Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 21 January 2023, For TSPSC Groups and TS Police

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu_30.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. లోక్సభ ఎన్నికలలో సంపూర్ణమెజారిటీ సాధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించలేదు.  దీంతో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు అయిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ రక్షణ విషయ ఇందిరాగాంధితో 6 అంశాల ఒప్పందంను మౌఖికంగా కుదుర్చుకొని తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ లో కలిపివేశాడు. ఆ అంశాలు ఏవి?

  1. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చట్టబద్దమైన అధికారాలు
  2. తెలంగాణకు ప్రత్యేకబడ్జెట్, ప్రత్యేక అంచనాల తయారీ
  3. ప్రత్యేకంగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
  4. ముల్కి నిబంధనలను అమలు చేయడం.

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q2. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I                                        జాబితా – II

  1. రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి                1. NH 150
  2. రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి                    2. NH 44
  3. రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి                     3. SH9
  4. రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి                         4. SH 1

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q3. వాహనాల బాడీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని వాణిజ్య వాహన తయారీదారైన ____ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

  1. TATA
  2. HONDA
  3. ASHOK LAYLAND
  4. TVS

Q4. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఏది?

  1. విష్ణుకుండినులు
  2. ఇక్ష్వాకులు
  3. వాకాటకులు
  4. శాలంకాయనులు

Q5. రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?

  1. రేచర్ల బేతిరెడ్డి
  2. రేచర్ల బమ్మిరెడ్డి
  3. రేచర్ల నాగిరెడ్డి
  4. రెండో కాటచమూపతి

Q6. కాకతీయుల కాలంలో ధాన్యాన్ని కొలిచే సాధనాలను _____ అని పిలిచేవారు?

  1. కపిల
  2. ఖండుగ
  3. A మరియు B
  4. పైనవేవి కావు

Q7. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి దేశంలోనే జాతీయజెండా ఏర్పాటు చేసిన తొలి రైల్వే స్టేషన్ గా ఏ రైల్వే స్టేషన్ నిలించింది?

  1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
  2. కొలకత్తా స్టేషన్
  3. చెన్నై రైల్వే స్టేషన్
  4. ముంబై రైల్వే స్టేషన్

Q8. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల భూమి పరిరక్షణకు ఉద్దేశించిన ఏ చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 1988లో స్పష్టం చేసింది?

  1. 1 of 70 చట్టం
  2. తెలంగాణా ప్రాంత గిరిజన ప్రాంతాల నిబంధనలు 1949
  3. 1959 షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నిబంధన
  4. 1917 ఏజెన్సీ ప్రాంతాల ప్రయోజనాలు, భూ బదలాయిపు చట్టం

Q9. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I                జాబితా – II

A. సింహగర్జన                  1. వికారాబాద్

B. ప్రజాగర్జన                    2. హైదరాబాద్

C. శంఖారావ                   3. ఖమ్మం

D.తెలంగాణ గర్జన            4. కరీంనగర్

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q10. హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) కౌలు వ్యవసాయ భూముల చట్టం -1950 ఏ కమిటీ సూచనల ఆధారంగా తీసుకురావడం జరిగింది?

(a)  హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ

(b) హైదరాబాద్ కౌలుదారుల పరిరక్షణ కమిటీ

(c) హైదరాబాద్ భూ గరిష్ట పరిమితి కమిటీ

(d) పైవేవీ కావు

Solutions:

S1. Ans (d)

Sol: లోక్సభ ఎన్నికలలో సంపూర్ణమెజారిటీ సాధించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించలేదు.  దీంతో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు అయిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ రక్షణ విషయ ఇందిరాగాంధితో 6 అంశాల ఒప్పందంను మౌఖికంగా కుదుర్చుకొని తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ లో కలిపివేశాడు.

6 అంశాల కార్యక్రమం (మౌఖిక ఒప్పందం):

  • తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చట్టబద్దమైన అధికారాలు
  • తెలంగాణకు ప్రత్యేకబడ్జెట్, ప్రత్యేక అంచనాల తయారీ
  • ప్రత్యేకంగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
  • ప్రత్యేక రాష్ట్ర సమస్యను మరో సమయంలో తిరగదోడవచ్చు.
  • ముల్కి నిబంధనలను అమలు చేయడం.
  • రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మార్చడం.

S2. Ans (a)

Sol:

  • రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి – NH 44
  • రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి NH 150
  • రాష్ట్రంలో అతి పొడవైన రాష్ట్ర రహదారి – SH 1
  • రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి – ఇది NH 365బి గా మారింది.

S3. Ans(c)

Sol: 500 కోట్లు పెట్టుబడితో వాహనాల బాడీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని వాణిజ్య వాహన తయారీదారైన అశోక్ లీలాండ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఏర్పాటయ్యే ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా అనేకమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

S4. Ans (a)

Sol: విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. ‘కీసరగుట్ట’లోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు ‘నరబలి’ని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం ‘సింహం’. ‘ఘటికలు’ పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.

S5. Ans (b)

Sol: కాకతీయ మొదటి (గరుడ) భేతరాజు (922-1052) వద్ద సేనాధిపతిగా ఉండి కాంచీపుర చోళరాజులతో జరిగిన యుద్ధంలో వారిని జయించి ప్రఖ్యాతి గడించిన రేచర్ల బమ్మ (బ్రహ్మ) సేనాని అనే బమ్మిరెడ్డి (1035-1055) ఈ వంశ మూలపురుషుడు, పాలంపేట, పిల్లల మర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడ్ని పేర్కొన్నవి.

S6. Ans (c)

Sol: కాకతీయుల కాలంలో ధాన్యాన్ని కొలిచే సాధనాలను కపిల, ఖండుగ అని పిలిచేవారు. రాజ్య ఆదాయానికి భూమిశిస్తు ప్రధాన మార్గం. వృత్తి పన్నులుండేవి. భూమిని నాలుగు రకాలుగా విభజించారు. పనికిరాని భూములు, పంట భూములు, తోట భూములు, పచ్చికబయళ్లు. భూమిని గడ(కోల)తో కొలిచేవారు. పన్నులు ధాన్య, ధనరూపంలో చేలించేవారు.

S7. Ans(a)

Sol: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ సంవత్సరం: 1874.

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ” దేశంలోనే జాతీయజెండా ఏర్పాటు చేసిన తొలి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరుపొందింది.
  • కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా గ్రీన్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం అవార్డు సికింద్రాబాద్ స్టేషన్ కు లభించింది.

S8. Ans (a)

Sol: 1 ఆఫ్ 70 చట్టం రాజ్యాంగబద్ధం: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల భూమి పరిరక్షణకు ఉద్దేశించిన 1ఆఫ్ 70 చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 1988లో స్పష్టం చేసింది. గిరిజనుల ప్రయోజనాలకు ఉద్దేశించబడిన ఈ చట్టాన్ని బినామీ, ఇతర అక్రమ లావాదేవీల ద్వారా గిరిజనేతరులు వమ్ము చేసారని కోర్టు అభిప్రాయపడింది. 1 ఆఫ్ 70 చట్టం గతంలో గిరిజనులు పోగొట్టుకున్న భూమిని తిరిగి గిరిజనేతరుల నుంచి రాబట్టుకోవడానికి ఉద్దేశించబడిందని, అందువల్ల 1 ఆఫ్ 70 చట్టం రాజ్యాంగ విరుద్ధమని అనడానికి వీలులేదని గిరిజనేతరుల వాదనను తోసిపుచ్చింది.

S9. Ans (b)

Sol:

  • మే 17, 2001న “సింహగర్జన” పేరుతో కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు
  • నవంబరు 17, 2001న ఖమ్మంలో ‘ప్రజాగర్జన’ సభను నిర్వహించారు.
  • టీఆర్ఎస్ పార్టీ మార్చి 27, 2002న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్లో “శంఖారావ” సభను నిర్వహించారు.
  • హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్స్లో జనవరి 6, 2003 ” తెలంగాణ గర్జన పేరుతో” భారీ బహిరంగసభను నిర్వహించింది.

S10. Ans (a)

Sol: హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు జూన్, 1950లో కౌలు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి 1951 లో రెండు సవరణలు, ఆ తరువాత మరికొన్ని సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల (ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్) ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.

Telangana State GK MCQs Questions And Answers in Telugu_40.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

.

.