Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 08 September 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 06 September 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. నిజాం ఉల్ ముల్క్ ఎక్కడ మరణించాడు?

(a) ఔరంగాబాద్

(b) పైటాన్

(c) ఢిల్లీ

(d) బుర్హాన్ పూర్

 

Q2. ____ పిలువబడే వెండి విద్దాంక నాణేలు (punch-marked coins) మన దేశంలో మధ్య యుగం వరకు చెలామణిలో ఉండేవి. 

  1. శక క్షాత్రప
  2. వత్సగుల్మ
  3. కార్షాపణాలు
  4. పైనవేవి కావు

 

Q3. చాళుక్య వంశంలో ప్రథమంగా ‘మహారాజ’ బిరుదును ధరించింది ఎవరు?

  1. మొదటి పులకేశి
  2. కీర్తి వర్మ
  3. జయసింహుడు
  4. రెండవ పులకేశి

 

Q4. లతీఫ్, షాహినూరి, మీర్జాగులం అనే ప్రసిద్ధ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

  1. ఇబ్రహీం కులీకుతుబ్‌షా
  2. అబుల్ హసన్ తానీషా
  3. అబ్దుల్లా కుతుబ్‌షా
  4. మహమ్మద్ కుతుబ్‌షా

 

Q5. తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద కళ ఏది? 

  1. తొలుబొమ్మలాటలు
  2. యక్షగానం 
  3. ఒగ్గుకథ
  4. కోలాటం

 

Q6. 2004లో భూమి పంపిణీ పై నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షులు?

(a) కొణిజేటి రోశయ్య

(b) మర్రి శశిధర్ రెడ్డి

(c) కోనేరు రంగారావు

(d) ధర్మాన ప్రసాదరావు

 

Q7. క్రింది వానిని జత చేయండి.

  1. అసైన్డ్ భూముల చట్టం 1. 2006 
  2. భూ ఆక్రమణ నిరోధక చట్టం 2. 1982
  3. రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి రద్దు 3. 1977
  4. భూభారతి 4. 2007

సరైన సమాధానం:

A B C D

(a) 1 2 4 3

(b) 2 1 4 2

(c) 3 1 2 4

(d) 3 2 4 1

 

Q8. తెలంగాణ రాష్ట్రం యొక్క అటవీ విస్తీర్ణం శాతం ఎంత?

(a) 16.3 శాతం 

(b) 16.9 శాతం

(c) 21.8 శాతం

(d) 24 శాతం

 

Q9. మొదటి దశ కి సంబంధించి ఈ కింద పేర్కొన్న వాటిలో ఏది సరైంది

(a) 1950 – హైదరాబాద్ కౌలు చట్టం

(b) 1949 – జాగీర్దారు రద్దు చట్టం 

(c) a మరియు b రెండూ

(d) పైవేవి కావు

 

Q10. నీటిని ఎలా పంచుకోవాలనే విషయంపై ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. దీనిని ఏమని అంటారు

(a) నది జలాల నియమం

(b) హెల్సెంకీ నియమం

(c) బ్రిజేష్ నియమం

(d) పైనవెవి కావు

Solutions:

S1. Ans (d)

Sol: 1748లో మహారాష్ట్రలోని బుర్హాన్పూర్ లో నిజాముల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు. నిజాముల్ ముల్క్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కవిపండిత పోషకుడు మరియు గొప్ప ఉదారవాది. 

 

S2. Ans (c)

Sol: కార్షాపణాలుగా పిలువబడే వెండి విద్దాంక నాణేలు (punch-marked coins) మన దేశంలో మధ్య యుగం వరకు చెలామణిలో ఉండేవి. కాబట్టి, వాకాటక రాజ్యంలో శాతవాహనుల నాణేలు, క్షాత్రపుల నాణేలు లభించడాన్ని బట్టి, వాకాటకుల కాలం వరకు కూడా వీటి చెలామణి జరిగిందని వి.యస్.అగ్రవాలా అభిప్రాయపడ్డారు.

 

S3. Ans (a)

Sol: మొదటి పులకేశి (క్రీ.శ.535-566) ఇతను రణరాగుడు ని కుమారుడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు.చాళుక్య వంశంలో ‘ప్రథమంగా ‘మహారాజ’ బిరుదును ధరించింది ఇతనే.ఇతని శాసనం ఒకటి ఏలేశ్వరం లో లభించింది కాబట్టి ఇతని రాజ్యం నల్గొండ వరకు విస్తరించింది అని చెప్పవచ్చును.

 

S4. Ans (b)

Sol: అబ్దుల్ హసన్ తానీషా (1672-87) తానీషా ఆస్థానంలో లతీఫ్, షాహినూరి, మీర్జాగులాం అలీ లాంటి ప్రసిద్ధ కవులుండేవారు. ఇతడి కాలంలో వజ్జి, గవాసీ తదితర ఉర్దూ కవులు తమ కవిత్వం ద్వారా ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఉర్దూ రాజభాషగా పరిణతి చెందింది. 

 

S5. Ans (d)

Sol: తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద కళ కోలాటం. కోలలు ప్రధానపాత్ర వహిస్తాయి. కాబట్టి, దీనికి కోలాటం (కోలల ఆట) అనే పేరు సార్థకమైంది. చేతిలోని కోలలు కొట్టినప్పుడు కలిగే లయ, కాలిగజ్జె సవ్వడుల శ్రుతి, పాదాల విన్యాసం వాటికి తగ్గట్టుగా గీతమాధుర్యం ఈ విధంగా నాలిగింటినీ సమన్వయపరచే కళారూపం ఇది. జానపదులు దీన్ని ఒక ఆటగానే భావించినా పరిశోధకుల దృష్టికి ఇది నాట్య, సంగీత, గానాలు కలిసిన ఒక విశిష్టమైన కళారూపం. కోలాటంలోని వస్తు వైవిధ్యాన్ని కోపుఅంటారు. కోపుల్లో జడకోపుక్లిష్టమైంది. విశిష్టతను కలిగింది.

 

S6. Ans(c)

Sol: 2004లో భూమి పంపిణీ పై నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షులు కోనేరు రంగారావు 

 

S7. Ans (d)

Sol:  

  • అసైన్డ్ భూముల చట్టం 1977
  • భూ ఆక్రమణ నిరోధక చట్టం 1982
  • రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ట పరిమితి రద్దు 2007 
  • భూభారతి 2006

 

S8. Ans(d)

Sol: రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,969 చ.కి.మీ. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24శాతం. ఇది జాతీయ సగటు 21.34 శాతం కంటే ఎక్కువ, ఛత్తీస్ ఘడ్ మరియు ఒడిశా మినహాయించి పొరుగు రాష్ట్రాలను పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది.

 

S9. Ans(c)

Sol: మొదటి దశ 1956-1970

  • 1949 – జాగీర్దార్ రద్దు చట్టం అమలు 
  • 1950 – హైదరాబాద్ కౌలుదారు చట్టం
  • 1956 నుండి 12సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి జరిగిన తీరుకి పర్యవసనంగా 1969లో జరిగిన ఉద్యమం అని చెప్పవచ్చు.

 

S10. Ans(b)

Sol: నీటిని ఎలా పంచుకోవాలనే విషయంపై ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. దీనినే హెల్సెంకీ నియమం 

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!