుండా భవిష్యత్ కాలంలో కూడా నిరంతరాయంగా లభించే ఆస్కారం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, పునరుత్పాదన సాధ్యమయ్యే ఇంధన వనరులకు ముఖ్య ఉదాహరణలు. జలవిద్యుత్, సౌరశక్తి, పవన, ఇతర రకాలయిన పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం అనేది రాష్ట్రంలో అనుకున్నమేర ఇంకా జరగలేదు.

పునరుత్పాదన కాని ఇంధన వనరులు : శిలాజ ఇంధన రకాలయిన బొగ్గు, ‘చమురు, గ్యాస్ వంటివి ఈ రకమైన వాటికి ఉదాహరణలు. ఈ పునరుత్పత్తి సాధ్యం కానీ ఇంధన వనరుల పంపిణీ పరిమితంగా ఉంటుంది. కారణం వాటి ఏర్పాటు ప్రక్రియకు అత్యధిక సమయం పట్టడమే.

 

S3. Ans (a)

Sol: 

  • కాంగ్రెస్ పార్టీ – “తెలంగాణ తెచ్చేది మేమే – ఇచ్చేది మేమేఅనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళింది.
  • బిజెపి – చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్థిస్తామని పేర్కొనడమేగాక ఒక ఓటు – రెండు రాష్ట్రాలు” నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళింది.
  • రాజశేఖర్రెడ్డి – “తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశియులమవుతాం అక్కడికి వెళ్ళాంటే మనకు పాస్పోర్ట్ కావాలి అని అన్నారు.
  • O. U విద్యార్ధులు – “విజయమో విరస్వర్గామో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమబాట పట్టారు.

 

S4. Ans (b)

Sol: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి.

 

S5. Ans (c)

Sol: 

  • 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
  • హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. 
  • 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు

 

S6. Ans(d)

Sol: పార్లమెంటులో తెలంగాణ బిల్లు:

  • 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి “సుశీలక్కుమార్ షిండే”, “రాష్ట్ర పునర్విభజన బిల్లును” లోక్సభలో ప్రవేశపెట్టారు.
  • బిల్లు ప్రవేశపెడుతున్నట్లు షిండే ప్రకటిస్తున్న సమయంలో ఆంధ్ర ఎంపీలు గొడవ చేశారు. ఈలోపు స్పీకర్ మీరాకుమార్ సభలో బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.
  • 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్సభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ – “పొన్నం ప్రభాకర్”.
  • 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు. 
  • లోక్సభ ముజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి18న ఆమోదించారు.
  • లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ పరిపూర్ణ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు సునాయాసంగా ఆమోదం పొందింది.
  • 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
  • “ది బిల్ ఈజ్ పాడ్” అని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో తెలంగాణవాదుల హర్షాతిరేకాలు చేశారు.

 

S7. Ans (d)

Sol: 

  • కౌలుదార్ల సమస్యలు పరిష్కరించడానికి నిజాం ప్రభుత్వం మొట్టమొదటి సారి 1937లో భరూచా కమిటి నియమించారు.
  • ఈ కమిటి ప్రకారం కౌలుదార్లు 2 రకాలు 
  • షక్మీదారు 
  • అసామీ షక్మీదారు.
  • 1944లో భరూచా సిఫారసులపై 1354 ఫసలీ అసామీ షక్మీ చట్టం చేయబడింది.
  • 6 సం॥లు కౌలు భూమిని సేద్యం చేస్తే వారు షక్మీ కౌలుదారులు అవుతారు

 

S8. Ans (a)

Sol: కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ  హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్‌ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్‌ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్‌ బ్రాండ్‌లలో కాల్‌అవే గోల్ఫ్‌తోపాటు ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోని ఫిస్కర్‌ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మార్చి 22న శాండియాగోలోని క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, లాస్‌ ఏంజెలిస్‌లోని ఫిస్కర్‌ ప్రధాన కార్యాలయాల్లో ఆ సంస్థల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు.

 

S9. Ans(b)

Sol:

  • తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ముఖ్యపాత్ర వహించింది – బి.ఎస్‌.రాములు, బి. వి.ఆర్‌.చారి, ప్రొ.గంగాధర్‌
  • మొదటగా తెలంగాణ తల్లి రూపాన్ని కవర్‌ పేజిగా రూపొందించిన వార్తా పత్రిక –  ప్రజాతంత్ర వార పత్రిక
  • తెలంగాణ తల్లి విగ్రహం మొదట తయారు చేయబడినది – నల్గొండ జిల్లా బేగంపేట గ్రామంలో
  •  తెలంగాణ తల్లి విగ్రహాన్ని బేగంపేట గ్రామంలో ఆవిష్కరించింది –  విజయశాంతి

 

S10. Ans (d)

Sol: వినోభా భావే 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో శాంతి ప్రసంగం తర్వాత అక్కడి హరిజనులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచు కోవడానికి భూమి కావాలని పేర్కొన్నారు. దీంతో శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి 100 ఎకరాలు దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది.

**************************************************************************

 

Reasoning MCQs Questions And Answers in Telugu 20 July 2022, For All IBPS Exams_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!