Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 10 September 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 08 September 2022 |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. ఈ క్రింది వానిని జతపరచండి.

జాబితా – I జాబితా – II

(అధికార చిహ్నాలు) (శాస్ర్తీయ నామం)

  1. పాలపిట్ట 1. యాక్సిస్ యాక్సిస్
  2. జింక 2. కొరల్కాస్ బెంగలెన్సిస్
  3. జమ్మిచెట్టు 3. క్యాసియా అరిక్యులేటా
  4. తంగేడు పూలు 4. ప్రోసోపిస్ సినరేరియా

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q2. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఏ జిల్లాను పిలుస్తారు

  1. నిజామాబాద్ 
  2. వరంగల్
  3. ఖమ్మం 
  4. కరీంనగర్

 

Q3. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గచ్చుకు ఉపయోగపడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు ఏ జిల్లాలో లభిస్తున్నాయి?

  1. మహబూబ్‌నగర్ 
  2. రంగారెడ్డి 
  3. మెదక్  
  4. వరంగల్ 

 

Q4. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను దీనిని 3 కారిడార్లు విభజించారు (72 కి.మీ.). ఒక్కొక్క కారిడార్ ను  ఒక్కొక్క రంగు సూచిస్తుంది. కింది వాటిలో ఏది సరైంది?

  1. కారిడార్ 1 (రెడ్ లైన్) : మియాపూర్- ఎల్.బి.నగర్ (29 కి.మీ, 27 స్టేషన్లు )
  2. కారిడార్ 2 (గ్రీన్ లైన్) : ఫలక్ నుమా పరేడ్ గ్రౌండ్ (15 కి.మీ, 14 స్టేషన్లు )
  3. కారిడార్ 3 (యెల్లో లైన్): నాగోలు- M.G.B.S (28 కి.మీ, 23 స్టేషన్లు )

(a) 1, 2 మాత్రమే

(b) 2, 3 మాత్రమే

(c) 1, 3 మాత్రమే

(d) 1, 2 & 3  

 

Q5. “పేదవాడి తిరుపతి” గా ప్రసిద్ధి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది?

  1. జటప్రోలు
  2. గద్వాల్
  3. అలంపూర్
  4. తిరుపతి

 

Q6. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ సంస్కరణ కోసం నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగారి కమిటీకి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్నవ మహాసభలో సూచించింది?

(a) ఐదవ నిజామాంధ్ర మహాసభ

(b) 7వ నిజామాంధ్ర మహాసభ

(c) 3 వ నిజామాంధ్ర మహాసభ

(d) ఆరవ నిజామాంధ్ర మహాసభ

 

Q7. ఇతర రాష్ట్రాలలో అప్పటివరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)తో గాని, స్వతంత్రంగా గాని ఉన్న రైతాంగ నాయకులు మొదటి అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితిలో ఏకమై ఎప్పుడు భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు)ని స్థాపించారు?

  1. ఏప్రిల్ 22, 1969
  2. మే 25, 1969
  3. జూన్ 17, 1978
  4. జూన్ 20, 1978

 

Q8. 1952 ఆగస్టులో ‘హైదరాబాద్ హిత రక్షణ సమితి’ ని స్థాపించబడింది. ఈ సమితి ద్వారా నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ సమితిని స్థాపించింది ఎవరు?

  1. రామాచారి
  2. హయగ్రీవాచారి
  3. కె.వి రంగారెడ్డి
  4. మర్రి చెన్నారెడ్డి

 

Q9. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?

  1. తెలంగాణ తిరుపతి-జమలాపురం
  2. పేదవాడి తిరుపతి – కనుమర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం
  3. తెలంగాణ మైసూర్‌- కొల్లాపూర్‌
  4. సిల్క్ సిటీ ఆఫ్‌ ఇండియా- గద్వాల్‌

 

Q10. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ ఎన్ని సంవత్సరాలు అధికార భాషగా ఉండాలి

  1. మొదటి 10 సంవత్సరాలు
  2. మొదటి 20 సంవత్సరాలు
  3. మొదటి 5 సంవత్సరాలు 
  4. మొదటి 15 సంవత్సరాలు

Solutions:

S1. Ans (a)

Sol: తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును రాష్ట్ర ప్రభుత్వం 2014, నవంబర్ 17న ఖరారు చేసింది.

  • పాలపిట్ట (ఇండియన్ రొల్లెర్ బ్లూ జాయ్) తెలంగాణ సంస్కృతిలో భాగం. పాలపిట్ట శాస్త్రీయ నామం కొరల్కాస్ బెంగలెన్సిస్. 
  • రామాయణం వంటి గాథలలో జింకకు (స్పాటెడ్ డీర్) ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో జింకలు సంచరిస్తాయి. జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్. 
  • జమ్మిచెట్టు తెలంగాణ ప్రజాజీవితంలో అంతర్భాగం. దసరా సందర్భంగా జమ్మికి పూజలు చేసి ఆకులను తీసుకెళ్లడం తెలంగాణలో ఆనవాయితి. జమ్మిచెట్టు శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినరేరియా.
  • తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మలో వాడే తంగేడు పూలకు ఘనమైన చరిత్ర ఉంది. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. తంగేడు పూల శాస్త్రీయ నామం క్యాసియా అరిక్యులేటా.

 

S2. Ans (d)

Sol: 

  • తెలంగాణాలో అధికంగా వరి పండించే జిల్లాలు: నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జగిత్యాల, ఖమ్మం
  • తెలంగాణలో వరి సాగు విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నిజామాబాద్
  • తెలంగాణలో వరి ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా : నిజామాబాద్
  • ప్రపంచంలో వారిని అధికంగా ఉత్పత్తి చేయునది చైనా తరువాత భారత్.
  • రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ: కరీంనగర్

 

S3. Ans (b)

Sol: దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గచ్చుకు ఉపయోగించ బడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు (షాబాద్ బండలు) రంగారెడ్డి జిల్లాలో లభిస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని లంబాపూర్, నమ్మాపురం మరియు ఎల్లాపురం గ్రామాలలో 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు లెక్కించబడింది. నీస్ (Gneissis) గ్రానైట్ నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మరియు ఇతర పరిసర ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి.

 

S4. Ans (a)

Sol: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్: ప్రాజెక్టు అంచనా వ్యయం-14,132 కోట్లు. ఇందులో రూ.1,458 కోట్లు (10%) మూలధన గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.3,000 కోట్లు.

  • దీనిని 3 కారిడార్లు విభజించారు (72 కి.మీ.). ఒక్కొక్క కారిడార్ను ఒక్కొక్క రంగు సూచిస్తుంది.
  • కారిడార్ 1 (రెడ్ లైన్) : మియాపూర్- ఎల్.బి.నగర్ (29 కి.మీ, 27 స్టేషన్లు )
  • కారిడార్ 2 (గ్రీన్ లైన్) : ఫలక్ నుమా పరేడ్ గ్రౌండ్ (15 కి.మీ, 14 స్టేషన్లు )
  • కారిడార్ 3 (బ్లూ లైన్): నాగోలు- రాయదుర్గం (28 కి.మీ, 23 స్టేషన్లు )

 

S5. Ans (b)

Sol: గద్వాల్: గద్వాల్ పట్టణం చెన్నకేశవస్వామి ఆలయానికి ప్రసిద్ధి. రాజులు క్రీ.శ.17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మిం వారు. గద్వాలకు 20 కిలోమీటర్ల దూరంలోని కనుమర్తిలో గుట్టపై నున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ప్రముఖ మైనది. ఈ ఆలయాన్ని “పేదవాడి తిరుపతి”గా వర్ణిస్తారు. గద్వాల్ పట్టణం చేనేత నూలు, పట్టు చీరెలకు కూడా బాగా ప్రసిద్ధి. ఈ చీరల అంచుకు, పల్లుకు సుసంపన్నమైన సంప్రదాయక డిజైన్లు వేస్తారు.

 

S6. Ans(d) 

Sol: ఆరవ నిజామాంధ్ర మహాసభలోనే హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ సంస్కరణ కోసం నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగారి కమిటీకి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించింది. నిజామాంధ్ర మహాసభ ఇలా రాజకీయ తీర్మానం చేయటం ఇదే మొదటిసారి.

 

S7. Ans (a)

Sol: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, బీహార్లోని ముషాహరి, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ – భేరి, బెంగాల్లోని బీర్భం, కేరళలోని వైనాడు, పంజాబ్లోని ఫిరోజ్ పూర్ వంటి ఎన్నో చోట్ల రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల రైతాంగ పోరాట నాయకులు నక్సల్బరీ పంథాను అంగీకరించి, నక్సల్బరీ పోరాట నాయకులతో సంబంధం పెట్టుకున్నారు. ఆయా రాష్ట్రాలలో అప్పటివరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)తో గాని, స్వతంత్రంగా గాని ఉన్న రైతాంగ నాయకులు మొదటి అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితిలో ఏకమై చివరికి ఏప్రిల్ 22, 1969న భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు)ని స్థాపించారు

 

S8. Ans(a)

Sol: నిజాం ప్రభుత్వంలో రామాచారి ‘లాయక్అలీ’ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఇతను మరాఠా ప్రాంతానికి చెందిన వ్యక్తి.

  • 1952 సాధారణ ఎన్నికలలో శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు. 
  • ఇతను 1952 ఆగస్టులో హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించాడు.
  • ఈ సమితి ద్వారా నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాడు.
  • రామాచారి నేతృత్వంలో కొనసాగుతున్న ఉద్యమాన్ని:
  • ప్రోత్సహించిన గొప్పనాయకుడు హయగ్రీవాచారి.
  • పరోక్షంగా ప్రోత్సహించిన మంత్రులు కె.వి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి

 

S9. Ans(d)

Sol: 

  • తెలంగాణ తిరుపతి-జమలాపురం
  • పేదవాడి తిరుపతి – కనుమర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం
  • తెలంగాణ మైసూర్‌- కొల్లాపూర్‌
  • సిల్క్ సిటీ ఆఫ్‌ ఇండియా- పోచంపల్లి

 

S10. Ans(c)

Sol: పెద్ద మనుషుల ఒప్పందం:

ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రభవన్)లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఒప్పందంనే పెద్దమనుషుల ఒప్పందం (లేదా) జెంటిల్మెన్ అగ్రిమెంట్ అందురు.

ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – నలుగురు నాయకులు. తెలంగాణా నుండి 4గురు నాయకులు సంతకం చేశారు.

పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉర్దూ-దాని స్థానం:

భారత ప్రభుత్వం ప్రస్తుతం పాలనా, న్యాయవ్యవస్థల గల ఉర్దూ స్థానాన్ని రాబోయే ఐదు సంవత్సరాలపాటు పదిలంగా ఉంచేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సూచనలిస్తుంది.

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu 08 September 2022 |_80.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!