Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. నిజామాంధ్ర యువతీ మండలి కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
- ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవీలు కలిసి నిజమాంధ్ర యువతిమండలిని 1935లో స్థాపించారు.
- యువతీమండలి 1955లో ఒక శిశు వికాస్ విహార్ను నెలకొల్పారు.
- నిజామాంధ్ర యువతి మండలి దుర్గాబాయ్ దేశముఖ్ హైదరాబాద్లో స్థాపించిన ఆంధ్ర మహిళ సభకం 15 సంవత్సరాలు ముందే ఏర్పడి మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసింది.
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1, 2, 3
Q2. . కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- నందిని సిద్ధారెడ్డి 1. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం
- మిట్టపల్లి సురేందర్ 2. పల్లే కన్నీరు పెడుతుందో
- గోరటి వెంకన్న 3. రాతి బొమ్మల్లోనా
- అభినయ శ్రీనివాస్ 4. నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q3. ‘తెలంగాణ జాగృతి’ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి’ ఆవిర్భవించింది.
- తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
- పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
- బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి.
- 1 మరియు 2 మాత్రమే
- 2 మాత్రమే
- 3 మరియు 4 మాత్రమే
- పైవన్నీ
Q4. అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు చేసింది ఎవరు?
- శ్రీకాంతచారి
- జాక్
- జార్జి రెడ్డి
- బండారు శ్రీనివాస్
Q5. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కింద పేర్కొన్న వాటిలో ఆ రెండూ అంశాలు ఏవి?
- తెలంగాణ ప్రాంత ప్రతినిధులు రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెట్టాలి అన్నారు. (ఇది ముసాయిదా బిల్లులో ఉన్నది). ఆంధ్రప్రాంత ప్రతినిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండాలన్నారు.
- గుంటూరులో హైకోర్టు బెంచ్, హైదరాబాదులో ప్రధానపీఠం ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అన్నారు. గుంటూరులో బెంచ్ ఉండనవసరం లేదని, హైకోర్టు హైదరాబాదులోనే ఉండాలని ఆంధ్రప్రాంత ప్రతినిధులు అన్నారు.
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q6. 1969 ఉద్యమంలో మహిళలు ఎంతో చురుకైన పాత్రపోషించారు. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
- 1969 మే లో హన్మకొండలో మహిళా సదస్సు జరిగింది. ఈ మహిళా సదస్సుకు దేవకి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా ఈశ్వరీబాయి విచ్చేశారు.
- హైదరాబాద్ తరువాత ఉద్యమం వరంగల్లోనే పెద్దఎత్తున జరిగింది. వరంగల్లో స్వాతంత్య్ర సమరయోధురాలు, ఎం.ఎల్.సి అయిన కనకరత్నమ్మ స్త్రీలకు ప్రాతినిధ్యం వహించారు.
- 1969 జూన్ 17న తెలంగాణ మహిళాదినం ను జరిపారు.
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3
(c) 1 మరియు 2
(d) 1, 2, 3
Q7. 1969 ఉద్యమం సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింది వాటిలో ఏవి?
- అఖిలపక్ష సమావేశం.
- G.O.36
- అష్టసూత్ర పథకం
- పంచసూత్ర పథకం
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) పైనపెర్కొన్నవని
Q8. 1972 ఫిబ్రవరి 14న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పుచెప్పింది . ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లోని అజంజాహీమిల్ మైదానంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించింది ఎవరు?
- జవహార్ లాల్ నెహ్రూ
- ఇందిరాగాంధీ
- డా.బి.ఆర్.అంబేద్కర్
- మహాత్మాగాంధీ
Q9. తెలంగాణ ఉద్యమ సమయంలో గోడలపై ఆంధ్రనాయకులపై కోపంతో స్త్రీలను అవమానపరిచే వ్రాతలను వ్రాయగా ఎవరి ఆధ్వర్యంలో మహిళలు ఆ రాతలను తుడిచివేసే కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ నుండి ప్రారంభించి పూర్తిచేశారు?
- రాణికుముదినీ నాయక్
- టి.ఎన్.సదాలక్ష్మి
- సుమిత్రాదేవి
- సంగం లక్ష్మీబాయమ్మ
Q10. ప్రతిపాదన (A): కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.
కారణము (R) : తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Solutions:
S1. Ans (d)
Sol: నిజామాంధ్ర యువతీ మండలి :
- ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవీలు కలిసి నిజమాంధ్ర యువతిమండలిని 1935లో స్థాపించారు.
- యువతీమండలి 1955లో ఒక శిశు వికాస్ విహార్ను నెలకొల్పారు.
- నిజామాంధ్ర యువతి మండలి దుర్గాబాయ్ దేశముఖ్ హైదరాబాద్లో స్థాపించిన ఆంధ్ర మహిళ సభకం 15 సంవత్సరాలు ముందే ఏర్పడి మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసింది.
S2. Ans (d)
Sol:
- నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ – నందిని సిద్ధారెడ్డి
- పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, – గోరటి వెంకన్న
- రాతి బొమ్మల్లోనా – మిట్టపల్లి సురేందర్
- ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం – అభినయ శ్రీనివాస్
S3. Ans (d)
Sol:’తెలంగాణ జాగృతి’ :
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి’ ఆవిర్భవించింది.
- తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
- పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
- బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి
S4. Ans (a)
Sol: తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దహనకాండకు నిరసన హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ చౌరస్తాలో అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల సాక్షిగా నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంత చారీ తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. శ్రీకాంతచారి అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు ఇచ్చాడు
S5. Ans (c)
Sol: పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి.
- తెలంగాణ ప్రాంత ప్రతినిధులు రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెట్టాలి అన్నారు. (ఇది ముసాయిదా బిల్లులో ఉన్నది). ఆంధ్రప్రాంత ప్రతినిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండాలన్నారు.
- గుంటూరులో హైకోర్టు బెంచ్, హైదరాబాదులో ప్రధానపీఠం ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అన్నారు. గుంటూరులో బెంచ్ ఉండనవసరం లేదని, హైకోర్టు హైదరాబాదులోనే ఉండాలని ఆంధ్రప్రాంత ప్రతినిధులు అన్నారు
S6. Ans(d)
Sol: 1969 ఉద్యమంలో మహిళలు ఎంతో చురుకైన పాత్ర పోషించారు.
- హైదరాబాద్ తరువాత ఉద్యమం వరంగల్లోనే పెద్దఎత్తున జరిగింది. వరంగల్లో స్వాతంత్య్ర సమరయోధురాలు, ఎం.ఎల్.సి అయిన కనకరత్నమ్మ స్త్రీలకు ప్రాతినిధ్యం వహించారు.
- 1969 మే లో హన్మకొండలో మహిళా సదస్సు జరిగింది. ఈ మహిళా సదస్సుకు దేవకి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా ఈశ్వరీబాయి విచ్చేశారు.
- 1969 జూన్ 17న తెలంగాణ మహిళాదినం ను జరిపారు. ఈ మహిళాదినం సందర్భంగా మహిళలు పెద్దసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
S7. Ans(d)
Sol: 1969 ఉద్యమం సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
- అఖిలపక్ష సమావేశం.
- G.O.36
- అష్టసూత్ర పథకం
- పంచసూత్ర పథకం
S8. Ans(b)
Sol: 1972 ఫిబ్రవరి 14న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పుచెప్పింది . ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లోని అజంజాహీమిల్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించింది.
S9. Ans(a)
Sol: తెలంగాణ ఉద్యమ సమయంలో గోడలపై ఆంధ్రనాయకులపై కోపంతో స్త్రీలను అవమానపరిచే వ్రాతలను వ్రాయగా కుముదినీ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు ఆ రాతలను తుడిచివేసే కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ నుండి ప్రారంభించి పూర్తిచేశారు.
ఇటువంటి రాతలు రాయకుండా అరికట్టవలసిందిగా విజ్ఞప్తి చేసిన శాంతిసమితి నాయకులు :
- చంద్రశేఖర్ (అధ్యక్షుడు)
- ఎం.కె.వి.రెడ్డి (ఉపాధ్యక్షుడు)
- బి. కృష్ణంరాజు (కార్యదర్శి)
S10. Ans (a)
Sol: 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో ఒక యువకుడు నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ ఫిబ్రవరి 28, 1969 తేదీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |