Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 04 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu,02 August 2022, For TSPSC Groups and Telangana SI and Constable |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. నిజామాంధ్ర యువతీ మండలి కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవీలు కలిసి నిజమాంధ్ర యువతిమండలిని 1935లో స్థాపించారు.
  2. యువతీమండలి 1955లో ఒక శిశు వికాస్ విహార్ను నెలకొల్పారు.
  3. నిజామాంధ్ర యువతి మండలి దుర్గాబాయ్ దేశముఖ్ హైదరాబాద్లో స్థాపించిన ఆంధ్ర మహిళ సభకం 15 సంవత్సరాలు ముందే ఏర్పడి మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసింది.

(a) 1 మరియు 3 

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q2. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ సంస్కరణ కోసం నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగారి కమిటీకి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్నవ మహాసభలో సూచించింది?

(a) ఐదవ నిజామాంధ్ర మహాసభ

(b) 7వ నిజామాంధ్ర మహాసభ

(c) 3 వ నిజామాంధ్ర మహాసభ

(d) ఆరవ నిజామాంధ్ర మహాసభ

 

Q3. కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి దిగువ పేర్కొన ప్రకటనలు పరిశిలించండి?

  1. తెలంగాణలో ఉన్న ఆంద్రా ఉద్యోగుల వివారాలు సేకరించడం.
  2. తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయడం.

  పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1, 2 కాదు

 

Q4. భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు

  1. జె చొక్కారావు 
  2. మర్రి చెన్నారెడ్డి 
  3. వెంగళరావు 
  4. కాసు బ్రహ్మానందరెడ్డి 

 

Q5. ప్రతిపాదన (A): దళిత అభ్యున్నతికై భాగ్యరెడ్డి “భాగ్యనగర్” పత్రికను 1925 నుంచి ప్రారంభించారు. కొంతకాలం తరువాత ఈ పత్రిక ఆది హిందూ పత్రికగా మారింది. 

కారణము (R) : దళితులపై జరుగుతున్న ఆరాచకలకు వ్యతిరేకంగా పోరాడటానికి భాగ్యనగర్ పత్రిక ఎంత గానో కృషి చేసింది.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

 

Q6. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II 

  1. 1901  1. దేశోద్ధారక గ్రంధాలయం
  2. 1908 2. ఆంధ్ర సరస్వతి గ్రంధాలయం
  3. 1941 3. రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం
  4. 1918 4. శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q7. తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?

  1. తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా కెసిఆర్ ఏప్రిల్ 27, 2001న హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీని స్థాపించాడు.
  2. ఏప్రిల్ 27, 2002న నల్గొండలో టిఆర్ఎస్ పార్టీ ప్రథమ వార్షిక మహాసభ జరిగింది.
  3. తెలంగాణ రాష్ట్ర సమితి రెండవ వార్షికోత్సవ సభను జైత్రయాత్ర పేరుతో ఏప్రిల్ 27, 2003న వరంగల్లులో నిర్వహించారు. ఈ సభకు 10 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు.
  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మరియుమాత్రమే
  3. 3 మరియు 1 మాత్రమే
  4. పైవన్నీ

 

Q8. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II

  1. నందిని సిద్ధారెడ్డి 1. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం
  2. మిట్టపల్లి సురేందర్ 2. పల్లే కన్నీరు పెడుతుందో
  3. గోరటి వెంకన్న 3. రాతి బొమ్మల్లోనా
  4. అభినయ శ్రీనివాస్ 4. నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q9.తెలంగాణ జాగృతికు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?

  1. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ జాగృతిఆవిర్భవించింది.
  2. తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం
  3. పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం. 
  4. బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి.
  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 3 మరియు 4 మాత్రమే
  4. పైవన్నీ

 

Q10. క్రిందివానిలో సరియైనవి ఏవి?

  1. టిఆర్‌ఎస్‌ పార్టీ ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది
  2. 2001 ఏప్రిల్‌ 27న కెసిఆర్‌ సిద్ధిపేట నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.
  3. తెలంగాణలో 1956 నాటికి 11 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీరందేది
  4. 2001 నవంబర్‌ 17న ఖమ్మం ప్రజాగర్జన జరిగింది
  1. 1,2 మాత్రమే సరియైనవి
  2. 3,4 మాత్రమే సరియైనవి
  3. 1,2,3,4 లు సరియైనవి
  4. పైవేవి కావు

Solutions:

S1. Ans (d)

Sol: నిజామాంధ్ర యువతీ మండలి :

  • ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవీలు కలిసి నిజమాంధ్ర యువతిమండలిని 1935లో స్థాపించారు.
  • యువతీమండలి 1955లో ఒక శిశు వికాస్ విహార్ను నెలకొల్పారు.
  • నిజామాంధ్ర యువతి మండలి దుర్గాబాయ్ దేశముఖ్ హైదరాబాద్లో స్థాపించిన ఆంధ్ర మహిళ సభకం 15 సంవత్సరాలు ముందే ఏర్పడి మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసింది

 

S2. Ans(d) 

Sol: ఆరవ నిజామాంధ్ర మహాసభలోనే హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ సంస్కరణ కోసం నిజాం ప్రభుత్వం నియమించిన అయ్యంగారి కమిటీకి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించింది. నిజామాంధ్ర మహాసభ ఇలా రాజకీయ తీర్మానం చేయటం ఇదే మొదటిసారి.

 

S3. Ans. (c)

Sol: కుమార్ లలిత్ కమిటీ యొక్క కర్తవ్యం:

  • తెలంగాణలో ఉన్న ఆంద్రా ఉద్యోగుల వివారాలు సేకరించడం.
  • తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయడం.

 

S4. Ans. (a)

Sol: భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు జె చొక్కారావు  తప్పుబట్టారు

 

S5. Ans( c)

Sol: దళిత అభ్యున్నతికై భాగ్యరెడ్డి “భాగ్యనగర్పత్రికను 1925 నుంచి ప్రారంభించారు. కొంతకాలం తరువాత ఈ పత్రిక ఆది హిందూ పత్రికగా మారింది.

 

S6. Ans(c)

Sol: 

  • 1901  –  శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం
  • 1908 –  రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం
  • 1941 –  దేశోద్ధారక గ్రంధాలయం
  • 1918 –  ఆంధ్ర సరస్వతి గ్రంధాలయం

 

S7. Ans (d)

Sol:తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ కు సంబంధించి :

  • తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా కెసిఆర్ ఏప్రిల్ 27, 2001న హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీని స్థాపించాడు.
  • ఏప్రిల్ 27, 2002న నల్గొండలో టిఆర్ఎస్ పార్టీ ప్రథమ వార్షిక మహాసభ జరిగింది.
  • తెలంగాణ రాష్ట్ర సమితి రెండవ వార్షికోత్సవ సభను జైత్రయాత్ర పేరుతో ఏప్రిల్ 27, 2003న వరంగల్లులో నిర్వహించారు. ఈ సభకు 10 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు.

S8. Ans (d)

Sol: 

  • నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ – నందిని సిద్ధారెడ్డి
  • పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, – గోరటి వెంకన్న
  • రాతి బొమ్మల్లోనా – మిట్టపల్లి సురేందర్
  • ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం – అభినయ శ్రీనివాస్

 

S9. Ans (d)

Sol:తెలంగాణ జాగృతి‘ :

  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ జాగృతిఆవిర్భవించింది.
  • తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం
  • పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం. 
  • బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి

 

S10. Ans(c)

Sol: 

  • టిఆర్‌ఎస్‌ పార్టీ ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది
  • 2001 ఏప్రిల్‌ 27న కెసిఆర్‌ సిద్ధిపేట నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.
  • తెలంగాణలో 1956 నాటికి 11 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీరందేది
  • 2001 నవంబర్‌ 17న ఖమ్మం ప్రజాగర్జన జరిగింది

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu,02 August 2022, For TSPSC Groups and Telangana SI and Constable |_70.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 04 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II_5.1