Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 17 September 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 15 September 2022 |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. దేశీయంగా డిజిటల్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ రీజియన్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తోంది. 

  1. సంగారెడ్డి
  2. రంగారెడ్డి
  3. మెదక్
  4. హైదరాబాద్

Q2. దేశంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ మొదటి యూనిట్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

  1. హైదరాబాద్‌
  2. ఢిల్లీ
  3. బెంగుళూరు
  4. ముంబై

Q3. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు. 

  1. నీరజా విజేందర్
  2. మనీషా సాబూ
  3. శాంతి దేవులపల్లి
  4. భరణి కె. అరోల్

Q4. దేశంలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?

  1. ముంబై  
  2. ఢిల్లీ
  3. బెంగుళూరు
  4. హైదరాబాద్‌

Q5. స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 గణాంకాల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం  ఎంత?

  1. రూ.1,28,829
  2. రూ. 2,37,632
  3. రూ.5,05,849 
  4. రూ. 91,121

Q6. తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 నివేదిక ప్రకారం విద్యుత్‌ వినియోగం 2020–21లో  ఎన్ని ఎంయూలకు పడిపోయింది

  1. 57,006
  2. 58,515 
  3. 39,519
  4. 45,525

Q7. మిషన్‌ భగీరథను ఎక్కడ ప్రారంభించారు?

  1. నల్లగొండ
  2. భద్రాద్రి కొత్తగూడెం
  3. గజ్వేల్‌ 
  4. మహబూబాబాద్‌

Q8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో ఎక్కువగా ఉన్న రైతులు ఎవరు?

  1. చిన్న రైతులు
  2. మధ్యతరహా రైతులు
  3. పెద్ద రైతులు
  4. సన్నకారు రైతులు

Q9. హైస్కూల్‌ స్థాయిలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ ఉన్న జిల్లా?

  1. జయశంకర్‌ భూపాల్‌పల్లి
  2. ములుగు 
  3. నారాయణ పేట 
  4. భద్రాద్రి కొత్తగూడెం

Q10. తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 ప్రకారం వృద్ధులకు పెన్షన్ ద్వారా నెలకు ఎంత మొత్తాన్ని అందిస్తున్నారు?

  1. రూ.3,016 
  2. రూ.2,016
  3. రూ.1,016
  4. రూ.2,516

Solutions:

 S1. Ans (d)

Sol: దేశీయంగా డిజిటల్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్‌లో మొదటి ఫేజ్‌ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతుంది. ఈ విషయాలను మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో కలిసి మార్చి 7న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు.మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్‌ రీజియన్లు ఉండగా హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది.

S2. Ans (a)

Sol: అమెరికా కేంద్రంగా డిజిటల్‌ సమస్యల పరిష్కారంలో పేరొందిన అంతర్జాతీయ కంపెనీ గ్రిడ్‌ డైనమిక్స్‌భారత్‌లో తన మొదటి యూనిట్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మే 9న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ఈ యూనిట్‌తో ఏడాదిలోపు  వేయి మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. సంస్థ సీఈఓ లివ్‌షిట్జ్‌ నేతృత్వంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ ప్రతినిధి బృందం మే 9న ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమావేశమై.. యూనిట్‌ ఏర్పాటు విషయమై చర్చలు జరిపింది.

S3. Ans (b)

Sol: హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెజ్‌ సెంటర్‌ హెడ్‌ సెంటర్‌ హెడ్‌ మనీషా సాబూ ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం హైసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2022–24 కాలానికి ఆమె ఈ పదవిలో ఉంటారు. హైసియా సీఎస్‌ఆర్‌ విభాగానికి మనీషా నేతృత్వం వహిస్తున్నారు. ఐటీ రంగంలో ఆమెకు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైసియా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఫస్ట్‌సోర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ నందెళ్ల, జనరల్‌ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్‌ సిస్టమ్స్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.

S4. Ans (d)

Sol: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తాజాగా ప్రారంభించిన కేంద్రం రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు.

S5. Ans (b)

Sol: స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 గణాంకాల ప్రకారం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ముందంజలో ఉంది.  2020–21 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,37,632కు చేరింది.

S6. Ans (a)

Sol: తాజా ప్రభుత్వ నివేదిక ప్రకారం… తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్‌ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్‌ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం.

S7. Ans (c)

Sol: తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల మెరుగునకు ప్రభ్యుత్వం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో మిషన్‌ భగీరథది కీలకపాత్ర. ఈ పథకాన్ని 2016, ఆగస్టు 6వ తేదీన గజ్వేల్‌ నియోజకవర్గం, కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని నల్లాల ద్వారా అన్ని కుటుంబాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనేది మిషన్‌ భగీరథ లక్ష్యం. దీని ఫలితాలను ఫిబ్రవరి 23న తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ప్రభుత్వం పేర్కొంది

S8. Ans (d)

Sol: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో సన్నకారు రైతులే ఎక్కువని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో వెల్లడైంది. 2018, మే 10వ తేదీన ప్రారంభమైన రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా (రెండు విడతల్లో) ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.

S9. Ans (a)

Sol: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోందని ఫిబ్రవరి 23న విడుదలైన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 వెల్లడించింది. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయస్కులుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్‌లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్‌ (స్కూల్‌ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్‌ (హైస్కూల్‌ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

S10. Ans (b)

Sol: రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల కింద పలు కేటగిరీల్లో మొత్తం 38,80,922 మందికి నెలవారీ పెన్షన్లు ఇస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయా వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.

2020–21లో కేటగిరీల వారీగా.

  • వృద్ధాప్య పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 12,36,502 మంది
  • వితంతువుల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 14,47,107 మంది
  • దివ్యాంగులకు పింఛన్లు నెలకు రూ.3,016 చొప్పున 4,90,630 మంది
  • చేనేత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 37,264 మంది
  • కల్లుగీత కార్మికులకు పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 62,766 మంది
  • హెచ్‌ఐవీ పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 33,198 మంది
  • బీడీ కార్మికుల పేషెంట్ల పింఛన్లు నెలకు రూ.2,016 చొప్పున 4,22,246 మంది

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu 15 September 2022 |_80.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!