Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. దిగువ వాటిని జతచేయండి
జాబితా I జాబితా II
(A) ఫలదారి 1. నీటిపారుదల చూసేవాడు
(B) శ్రీభండారు 2. పంట పన్నులు వసూలు చూసేవాడు
(C) నీటికాడు 3. పన్నులు వసూలు చేసేవారు
(D) సుంకరులు 4. కోశాధికారి
Code:
A B C D
- 1 2 3 4
- 4 3 2 1
- 2 4 1 3
- 3 2 4 1
Q2. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రాధాన కేంద్రం ఏది?
(a) ఖమ్మం
(b) హన్మకొండ
(c) మోటుపల్లి
(d) ఓరుగల్లు
Q3. తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా ఉన్న ప్రదేశాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్నాయి. అవి
(a) కొత్తగూడెం (ఖమ్మంజిల్లా)
(b) రామగుండం (కరీంనగర్ జిల్లా)
(c) చెల్పూరు (వరంగల్లు జిల్లా)
(d) పైనపెర్కొన్నవని
Q4. కిందివాటిలో సరికానిది ఏది?
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుషుల అక్ష్యరాస్యతా రేటు కంటే భారతదేశ పురుషుల అక్షరాస్యత రేటు ఎక్కువ
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత 312
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి కంటే తెలంగాణ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువ
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లింగ నిష్పత్తి(ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు) 988.
Q5. తెలంగాణ రాష్ట్రం ఏ శిలలతో విస్తరించి ఉంది?
1. గ్రానైట్, నీస్, రూపాంతర శిలలు
2. కార్‌టజ్, షీల్, సున్నపురాయి
3. దక్కన్ ట్రిప్, బసాల్ట్ శిలలు
(a) 1, 2 మాత్రమే
(b) 2, 3 మాత్రమే
(c) 1, 3 మాత్రమే
(d) 1, 2 & 3
Q6. కింది వాటిని జతపరుచుము
వన్యమృగ సంరక్షణ కేంద్రం ప్రాంతం
A. శివ్వారం 1. నాగర్‌కర్నూల్, నల్లగొండ
B. పోచారం 2. కొత్తగూడెం
C. రాజీవ్ గాంధీ 3. మంచిర్యాల, పెద్దపల్లి
D. కిన్నెరసాని 4. మెదక్, కామారెడ్డి
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q7. ‘నిర్మల్ కొయ్య బొమ్మల’ను ఏ కలపతో తయారు చేస్తారు?
- ఇండియన్ రోజ్‌వుడ్
- పుణికి
- కాజురైనా
- టేకు
Q8. తెలుగునేలపై సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని పాలించిన మొదటి వంశీయులు?
- విష్ణుకుండినులు
- ఇక్ష్వాకులు
- వాకాటకులు
- శాలంకాయనులు
Q9. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
A.1930 నుంచి 1940 1. శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
- 1940 నుంచి 1946 2. వ్యక్తిగతమైన ఆందోళనలు.
- 1946 నుంచి 1948 3. ప్రజా సాయుధ పోరాటాలు.
- 1948 నుంచి 1951 4. రైతాంగ సాయుధ పోరాటాలు.
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q10. పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో మొదటివాడు ఎవరు?
- కృష్టుడు(కన్హుడు)
- గౌతమీపుత్ర శాతకర్ణి
- శ్రీముఖుడు
- వాసిష్టిపుత్ర
Solutions
S1. Ans (c)
Sol: పంట పన్నులు వసూలు చేసేవాడిని ఫలదారి లేదా తిరుపారి అనేవారు. శ్రీభండారు అంటే కోశాధికారి. నీటికాడు – నీటిపారుదల చూసేవాడు. పన్నులు వసూలు చేసేవారిని సుంకరులు అనేవారు.
S2. Ans (d)
Sol: శాతవాహనుల తరువాత క్రమంగా క్షీణించిన దేశీయ, విదేశీయ వాణిజ్యాలను కాకతీయులు పునరుద్ధరించినారు. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రాధాన కేంద్రం ఓరుగల్లు, ఓరుగల్లు తరువాత తెలంగాణలోమంథెన, అలంపురం, జడ్చెర్ల, మగతల, పేరూరు, అనాడు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి
S3. Ans (d)
Sol: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా 3 ప్రదేశాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్నాయి. అవి
- కొత్తగూడెం (ఖమ్మంజిల్లా): కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లో 1720 MWల స్థాపిత సామర్థ్యంతో యూనిట్లు ఉన్నాయి.
- రామగుండం (కరీంనగర్ జిల్లా) : రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ 62.5 MW ల స్థాపిత సామర్థ్యాలను కలిగి ఉంది.
- చెల్పూరు (వరంగల్లు జిల్లా): కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ 500 MW ల స్థాపిత సామర్థ్యాలను కలిగి ఉంది. చెల్పూర్ గ్రామ సమీపంలో ఉంది.
S4. Ans(b)
Sol:
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుషుల అక్ష్యరాస్యతా రేటు కంటే భారతదేశ పురుషుల అక్షరాస్యత రేటు ఎక్కువ
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత 312
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి కంటే తెలంగాణ స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువ
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లింగ నిష్పత్తి (ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు) 988
S5. Ans (d)
Sol: తెలంగాణ ప్రాంతం అంతా వివిధ భౌమ శిలావిన్యాసాలతో, ధార్వార్ సమూహానికి చెందిన అతిపురాతనమై శిలలతో నిర్మితమై ఉంది. ఈ శిలలు ఈ ప్రాంతం అంతటా వ్యాపించి ఎక్కువ ఖనిజాలు కలిగి ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో హార్న్ బ్లెండ్ (Horn blend schist) మరియు ఫెర్రుజినస్ క్వార్ట్జ్ (ferruginous quartzites) శిలలు కనిపిస్తాయి. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ద్వీపకల్పగ్రానైట్ కనిపిస్తుంది. గ్రానైట్ ప్రధానంగా రాతినిర్మాణాలలో ఉపయోగిస్తారు. అవక్షేపశిలలు కాలానుక్రమంగా ధార్వార్, ద్వీపకల్ప గ్రానైట్కంటే తరవాత ఏర్పడినవి, ఇవి ప్రధానంగా సున్నపురాయి, షేల్స్ తో నిర్మితమై ఉంటాయి. ఇవి ఎక్కువగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. రాతినార, బారైట్స్ (barytes) మరియు స్ట్రియాటైట్ (steatite) మొదలైనవి ఈ నిర్మాణాలలో ఏర్పడతాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతం (Archaean Gneisses) ఆర్కెయిన్ నైసిస్ శిలలతో నిర్మితమై ఉంది. భౌమశిలావిన్యాసం దక్కన్ ట్రాప్, తూర్పు గోదావరి నుంచి మొదలై తెలంగాణ గుండా పోతుంది.
S6. Ans(c)
Sol: వన్యమృగ సంరక్షణ కేంద్రం ప్రాంతం
- శివ్వారం – మంచిర్యాల, పెద్దపల్లి
- పోచారం – మెదక్, కామారెడ్డి
- రాజీవ్ గాంధీ – నాగర్‌కర్నూల్, నల్లగొండ
- కిన్నెరసాని – కొత్తగూడెం
S7. Ans (b)
Sol: తెలంగాణలో నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. వీటి తయారీకి స్థానికంగా దొరికే కలప, రంగులను వాడతారు. వీటికి వాడే కలప ‘పునిక కర్ర’ ఇది తేలికగా, అందంగా తీర్చిదిద్దడానికి అనువుగా ఉంటుంది. పేయింటింగ్స్ కోసం డ్యూకో పేయింట్స్ వాడతారు.
ఈ కళాకారులు “గనిజా” అనే ప్లేయింగ్ కార్డ్స్ తయారుచేస్తారు. వీటిపై పేటెంట్ పొందిన సంవత్సరం 2010. నిర్మల్ ఫర్నీచర్పై భౌగోళిక గుర్తింపు (G.I) పొందిన సంవత్సరం 2009.
S8. Ans (a)
Sol: తెలుగునేలపై సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని పాలించిన మొదటి వంశీయులు విష్ణుకుండినులు. వీరి జన్మస్థలం వినుకొండ (గుంటూరు జిల్లా) అని కీల్హాహారన్ పండితుడు పేర్కొన్నాడు. వీరి చరిత్రకు 10 శాసనాలు ఆధారంగా లభిస్తున్నాయి
S9. Ans (a)
Sol: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సరళంగా అర్థంచేసుకోవడానికి వీలుగా దాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. అవి
- 1930 నుంచి 1940 వరకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వ్యక్తిగతమైన ఆందోళనలు.
- నుంచి 1946 వరకు భూస్వాములకు, దేశముఖకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
- 1946 నుంచి 1948 వరకు భూస్వాములకు, దేశ్ముఖ్ కు, రజాకర్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు జరిపిన రైతాంగ సాయుధ పోరాటాలు.
- 1948 నుంచి 1951 వరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, తెలంగాణా ప్రజానీకం సాగించిన ప్రజా సాయుధ పోరాటాలు.
S10. Ans(c)
Sol: పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదటివాడు. ఇతడే శాతవాహన రాజ్య స్థాపకుడు. కోటిలింగాల వద్ద దొరికిన శ్రీముఖునికి సంబంధించిన 8 నాణేల్లో ఒకటి మాత్రమే పోటెన్ అనే మిశ్రమ నాణెం, మిగిలినవన్నీ రాగి నాణేలు. ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చీముకుడని ముద్రించి ఉంది. శాసనాల్లో సిముకుడిగా, పురాణాల్లో చిస్మకుడుగా, నాణేలపై చీమకుడుగా ముద్రించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |