Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 18 March 2023, For TSPSC Groups, TS Police, TS High Court & TS District Court

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. ఈ క్రింది వానిని జతపరచండి.

జాబితా – I                                     జాబితా – II

(అధికార చిహ్నాలు)                   (శాస్ర్తీయ నామం)

  1. పాలపిట్ట                          1. యాక్సిస్ యాక్సిస్
  2. జింక                                 2. కొరల్కాస్ బెంగలెన్సిస్
  3. జమ్మిచెట్టు                       3. క్యాసియా అరిక్యులేటా
  4. తంగేడు పూలు               4. ప్రోసోపిస్ సినరేరియా

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q2. కింది ప్రకటనలు పరిశీలించండి.

  1. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్.
  2. రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య).
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1, 2 కాదు

Q3. మృత్తికా సంరక్షణకు ఈ కింది పేర్కొన్న ఏ చర్యలు చేపట్టవచ్చు.

  1. అడవుల పెంపకం
  2. అతిగా పశువులు మేతవేయకుండా చూడటం (over grazing)
  3. ఆనకట్టల నిర్మాణం

(a) 1, 2 మాత్రమే

(b) 1, 2 & 3

(c) 1, 3 మాత్రమే

(d) 2, 3 మాత్రమే

Q4. తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కింది ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి

  1. తెలంగాణ పీఠభూమి
  2. గోదావరి బేసిన్ ప్రాంతం
  3. కృష్ణాపర్వతపాద ప్రాంతం

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి

(a) 1, 2 మాత్రమే

(b) 1, 3 మాత్రమే

(c) 2, 3 మాత్రమే

(d) 1, 2 & 3

Q5. తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు, డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు.

  1. రామగుండం (కరీంనగర్),
  2. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, (ఖమ్మం)
  3. మంచిర్యాల (ఆదిలాబాద్)

దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:

(a) 1 & 2

(b) 1 & 3

(c) 2 & 3

(d) 1, 2 & 3

Q6. సాధారణంగా భారతదేశ వాతావరణశాఖ (IMD) ఈ కింది నాలుగు ప్రత్యేకమైన రుతువులను గుర్తించింది. ఈ క్రింది వానిని జతపరచండి.

జాబితా – I                                                 జాబితా – II

  1. శీతాకాలం                                         1. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు
  2. నైరుతి రుతుపవనాల కాలం          2. మార్చి నుంచి మే వరకు
  3. తిరోగమన రుతువపనాల కాలం     3. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
  4. వేసవి వాతావరణ కాలం                  4. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q7. తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా సగటు వర్షపాతం సంవత్సరానికి 906.6 మిల్లీ మీటర్లుగా వుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది?

  1. నైరుతి ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 715 మిల్లీ మీటర్లు
  2. ఈశాన్య ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 129 మిల్లీ మీటర్లు.
  3. ఇతర వర్షాలు వలన లభించు సగటు వర్షపాతం 92 మిల్లీ మీటర్లు
  4. పైనపెర్కొన్నవని సరైనవే.

Q8. నల్లరేగడి మృత్తికలను 3 రకాలుగా వర్గీకరించారు. వాటికి సంబంధించి కింద పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది?

  1. లోతైన నల్ల రేగడి మృత్తికలు: ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు ఈ మృత్తిక మేఖల వ్యాపించి ఉన్నాయి
  2. మధ్యస్థ నల్ల రేగడి మృత్తికలు: రెండు లోతైన నల్ల నేలలకు మధ్య ఉత్తర దక్షిణాలుగా పొడవైన మేఖల నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉన్నాయి.
  3. వర్గీకరించని నల్ల రేగడి మృత్తికలు: ఈ మృత్తికలు ఎక్కువగా నల్గొండ జిల్లా దక్షిణవైపున, మహబూబ్నగర్ జిల్లా ఆగ్నేయ ప్రాతం, ఆదిలాబాద్-సిరిపూర్ మధ్య ప్రాంతలో విస్తరించి ఉన్నాయి.

(a) 1 & 2

(b) 1 & 3

(c) 2 & 3

(d) 1, 2 & 3

Q9. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొంది, దేశవ్యాప్తంగా జరిగే హస్తకళానైపుణ్య మేళాలో పెంబర్తి ఇత్తడి వస్తువులు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాయి. ఈ కళకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇతర కుటీర పరిశ్రమలకు ప్రసిద్ధిపొందిన ప్రాంతాలను జతపరుచుము.

జాబితా – I                                జాబితా – II

  1. అగరవత్తుల                     1. అసిఫాబాద్
  2. తుంగ చాపలు                  2. మునేరు (మెదక్)
  3. టస్సర్ సిల్క్                   3. హైదరాబాదు
  4. పట్టు                                  4. మహబూబ్నగర్ జిల్లా

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q10. మూల ఆధారిత, స్థూల నీటిపారుదల వసతుల (GIA) గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వేటి  ఆధారిత నీటిపారుదల వసతిపైనే ఆధారపడి ఉన్నదని తెలియుచున్నది?

  1. గొట్టపు బావుల
  2. తవ్విన బావుల
  3. a మరియు b రెండూ
  4. ఏది కాదు

Solutions:

S1. Ans (a)

Sol: తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును రాష్ట్ర ప్రభుత్వం 2014, నవంబర్ 17న ఖరారు చేసింది.

  • పాలపిట్ట (ఇండియన్ రొల్లెర్ బ్లూ జాయ్) తెలంగాణ సంస్కృతిలో భాగం. పాలపిట్ట శాస్త్రీయ నామం కొరల్కాస్ బెంగలెన్సిస్.
  • రామాయణం వంటి గాథలలో జింకకు (స్పాటెడ్ డీర్) ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో జింకలు సంచరిస్తాయి. జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్.
  • జమ్మిచెట్టు తెలంగాణ ప్రజాజీవితంలో అంతర్భాగం. దసరా సందర్భంగా జమ్మికి పూజలు చేసి ఆకులను తీసుకెళ్లడం తెలంగాణలో ఆనవాయితి. జమ్మిచెట్టు శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినరేరియా.
  • తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మలో వాడే తంగేడు పూలకు ఘనమైన చరిత్ర ఉంది. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. తంగేడు పూల శాస్త్రీయ నామం క్యాసియా అరిక్యులేటా.

S2. Ans (c)

Sol:

  • తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్. లక్ష్మణ్ ఏలె (జూన్ 8 , 1965) ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. ఇతను నల్గొండ జిల్లా కు చెందినవాడు.
  • రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య). ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య.

S3. Ans (b)

Sol: మృత్తికా సంరక్షణకు ఈ కింది చర్యలు చేపట్టవచ్చు.

  • అడవుల పెంపకం
  • అతిగా పశువులు మేతవేయకుండా చూడటం (over grazing)
  • ఆనకట్టల నిర్మాణం
  • వ్యవసాయ పద్ధతులైన వాలు కట్టలను పెంచడం సాంద్రీకరణ వ్యవసాయం తగ్గించడం, పంటలను మార్చి వేయడం మొ॥ పద్ధతులను అవలంబించడం

S4. Ans (d)

Sol: తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి

  • తెలంగాణ పీఠభూమి : ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం యొక్క అతిపెద్ద ప్రాంతంగా అభివర్ణిస్తారు.
  • గోదావరి బేసిన్ ప్రాంతం : ఈ బేసిన్ ముఖ్యంగా భారతదేశ ద్వీపకల్పం ముఖ్య లక్షణంగా వర్ణిస్తారు.
  • కృష్ణాపర్వతపాద ప్రాంతం : ఈ ప్రాంతం ప్రధానంగా ఒక బహిర్గతమైన శిల ఉపరితలం.

S5. Ans (d)

Sol: తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు, డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు.

  1. రామగుండం (కరీంనగర్),
  2. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, (ఖమ్మం)
  3. మంచిర్యాల (ఆదిలాబాద్)

S6. Ans (b)

Sol: సాధారణంగా భారతదేశ వాతావరణశాఖ (IMD) ఈ కింది నాలుగు ప్రత్యేకమైన రుతువులను గుర్తించింది. అవి

  • చల్లనివాతావరణ కాలం లేదా శీతాకాలం (డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు)
  • వేసవి వాతావరణ కాలం లేదా వేసవికాలం (మార్చి నుంచి మే వరకు)
  • నైరుతి రుతుపవనాల కాలం లేదా వర్షరుతువు (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)
  • తిరోగమన రుతువపనాల కాలం (అక్టోబర్ నుంచి నవంబర్ వరకు).

S7. Ans (d)

Sol: తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా సగటు వర్షపాతం సంవత్సరానికి 906.6 మిల్లీ మీటర్లుగా వుంటుంది.

  • నైరుతి ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 715 మిల్లీ మీటర్లు
  • ఈశాన్య ఋతుపవనాల కాలంలో లభించు సగటు వర్షపాతం 129 మిల్లీ మీటర్లు.
  • ఇతర వర్షాలు వలన లభించు సగటు వర్షపాతం 92 మిల్లీ మీటర్లు.

S8. Ans (d)

Sol: తెలంగాణ రాష్ట్రంలో నల్లరేగడి మృత్తికలు 25 శాతం ఆక్రమించి ఉన్నాయి. నల్లరేగడి మృత్తికలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

  • లోతైన నల్ల రేగడి మృత్తికలు: చాలావరకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు ఈ మృత్తిక మేఖల వ్యాపించి ఉన్నాయి. త ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని అరణ్య ప్రాంతమంతా ఈ మృత్తికలు వ్యాపించి ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పడమటి వైపు ఈ రకపు మృత్తికలు ఉన్నాయి.
  • మధ్యస్థ నల్ల రేగడి మృత్తికలు: ఈ రకం మృత్తికలు కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. రెండు లోతైన నల్ల నేలలకు మధ్య ఉత్తర దక్షిణాలుగా పొడవైన మేఖల నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉన్నాయి. సాధారణంగా వీటి చుట్టూ ఎర్రనేలలు ఆవరించి ఉంటాయి.
  • వర్గీకరించని నల్ల రేగడి మృత్తికలు: ఈ మృత్తికలు ఎక్కువగా నల్గొండ జిల్లా దక్షిణవైపున, మహబూబ్నగర్ జిల్లా ఆగ్నేయ ప్రాతం, ఆదిలాబాద్-సిరిపూర్ మధ్య ప్రాంతలో విస్తరించి ఉన్నాయి. ఈ మృత్తికలలో పత్తి ఎక్కువగా పండుతుంది. అందుకే వీటిని పత్తి పంట మృత్తికలు అంటారు

S9. Ans (c)

Sol: కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ వరంగల్లోని పెంబర్తి అనే గ్రామంలో పుట్టింది. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొంది, దేశవ్యాప్తంగా జరిగే హస్తకళానైపుణ్య మేళాలో పెంబర్తి ఇత్తడి వస్తువులు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాయి. ఈ కళకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇతర కుటీర పరిశ్రమలకు ప్రసిద్ధిపొందిన ప్రాంతాలు

  • అగరవత్తులు        –         హైదరాబాదు
  • పట్టు                       –         మునేరు (మెదక్), వరంగల్, ఆదిలాబాద్
  • తుంగ చాపలు       –         మహబూబ్నగర్ జిల్లా
  • టస్సర్ సిల్క్         –         అసిఫాబాద్ (ఆదిలాబాద్), మహదేవపూర్ (కరీంనగర్)

S10. Ans (c)

Sol: మూల ఆధారిత, స్థూల నీటిపారుదల వసతుల (GIA) గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా, అత్యధిక స్థాయిలో గొట్టపు మరియు తవ్విన బావుల ఆధారిత నీటిపారుదల వసతిపైనే ఆధారపడి ఉన్నదని తెలియుచున్నది. బావుల ద్వారా రాష్ట్రంలో స్థూల నీటి పారుదల వాటా 2008-09లో 72.08% కాగా అది 2013-14 నాటికి 73.82% పెరిగింది. అయితే బావుల ద్వారా కల్పించబడిన స్థూల నీటి పారుదల వాటా 2009-10 మరియు 2012-13 లలో అత్యధిక స్థాయిలో వరుసగా 86.43% మరియు 86.32%గా నమోదయింది. ఇదే సం॥లకు గానూ కాలువల ద్వారా కల్పించబడిన స్థూల నీటి పారుదల వసతులు అత్యల్పంగా 7.93 మరియు 4.71%గా నమోదయ్యాయి. 2009-2014ల మధ్యకాలంలో కాలువల ద్వారా కల్పించబడి స్థూల, నీటి పారుదల వసతులు గల నేల 2008-09 నాటి 10.5% నుంచి 2013-14 నాటికి 8.94%కి పడిపోయింది.

adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can I found Daily Quiz?

You can found daily quizzes at adda 247 website