Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తన వద్దకు వచ్చిన ప్రతీ బిల్లును చర్చించి ఆమోదించే అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విస్తృతంగా చర్చించే నిమిత్తం ఉపసంఘాలను ఏర్పాటు చేసి వాటికి నివేదిస్తుంది. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో ఉన్న ఉపసంఘాలు ఏవి?
- స్థాయి ఉపసంఘాలు
- తాత్కాలిక ఉపసంఘాలు
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 1 మరియు 2 రెండూ
- 1 , 2 కాదు
Q2. మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తా-రోకో కార్యక్రమానికి సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి.
- తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
- సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది.
- 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు.
- 1 మరియు 2 మాత్రమే
- 2 మరియు 3 మాత్రమే
- 3 మరియు 1 మాత్రమే
- పైవన్నీ
Q3. గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి. అవి ఏవి?
- అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు.
- స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు.
- శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం.
- స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో).
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం. శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.
- 1,2 మరియు 4 మాత్రమే
- 2,4 మరియు 5 మాత్రమే
- 1, 3 మరియు 5 మాత్రమే
- పైవన్నీ
Q4. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు. అలాంటి కవులలో ఈ కింది వాటిని సరిగ్గా జత కానివి ఏవి?
- బండి యాదగిరి – “బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా”.
- సుద్దాల హన్మంతు – “పల్లెటూరి పిల్లగాడో”.
- దాశరథి కృష్ణమాచార్యులు – “నా తెలంగాణ కోటి రతనాల వీణ”
- 1 మాత్రమే
- 2 మరియు 3 మాత్రమే
- 3 మాత్రమే
- పైనవన్నీ సరైనవే
Q5. ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్ యూనియన్) కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
- ఈ ఘర్షణతో కొండపల్లి సీతారామయ్య వర్గం విద్యార్థులు పి.డి.ఎస్.యు నుండి బయటికి వచ్చి 1974 అక్టోబర్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు.
- దీనికి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని నామకరణం చేసింది – శ్రీశ్రీ.
- ఐదవ రాష్ట్ర మహాసభలు : 1982లో తిరుపతిలో ఈ సభాసమావేశాలు జరిగాయి.ఈ సమావేశం నాటికి ఆర్.ఎస్.యు ఆంధ్రప్రదేశ్లోని 18 జిల్లాలకు విస్తరించింది.
- దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో 1985లో ఆర్.ఎస్.యు సంఘం వారు ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేశారు.
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) పైనపెర్కొన్నవని
Q6. ప్రతిపాదన (A): 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది.
కారణము (R) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికైన పెద్దమనుషుల ఒప్పందం, దానిలోని రక్షణలు, హామీ లను నాటి పాలకులు ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడమే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Q7. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దిగువ పేర్కొన్న ఏ చర్యలను విధిగా చేపట్టాలి
- చట్టంలోని సెక్షన్ 108(2) ప్రకారం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కానీ, కేంద్రం అనుమతులు పొందిన ప్రాజెక్టును కేంద్రం అనుమతులు లేనిదే ఆపకూడదు, సవరించకూడదు.
- సెక్షన్ 115(7) ప్రకారం ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను నష్టం జరిగే విధంగా సవరించరాదు.
- సెక్షన్ 115(5) ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఏకీకరణ కోసం అందరికీ న్యాయం అందించడానికి కేంద్రం సలహా కమిటీని నియమించే అవకాశం ఉంది.
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 3 మాత్రమే
- పైవన్నీ
Q8. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించినవారు ఎవరు?
- బి.వి.ఆర్. చారి
- బి.ఎస్.రాములు
- ప్రొ. గంగాధర్
- పసునూరు దయాకర్
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) 1, 2, 3 & 4
Q9. అలై-బలై కార్యక్రమం కు సంబంధించి కింది వాటిలో సరి కానిది ఏది?
- ప్రతి సంవత్సరం దసరా పండుగ తర్వాతి రోజున తెరాస నాయకుడు కెసిఆర్ ఈ అలై-బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- ఈ అలై-బలై కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తారు.
- మొదటి అలై-బలై కార్యక్రమాన్ని నిజాం కాలేజీలో నిర్వహించారు.
- రెండవ సారి నుండి అలై-బలై కార్యక్రమమును జలవిహార్లో నిర్వహిస్తూ తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా మార్చారు.
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) 1, 2, 3 & 4
Q10. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- తెలంగాణ ధూమ్ ధామ్ తొలి సదస్సు 1. సిద్దిపేట
- తెలంగాణ ధూమ్ ధామ్ రెండవ సదస్సు 2. హైదరాబాద్
- తెలంగాణ ధూమ్ ధామ్ మూడవ సదస్సు 3. సంగారెడ్డి
- తెలంగాణ ధూమ్ ధామ్ నాలుగవ సదస్సు 4. కామారెడ్డి
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Solutions:
S1. Ans (c)
Sol: తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తన వద్దకు వచ్చిన ప్రతీ బిల్లును చర్చించి ఆమోదించే అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విస్తృతంగా చర్చించే నిమిత్తం ఉపసంఘాలను ఏర్పాటు చేసి వాటికి నివేదిస్తుంది. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో రెండు రకాలైన ఉపసంఘాలు ఉంటాయి. అవి
- స్థాయి ఉపసంఘాలు: ఇవి నిర్ణీత విషయంపై ప్రధానంగా ఏర్పడి ఆయా అంశాలను విస్తృతంగా చర్చిస్తుంది.
- తాత్కాలిక ఉపసంఘాలు : ఏదైనా ప్రత్యేక విషయంపై తాత్కాలిక ఉపసంఘాలను ఏర్పాటు చేసేవారు. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఏమి లేదు. ఇవి వాటికి నిర్దేశించిన పని పూర్తికాగానే రద్దు అయ్యేవి
S2. Ans (d)
Sol: మలిదశ తెలంగాణా ఉద్యమంలో రాస్తారోకో కార్యక్రమాన్ని రాస్తా-రోకో, రైల్-రోకో, సడక్ బంద్ ల పేర్లతో పిలుస్తూ నిర్వహించారు.
- తెలంగాణ రాజకీయ జెఏసి 2011, మార్చి 11, న “పల్లె పల్లె పట్టాలపై”కి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రాంతం గుండా వెళుతున్న రైళ్ళ రాకపోకలను స్థంభింపచేయటం ద్వారా తెలంగాణ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ ఉద్యమం జరిగింది.
- సడక్ష్ బంద్ అనే కార్యక్రమానికి జెఏసి 2013, మార్చి 21, న పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు, ఆలంపూర్ వరకు 200 కిలోమీటర్ల మేర సడక బంద్ను నిర్వహించారు.
- 2011, జనవరి 17న “రహదారుల దిగ్బంధం” అనే కార్యక్రమాన్ని తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చేపట్టారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది.
S3. Ans (d)
Sol: గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి
- అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు.
- స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు.
- శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం. స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది.
- ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో).
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం.
- శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.
S4. Ans (b)
Sol: తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు.
- తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో సుద్దాల హన్మంతు వ్రాసిన “పల్లెటూరి పిల్లగాడో”.
- బండి యాదగిరి రాసిన “బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా” వంటి పాటలు
- దాశరథి కృష్ణమాచార్యులు “ఓనిజాము పిశాచమా”, “నా తెలంగాణ కోటి రతనాల వీణ” వంటి కవితలు, తిరునగరి, రామాంజనేయుల స్మృతిగీతాలు, కాళోజీ గీతాలు తెలంగాణ ప్రజలపై ప్రభావాన్ని చూపించాయి.
S5. Ans(d)
Sol: ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్ యూనియన్):
- ఈ ఘర్షణతో కొండపల్లి సీతారామయ్య వర్గం విద్యార్థులు పి.డి.ఎస్.యు నుండి బయటికి వచ్చి 1974 అక్టోబర్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు.
- దీనికి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని నామకరణం చేసింది – శ్రీశ్రీ.
- ఐదవ రాష్ట్ర మహాసభలు : 1982లో తిరుపతిలో ఈ సభాసమావేశాలు జరిగాయి.
- ఈ సమావేశం నాటికి ఆర్.ఎస్.యు ఆంధ్రప్రదేశ్లోని 18 జిల్లాలకు విస్తరించింది.
- దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో 1985లో ఆర్.ఎస్.యు సంఘం వారు ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేశారు.
S6. Ans(a)
Sol: తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులే 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన కారకులు. ఆ తర్వాత విద్యార్థులు, యువతతో పాటు యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ భాగ స్వాములవడంతో అదొక మహా ప్రజా ఉద్యమంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికైన పెద్దమనుషుల ఒప్పందం, దానిలోని రక్షణలు, హామీ లను నాటి పాలకులు ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడమే ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. నాటి తెలంగాణ ప్రాంత కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజబహదూర్ గౌర్ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
1968, జులై 10న ‘తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం’ సందర్భంగా ఒక సభ నిర్వహి ఈ సభలో హైదరాబాదు స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కార్మిక నాయకుడు మహదేవ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణిని నిరసించారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించి తీరతామని హెచ్చరించారు.
S7. Ans (d)
Sol: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దిగువ వివరించిన చర్యలను విధిగా చేపట్టాలి.
- చట్టంలోని సెక్షన్ 108(2) ప్రకారం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కానీ, కేంద్రం అనుమతులు పొందిన ప్రాజెక్టును కేంద్రం అనుమతులు లేనిదే ఆపకూడదు, సవరించకూడదు.
- సెక్షన్ 115(7) ప్రకారం ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను నష్టం జరిగే విధంగా సవరించరాదు.
- సెక్షన్ 115(5) ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఏకీకరణ కోసం అందరికీ న్యాయం అందించడానికి కేంద్రం సలహా కమిటీని నియమించే అవకాశం ఉంది.
S8. Ans(a)
Sol: తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించినవారు –
- బి.వి.ఆర్. చారి
- బి.ఎస్.రాములు
- ప్రొ. గంగాధర్
- 2007లో జరిగిన తెలంగాణ సంబురాలలో బి.వి.ఆర్ చారి, బి.ఎస్.రాములు, ప్రొ. గంగాధలకు బంగారు కడియాలు తొడిగి కె.సి.ఆర్. సత్కరించారు.
- తెలంగాణ తల్లి విగ్రహాలలో ఏకరూపత ఉండాలని భావించి ప్రొ. గంగాధర్ శిష్యుడైన పసునూరి దయాకరు ఈ విగ్రహాల తయారీ పనిని కె.సి.ఆర్. గారు అప్పగించారు.
S9. Ans(b)
Sol: అలై-బలై కార్యక్రమం:
- ప్రతి సంవత్సరం దసరా పండుగ తర్వాతి రోజున బిజెపి నాయకుడు దత్తాత్రేయ ఈ అలై-బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- ఈ అలై-బలై కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తారు.
- మొదటి అలై-బలై కార్యక్రమాన్ని నిజాం కాలేజీలో నిర్వహించారు.
- రెండవ సారి నుండి అలై-బలై కార్యక్రమమును జలవిహార్లో నిర్వహిస్తూ తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా మార్చారు.
S10. Ans (b)
Sol:
- తెలంగాణ ధూమ్ ధామ్ తొలి ప్రదర్శన కామారెడ్డి (నిజామాబాద్)లో 2002 సెప్టెంబర్ 30న జరిగింది.
- తెలంగాణ ధూమ్ ధామ్ రెండవ సదస్సు సంగారెడ్డిలో,
- తెలంగాణ ధూమ్ ధామ్ మూడవ సదస్సు సిద్దిపేటలో జరిగాయి.
- ఈ ధూమ్ ధామ్ నాలుగవ సదస్సు హైదరాబాద్లోని లలిత కళాతోరణంలోని భాగమతి కళాతోరణ వేదికపై జరిగింది.
- ధూమ్ ధామ్ మొదలై 10 సంవత్సరాలైన సందర్భంగా డిశంబర్ 22, 2012 నాడు ధూంధాం దశాబ్ది ఉత్సవాలు జరిగాయి.
- హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియంలో ప్రజాగాయకుడు గూడ అంజయ్య, గద్దర్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ ఈ ఉత్సవాలను ప్రారంభించాడు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |