Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 15 September 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 10 September 2022 |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. అల్పాభివృద్ధి అంశాలు ఈ క్రింది వాటిలో ఏవి?

  1. వృతుల వారి వ్యవస్థ
  2. తక్కువ తలసరి ఆదాయం
  3. అభివృద్ధి సాధించే సమర్థత
  4. పేదరికం

(a) 1, 2, 3, 4

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 3 మరియు 4

Q2. తెలంగాణ ప్రాంత శిశు మరణాల రేటు 1981లో 83 ఉండగా, 2011లో ____కు తగ్గింది.

  1. 50
  2. 63
  3. 55
  4. 66

Q3. టీ- వర్క్స్ ద్వారా మానవ రహిత వైమానిక వాహనాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనిలో ఏ రకమైన టెక్నాలజీని వినియోగిస్తున్నారు?

(a) 2D ప్రింటింగ్

(b) 4D ప్రింటింగ్

(c) 3Dప్రింటింగ్

(d) 5D ప్రింటింగ్

Q4. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణల సంస్థ అయినటువంటి T-హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

(a) ఐఐటి ప్రాంగణం, కంది సంగారెడ్డి జిల్లా

(b) ఐఐటి గచ్చిబౌలి, హైదరాబాద్

(c) ఐఐటి బాసర, నిర్మల్

(d) ఐఐటి ప్రాంగణం, వరంగల్

Q5. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. వీరి ఎన్నిక విధానంకు సంబంధించి కింది ప్రకటనలో సరికానిది ఏది.

  1. తొమ్మిది మంది సభ్యులు తెలంగాణలోని అప్పటి తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు జిల్లాల వారిగా ఎన్నుకొంటారు.
  2. ఆరుగురు సభ్యులు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు అయి ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులందరు కలిసి ఎన్నుకోవాలి.
  3. ఐదుగురు సభ్యులు శాసన సభ్యులు కాని వారు ఉంటారు. వీరిని ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు ఎన్నుకొంటారు. వీరితో బాటు తెలంగాణ ప్రాంత మంత్రులందరూ పదవీరీత్యా ఇందులో సభ్యులు.
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 3 మాత్రమే
  4. పైవన్నీ

Q6. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఒక చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీరిని ఎవరు ఎన్నుకొంటారు?

  1. ప్రజల ఎన్నిక ద్వారా
  2. తెలంగాణకు చెందిన గవర్నర్
  3. రాష్ట్రపతి
  4. తెలంగాణకు చెందిన శాసన సభ్యులు

Q7. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో ఎక్కడ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు.

  1. ఖమ్మం
  2. పాలేరు
  3. కొత్తగూడెం
  4. భద్రాచలం

Q8. తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు ఏవి?

  1. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
  2. 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు
  3. 1857 పోరాట తిరుగుబాటు
  4. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) పైనపెర్కొన్నవని

Q9. తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2006 జూన్లో హైదరాబాద్ లోని ఫతేమైదాన్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సదస్సులోనే టి. వివేక్ కన్వీనర్ గా ఏర్పడిన సంస్థ ?

  1. తెలంగాణ హిస్టరీ సొసైటీ
  2. తెలంగాణ విద్యావంతుల వేదిక
  3. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
  4. పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్

Q10. 371(డి) నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో రాష్ట్రపతికి అధికారం కలదు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14వ పేరాలోని మినహాయింపులను జతపరుచుము?

  1. 14(ఎ)               1. హెఒడి విభాగాధిపతి కార్యాలయాలలోని పోస్టులు
  2. 14(బి)               2. ప్రత్యేక కార్యాలయాలలోని పోస్టులు
  3. 14(సి)               3. రాష్ట్ర సచివాలయంలోని పోస్టులు
  4. 14(డి)                4. రాష్ట్రస్థాయి కార్యాలయాలలోని పోస్టులు

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 1, C – 2, D – 4

(d) A – 4, B – 3, C – 2, D – 1

Solutions:

S1. Ans (a)

Sol: అల్పాభివృద్ధి అంశాలు:

  • వృతుల వారి వ్యవస్థ
  • తక్కువ తలసరి ఆదాయం
  • అభివృద్ధి సాధించే సమర్థత
  • పేదరికం

S2. Ans (c)

Sol: తెలంగాణ ప్రాంత శిశు మరణాల రేటు 1981లో 83 ఉండగా 1991లో 50, 2001 లో 63, 2011లో 55నకు తగ్గింది.

S3. Ans(c)

Sol: టీ-వర్క్స్ ముఖ్యంగా అంకుర సంస్థల యొక్క పరిశోధన మరియు అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. ఉదా: ఇది మానవరహిత వైమానిక వాహనాన్ని రూపకల్పన చేసింది. ద్వారా దీనిలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

S4. Ans(b)

Sol: తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణల సంస్థ అయినటువంటి T-హబ్ ను టి-హబ్ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్ లో ఏర్పాటు చేశారు.

S5. Ans (c)

Sol: తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. వీరి ఎన్నిక విధానం కింది విధంగా ఉంటుంది.

  • తొమ్మిది మంది సభ్యులు తెలంగాణలోని అప్పటి తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు జిల్లాల వారిగా ఎన్నుకొంటారు.
  • ఆరుగురు సభ్యులు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు అయి ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులందరు కలిసి ఎన్నుకోవాలి.
  • ఐదుగురు సభ్యులు శాసన సభ్యులు కాని వారు ఉంటారు. వీరిని తెలంగాణ శాసన సభ్యులు ఎన్నుకొంటారు. వీరితో బాటు తెలంగాణ ప్రాంత మంత్రులందరూ పదవీరీత్యా ఇందులో సభ్యులు

S6. Ans (d)

Sol:  తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఒక చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీరిని తెలంగాణకు చెందిన శాసన సభ్యులు (105) ఎన్నుకొంటారు. వీరి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను గవర్నర్ జారీ చేస్తాడు. వీరి అసెంబ్లీ సభ్యత్వం పోతే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సభ్యత్వం పోతుంది. వీరి ఎన్నికను బహిరంగ ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహిస్తారు. ప్రాంతీయ కమిటీ సభ్యులు ప్రత్యేక మెజారిటీ ద్వారా చేసిన తీర్మానం ద్వారా వీరిని తొలగించవచ్చు.

S7. Ans (d)

Sol:

  • తెలంగాణ భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ జాగరణ సేన అను పేరుతో లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
  • పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో 2006 ఫిబ్రవరి 12న భద్రాచలంలో బహిరంగ సభను నిర్వహించింది.
  • ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు

S8. Ans(d)

Sol: తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు:

  • తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
  • 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు
  • 1857 పోరాట తిరుగుబాటు
  • ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర

S9. Ans(a)

Sol: తెలంగాణ హిస్టరీ సొసైటీ:

తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2006 జూన్లో హైదరాబాద్ లోని ఫతేమైదాన్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సదస్సులోనే టి. వివేక్ కన్వీనర్గా తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది.

లక్ష్యాలు:

  • తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి
  • తెలంగాణ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడం
  • తెలంగాణ ప్రాంతంలోని స్థానిక చరిత్రను లిఖితం చేయటం

S10. Ans(c)

Sol: 371(డి) నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో రాష్ట్రపతికి అధికారం కలదు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14వ పేరాలోని మినహాయింపులు

  • 14(ఎ) –  రాష్ట్ర సచివాలయంలోని పోస్టులు
  • 14(బి) –  హెఒడి విభాగాధిపతి కార్యాలయాలలోని పోస్టులు ప్రత్యేక కార్యాలయాలలోని పోస్టులు
  • 14(సి) –  హెఒడి విభాగాధిపతి కార్యాలయాలలోని పోస్టులు
  • 14(డి) – రాష్ట్రస్థాయి కార్యాలయాలలోని పోస్టులు

 

TSPSC AE Notification 2022 |_80.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!