Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 19 January 2023, For TSPSC Groups and TS Police

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. ఈ క్రింది వానిని జతపరచండి.
జాబితా – I                 జాబితా – II
A. కరీంనగర్             1. నిర్మల్ గుట్టలు
B. వరంగల్               2. రాచకొండగుట్టలు
C. ఆదిలాబాద్          3. రాఖీ గుట్టలు
D. హైదరాబాద్        4. కంగాల్ గుట్టలు
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1

Q2. అదనంగా 600 m.w ల స్థాపిత సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను చెల్పూరు (KTPP) లో జనవరి 5, 2016న ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో TSGENCO యొక్క స్థాపిత థర్మల్ విద్యుత్ సామర్ధ్యం ఎన్ని MW లకు పెరిగింది?
(a) 2882.5 M W
(b) 2081. M W
(c) 1082 MW
(d) 4365.3 MW

Q3. “ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండటానికి గల కారణాలలో అతిముఖ్యమైనది, అతిసామాన్యమైనది వ్యవసాయ విధానంలో లోటే” అని అన్నది ఎవరు?
(a) మారిస్ డాబ్
(b) ఆర్థర్ లూయీస్
(c) గున్నార్ మిర్దాల్
(d) బ్లాంకెన్ బర్గ్

Q4. భూపంపిణీ లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధి కొరకు ప్రారంభించబడిన పథకం?
(a) ఇందిర ప్రభ
(b) గంగా కళ్యాణ్ యోజన
(c) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
(d) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన

Q5. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ (ఎంటిపి) ఎక్కడ ఉంది?
(a) వరంగల్
(b) ఖమ్మం
(c) హైదరాబాద్
(d) నల్గొండ

Q6. ప్రతిపాదన (A): వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా మృత్తికా క్రమక్షయంపై ఆధారపడుతుంది.
కారణం (R): మృత్తికా క్రమక్షయం అంటే మృత్తికల తయారీ కంటే మృతికలు సహజ కారకాలైన నీరు, గాలితో క్రమక్షయం చెందడం.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం

Q7. తెలంగాణ గోదావరి నది గల ప్రత్యేకతలు ఏమిటి?
1. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో గల చెగ్గాం వద్ద గోదావరి చంద్రవంక ఆకారంలో ప్రవహిస్తుంది. జగిత్యాల జిల్లా వేంపెల్లి వెంకట్రావ్ పేట్ దగ్గర గోదావరి ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది.
2. చెన్నూరు వద్ద దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రయాణించుట వలన దీనిని “ఉత్తర వాహిని” అంటారు.
3. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం కాళేశ్వరం (భూపాలపల్లి) వద్ద కలదు. గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలిసే త్రివేణి సంగమం కందకుర్తి (నిజామాబాద్) వద్ద కలదు
4. ఈ నదిపై తెలంగాణలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు – శ్రీరాంసాగర్ (పోచంపాడు) గోదావరి నది ధర్మపురి వద్ద దక్షిణాది ముఖంగా ప్రవహించును.
(a) 1& 2
(b) 1, 2 & 3
(c) 1, 2, 3 & 4
(d) 1, 3 & 4

Q8. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) కి సంబందించి కింది ప్రకటనలో ఏది సరైంది?
1. విస్తీర్ణం లో దేశంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు. దీనిలో దేశీయ టర్మినలు ఎన్.టి.ఆర్ పేరు పెట్టారు.
2. ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న తొలి హరిత అంతర్జాతీయ విమానాశ్రయం
3. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించిన 2వ ఎయిర్ పోర్టు. (మొదటిది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు)
(a) 1, 2 మాత్రమే
(b) 2, 3 మాత్రమే
(c) 1, 3 మాత్రమే
(d) 1, 2 & 3

Q9. ప్రతిపాదన (A): ‘నిజాం సబ్జెక్ట్ లీగ్’ 1939లో రద్దయింది.
కారణము (R) : కొందరు ప్రముఖ ముస్లిం సోదరులు ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో ఈ లీగ్ ను వదిలి ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకత్వం వహించారు.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం

Q10. మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తా-రోకో కార్యక్రమానికి సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి.
1. తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
2. సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది.
3. 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు.
(a) 1 మరియు 2 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మరియు 1 మాత్రమే
(d) పైవన్నీ

Solutions:

S1. Ans (c)
Sol: ఈ ప్రాంతం అంతా చిన్న కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాల స్థలాకృతి కలిగి ఉంటుంది. ఈ గుట్టలు 5 జిల్లాలలో వివిధ పేర్లతో పిలువబడతాయి.
• ఆదిలాబాద్ లో ఈ గుట్టలు నిర్మల్ గుట్టలుగా, సత్నాలగుట్టలుగా పిలవబడతాయి.
• ఈ గుట్టలను కరీంనగర్లో రాఖీ గుట్టలుగా పిలుస్తారు
• వరంగల్లో కంగాల్ గుట్టలుగా పిలుస్తారు
• ఖమ్మంలో రాజుగుట్టలు (వాయువ్యం) ప్రసిద్ధి పొందిన హసనపర్థి, చంద్రగిరి, ఐరన్ కొండలు, యల్లండ్లపాడ్ గుట్టలుగా పిలుస్తారు
• నిజామాబాద్ సిర్నాపల్లి శ్రేణులుగా పిలుస్తారు
• హైదరాబాద్లో రాచకొండగుట్టలుగా పిలుస్తారు.

S2. . Ans (a)
Sol: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా 3 ప్రదేశాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్నాయి. అవి 1. కొత్తగూడెం (ఖమ్మంజిల్లా) 2. రామగుండం (కరీంనగర్ జిల్లా) మరియు కాకతీయ (వరంగల్లు జిల్లా) చెల్పూర్ గ్రామ సమీపంలో ఉంది. మొత్తం వీటన్నింటిలో ఒక కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోనే 1720 MWల స్థాపిత సామర్థ్యంతో యూనిట్లు ఉన్నాయి. చెల్పూరు మరియు రామగుండం B కేంద్రాలు వరుసగా 500 మరియు 62.5 MW ల స్థాపిత సామర్థ్యాలను కలిగి ఉంది. వీటికి అదనంగా 600 m.w ల స్థాపిత సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను చెల్పూరు (KTPP) లో జనవరి 5, 2016న ప్రారంభించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో TSGENCO యొక్క స్థాపిత థర్మల్ విద్యుత్ సామర్ధ్యం 2882.5 MW లకు పెరిగింది.

S3. Ans(b)
Sol: “ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండటానికి గల కారణాలలో అతిముఖ్యమైనది, అతిసామాన్యమైనది వ్యవసాయ విధానంలో లోటే” అని అన్నది ఆర్థర్ లూయీస్.

S4. Ans (a)
Sol: ప్రభుత్వం పంచిన భూములను సేద్యానికి అనువుగా మార్చి అభివృద్ధి చేయుటకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా 2004లో ఇందిర ప్రభ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

S5. Ans(a)
Sol: నైపుణ్యంగల చేనేత కార్మికులు రాష్ట్రంలో వున్నప్పటికీ, పరిశ్రమలు లేకపోవడం వల్ల వారు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో జిన్నింగ్, స్పిన్నింగ్, నేత, కుట్టు, టెక్స్టైల్ ప్రాసెసింగ్ తదితర అత్యాధునిక సదుపాయాలతో మెగా టెక్స్టైల్ పార్క్ (ఎంటిపి) నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

S6. Ans (a)
Sol: మృత్తికా క్రమక్షయం అంటే మృత్తికల తయారీ కంటే మృతికలు సహజ కారకాలైన నీరు, గాలితో క్రమక్షయం చెందడం. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకొంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా మృత్తికా క్రమక్షయంపై ఆధారపడుతుంది. గాలి, నీరుతో ఏర్పడిన మృత్తికా క్రమక్షయం తెలంగాణలోని పలుచోట్ల గమనించవచ్చు.

S7. Ans (c)
Sol: గోదావరి నది ప్రత్యేకత
• గోదావరి నది ఏర్పరచిన నది ఆధారిత ద్వీపం బాదనకుర్తి (నిర్మల్)
• జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో గల చెగ్గాం వద్ద గోదావరి చంద్రవంక ఆకారంలో ప్రవహిస్తుంది. జగిత్యాల జిల్లా వేంపెల్లి వెంకట్రావ్ పేట్ దగ్గర గోదావరి ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది.
• తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండల వద్ద బైసన్ ను ఏర్పరుస్తుంది.
• చెన్నూరు వద్ద దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రయాణించుట వలన దీనిని “ఉత్తర వాహిని” అంటారు.
• గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం కాళేశ్వరం (భూపాలపల్లి) వద్ద కలదు. గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలిసే త్రివేణి సంగమం కందకుర్తి (నిజామాబాద్) వద్ద కలదు
• ఈ నదిపై తెలంగాణలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు – శ్రీరాంసాగర్ (పోచంపాడు) గోదావరి నది ధర్మపురి వద్ద దక్షిణాది ముఖంగా ప్రవహించును.

S8. Ans (d)
Sol: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్):
• ప్రారంభం మార్చి 14, 2008. (2018 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది). విస్తీర్ణం: 5500 ఎకరాలు
• విస్తీర్ణం లో దేశంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు. దీనిలో దేశీయ టర్మినలు ఎన్.టి.ఆర్ పేరు పెట్టారు.
• యాజమాన్యం: జి.ఎం.ఆర్. (గ్రంధి మల్లిఖార్జున రావు), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్.
• ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న తొలి హరిత అంతర్జాతీయ విమానాశ్రయం
• ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించిన 2వ ఎయిర్ పోర్టు. (మొదటిది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు)
• ఈ విమానాశ్రయానికి ఆర్.టి.సి వాళ్ళు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సు: పుష్పక

S9. Ans (a)
Sol: కొందరు ప్రముఖ ముస్లిం సోదరులు ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో ఈ లీగ్ ను వదిలి ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకత్వం వహించారు. ఈ సంస్థలో హిందువులు, ముస్లింలు, పారశీలు (అన్ని కులాలు, మతాలు) వారు సభ్యులుగా ఉన్నారు. కావున ఈ లీగ్ మత పాక్షిక సంస్థ అను నేరారోపణ చేయుటకు ప్రభుత్వానికి వీలులేకుండా పోయింది. ఈ లీగ్ ఒత్తిడి తీవ్రం కావడంతో ప్రభుత్వం ఆరవముదు అయ్యంగార్ నేతృత్వంలో ఓ కమిటీనివేసి, పరిస్థితులను సమీక్షించిన అనంతరం 1939లో ముల్కీ నిబంధనల్ని సవరించారు. కొందరు ముస్లిం మేథావులు ముస్లిం సార్వహౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో దీనిని వదిలి ‘ఇత్తేహాదుల్ ముస్లీమీన్’ సంస్థలో చేరటంతో ‘నిజాం సబ్జెక్ట్ లీగ్’ 1939లో రద్దయింది.

S10. Ans (d)
Sol: మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తారోకో కార్యక్రమాన్ని రాస్తా-రోకో, రైల్-రోకో, సడక్ బంద్ ల పేర్లతో పిలుస్తూ నిర్వహించారు.
• తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రాంతం గుండా వెళుతున్న రైళ్ళ రాకపోకలను స్థంభింపచేయటం ద్వారా తెలంగాణ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ ఉద్యమం జరిగింది.
• సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు, ఆలంపూర్ వరకు 200 కిలోమీటర్ల మేర సడక బంద్ను నిర్వహించారు.
• 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

can I found Telangana State Quiz?

Yes, for more Quizzes visit Adda27 Telugu website