Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 09 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 04 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. జనరల్ జె.ఎస్. చౌదరీ చేసిన మొదటి సంస్కరణలలో ముఖ్యమైనది 1949 ఫిబ్రవరి 6 న విడుదల చేసిన ఫర్మానా. ఈ ఫర్మానా ప్రకారం :

  1. నిజాం సొంత ఆస్తి సర్ఫేఖాస్ ను రద్దు చేశారు.
  2. నిజాం కరెన్సీ (హెూలిసిక్కా) రద్దయింది.
  3. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా శుక్రవారంను రద్దుచేసి ఆదివారంను సెలవుదినంగా ప్రకటించారు.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

 

Q2. ముల్కీలకు కొన్ని రక్షణలను కల్పిస్తూ 1910లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.ఈ ప్రకటనకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. నానముల్కీల ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించబడుతాయి.
  2. ఉద్యోగ నియామకాలు రాజకీయ జోక్యంతో కాకుండా రాతపరీక్ష ద్వారా జరగాలి.
  3. స్థానికులకు తగిన అర్హతలు ఉన్నప్పుడు ఆ పదువులలో స్థానికులనే నియమించాలి. స్థానికేతరులను నియమించకూడదు.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

 

Q3. కింది వాటిని జతపరుచూము.

జాబితా – I జాబితా- II

  1. 5వ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం  1. సిరిసిల్ల
  2. 6వ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం  2. ఖమ్మం
  3. 7వ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం 3. దేవరకొండ
  4. 8వ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం 4. జోగిపేట

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q4. గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి. అవి ఏవి?

  1. అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు. 
  2. స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు. 
  3. శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం. 
  4. స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో). 
  5. పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం. శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.
  1. 1,2  మరియు 4 మాత్రమే
  2. 2,4 మరియుమాత్రమే
  3. 1, 3 మరియు 5 మాత్రమే
  4. పైవన్నీ

 

Q5. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు. అలాంటి కవులలో ఈ కింది వాటిని సరిగ్గా జత కానివి ఏవి? 

  1. బండి యాదగిరి  బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా”.
  2. సుద్దాల హన్మంతు  “పల్లెటూరి పిల్లగాడో”.
  3. దాశరథి కృష్ణమాచార్యులు –  “నా తెలంగాణ కోటి రతనాల వీణ”
  1. 1 మాత్రమే
  2. 2 మరియు 3 మాత్రమే
  3. 3 మాత్రమే
  4. పైనవన్నీ సరైనవే

 

Q6. ప్రతిపాదన (A):  కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.

కారణము (R) : తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

 

Q7. ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ బద్ధత చేకూర్చడానికి 1973, డిసెంబర్ 23వ తేదీన కేంద్రం 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది?

  1. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 371(1) నిబంధనను సవరించారు. 371(డి), 371(ఇ) అనే నిబంధనలు జత చేశారు.
  2. ఏడవ షెడ్యూలు మొదటి జాబితాలోని 63వ అంశాన్ని సవరించారు. 
  3. ఈ రాజ్యంగసవరణ బిల్లుపై మే నెల 3వ తేదీ, 1974న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా, సవరణ చట్టం జూలై ఒకటో తేదీ, 1974 నుంచి అమల్లోకి వచ్చింది.
  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మరియుమాత్రమే
  3. 3 మరియు 1 మాత్రమే
  4. పైవన్నీ

 

Q8. మిగులు నిధులకు సంబంధించి తెలంగాణ ప్రాంతీయ సంఘం పనితీరు కు  సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది?

  1. 1956 నుండి 1959 వరకు ప్రభుత్వం తెలంగాణలో చేయాల్సిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని టి.ఆర్.సి. తన నివేదికలో పేర్కొంది.
  2. 1961లో తెలంగాణ శాసనసభ్యులు రీజనల్ కమిటీ మిగులు నిధుల గూర్చి ప్రశ్నించగా ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులు 10.7 కోట్లు అని 1961 ఆగష్టులో పేర్కొంది.
  3. 1961 వరకు ఉన్న మిగులు నిధులను ఈ పది సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలని ప్రాంతీయ సంఘం తీర్మానించింది.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q9. నిజాం కాలంలో నాణ్యమైన ఉచిత వైద్య వ్యవస్థ ఉండేది. దాంతో తెలంగాణ ప్రజలు ఉచితంగా వైద్య వసతులు పొందేవారు. నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్యోగ సంరక్షణ పథకం ప్రమాణాల రీత్యా ఎంతో ఉన్నతమైనది, విలువైనది.

నిజాం కాలంలో నిర్మించిన వైద్యశాలలకు సంబంధించి కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II

  1. విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి 1. ప్రత్యామ్నాయ పద్ధతులలో వ్యాధులకు చికిత్స అందించేది
  2. యునాని దవఖానా 2. మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చి చికిత్స అందించేది
  3. రాస్ క్వారంటైన్ ఆసుపత్రి 3. చిన్నపిల్లలకు చికిత్స అందించేది
  4. నీలోఫర్ ఆసుపత్రి 4. కలరా, మశూచి, ప్లేగు, మలేరియా వంటి అంటు వ్యాధులకు వైద్యం అందించేది

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q10. ప్రతిపాదన (A):  వలసవాదం ద్వారానే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది. 

కారణము (R) : పెట్టుబడిదారి దేశాల పారిశ్రామిక ఉత్పత్తులకు వలసవాద దేశాలు పెద్ద మార్కెట్లుగా ఉపయోగపడ్డాయి.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Solutions:

S1. Ans (d)

Sol: జనరల్ జె.ఎస్. చౌదరీ చేసిన మొదటి సంస్కరణలలో ముఖ్యమైనది 1949 ఫిబ్రవరి 6 న విడుదల చేసిన ఫర్మానా.

ఈ ఫర్మానా ప్రకారం :

  • నిజాం సొంత ఆస్తి సర్ఫేఖాస్ ను రద్దు చేశారు.
  • నిజాం కరెన్సీ (హెూలిసిక్కా) రద్దయింది.
  • ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా శుక్రవారంను రద్దుచేసి ఆదివారంను సెలవుదినంగా ప్రకటించారు.

 

S2. Ans (d)

Sol: ముల్కీలకు కొన్ని రక్షణలను కల్పిస్తూ 1910లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

1910 ప్రకటన:

  • నానముల్కీల ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించబడుతాయి.
  • ఉద్యోగ నియామకాలు రాజకీయ జోక్యంతో కాకుండా రాతపరీక్ష ద్వారా జరగాలి.
  • స్థానికులకు తగిన అర్హతలు ఉన్నప్పుడు ఆ పదువులలో స్థానికులనే నియమించాలి. స్థానికేతరులను నియమించకూడదు.

 

S3. Ans (d)

Sol: ఐదవ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం 1930లో జోగిపేటలో జరిగింది. ఆరవ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం 1931 మార్చి నెలలో దేవరకొండలో జరిగింది. 7వ నిజామాంధ్ర జనకేంద్ర సంఘం సమావేశం 1934 మార్చినెలలో ఖమ్మంలో జరిగింది. ఎనిమిదవ నిజామాంధ్ర జనకేంద్ర సంఘ సమావేశం 1935 డిసెంబర్ నెలలో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో జరిగింది

 

S4. Ans (d)

Sol: గన్ పార్క్ లో వున్న అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా విశిష్టతలున్నాయి 

  • అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు. నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న చిన్న రధ్రాలు ఉన్నాయి. అవి అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెటుర్తులు. 
  • స్థూపాన్ని ఎరుపు రంగురాయితో నిర్మించారు. ఎరుపు త్యాగానికి, సాహసానికి చిహ్నం. అక్కడ ఒక మకరతోరణం చెక్కారు. దానిని సాంచిస్థూపం నుంచి స్వీకరించారు. 
  • శిలాఫలాకానికి నాలుగువైపులా పుష్పాలను చెక్కారు. అవి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారనేందుకు సంకేతం. స్థూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంటుంది. 
  • ఏవైపు నుంచి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. అవి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం (1975లో). 
  • పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ధర్మం, శాంతి, సహనాలకు అదిగుర్తు. పై ఆదర్శాలకోసం అమరులు తమ ప్రాణాలను అర్పించారనేందుకు నిదర్శనం. 
  • శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు ఉన్న పుష్పం ఉంది.

 

S5. Ans (b)

Sol:  తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో ఎందరో కవుల తమ కవితలు, పాటలు ద్వారా తమదైన శైలిలో ఉద్యమానికి బాసటగా నిలిచారు.

  • తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంలో సుద్దాల హన్మంతు వ్రాసిన “పల్లెటూరి పిల్లగాడో”.
  • బండి యాదగిరి రాసిన బండి వెనుక బండికట్టి నైజం సర్కారోడా” వంటి పాటలు
  • దాశరథి కృష్ణమాచార్యులు ఓనిజాము పిశాచమా”, “నా తెలంగాణ కోటి రతనాల వీణ” వంటి కవితలు, తిరునగరి, రామాంజనేయుల స్మృతిగీతాలు, కాళోజీ గీతాలు తెలంగాణ ప్రజలపై ప్రభావాన్ని చూపించాయి.

 

S6. Ans (a)

Sol: 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో ఒక యువకుడు నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ ఫిబ్రవరి 28, 1969 తేదీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.

 

S7. Ans (d)

Sol: ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ బద్ధత చేకూర్చడానికి 1973, డిసెంబర్ 23వ తేదీన కేంద్రం 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. 

  • లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్ అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
  • 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 371(1) నిబంధనను సవరించారు. 371(డి), 371(ఇ) అనే నిబంధనలు జత చేశారు. 
  • ఏడవ షెడ్యూలు మొదటి జాబితాలోని 63వ అంశాన్ని సవరించారు. 
  • ఈ రాజ్యంగసవరణ బిల్లుపై మే నెల 3వ తేదీ, 1974న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా, సవరణ చట్టం జూలై ఒకటో తేదీ, 1974 నుంచి అమల్లోకి వచ్చింది. 

 

S8. Ans (b)

Sol: మిగులు నిధులకు సంబంధించి తెలంగాణ ప్రాంతీయ సంఘం పనితీరు:  

  • 1956 నుండి 1959 వరకు ప్రభుత్వం తెలంగాణలో చేయాల్సిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని టి.ఆర్.సి. తన నివేదికలో పేర్కొంది.
  • 1961లో తెలంగాణ శాసనసభ్యులు రీజనల్ కమిటీ మిగులు నిధుల గూర్చి ప్రశ్నించగా ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులు 10.7 కోట్లు అని 1961 ఆగష్టులో పేర్కొంది.
  • 1961 వరకు ఉన్న మిగులు నిధులను ఈ ఐదారు సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలని ప్రాంతీయ సంఘం తీర్మానించింది.

 

S9. Ans (a)

Sol: నిజాం కాలంలో నాణ్యమైన ఉచిత వైద్య వ్యవస్థ ఉండేది. దాంతో తెలంగాణ ప్రజలు ఉచితంగా వైద్య వసతులు పొందేవారు. నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్యోగ సంరక్షణ పథకం ప్రమాణాల రీత్యా ఎంతో ఉన్నతమైనది, విలువైనది.

ప్రపంచంలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి ఉచిత ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు పురుడు పోసుకోవడానికి ముందే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉచిత ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

  • మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చి విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి కూడా ఉచితంగా సేవలందించింది.
  • ప్రత్యామ్నాయ పద్ధతులలో వ్యాధులకు చికిత్స చేసే యునాని దవఖానా కూడా ఉచితంగానే తనవంతు సేవలందించింది.
  • ఈ పరిస్థితి కేవలం ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. జిల్లా స్థాయిలలోను ఈ ఉచిత వైద్య సేవలు కొనసాగాయి.
  • ‘రాస్ క్వారంటైన్ ఆసుపత్రి’ కలరా, మశూచి, ప్లేగు, మలేరియా వంటి అంటు వ్యాధుల బారిన పడ్డ రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించేది.
  • నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, నిజాం ఆర్థోపెడిక్ ఇనిస్టిట్యూట్, గాంధీ ఆసుపత్రి, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, ఇ.ఎన్.టి ఆస్పత్రి వంటి అనేక ఆసుపత్రులు నిజాం ధనంతో ఏర్పడ్డవి.

 

S10. Ans (a)

Sol: వలసవాదం ద్వారానే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది. ఈ వలసవాద దేశాలు పెట్టుబడిదారీ దేశాలకు ముడిసరుకును. మరియు తక్కువ వేతనానికి పనిచేసే కార్మికులను అందజేసేవి. పెట్టుబడిదారి దేశాల పారిశ్రామిక ఉత్పత్తులకు వలసవాద దేశాలు పెద్ద మార్కెట్లుగా ఉపయోగపడ్డాయి. ఈ పెట్టుబడిదారులు వలసవాద దేశాలలో ఎటువంటి పరిశ్రమలను నిర్మించకుండా కేవలం ముడిసరుకుల రవాణాకు మరియు తాము ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్లుగా వలసదేశాలను ఉపయోగించుకున్నారు.

 

 

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 09 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II_4.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!